Honda Shine : తక్కువ ధర, ఎక్కువ మైలేజ్.. మిడిల్ క్లాస్ ఫేవరేట్ బైక్ ఇదే

Honda Shine : తక్కువ ధర, ఎక్కువ మైలేజ్.. మిడిల్ క్లాస్ ఫేవరేట్ బైక్ ఇదే
x

Honda Shine : తక్కువ ధర, ఎక్కువ మైలేజ్.. మిడిల్ క్లాస్ ఫేవరేట్ బైక్ ఇదే

Highlights

భారతీయ టూ-వీలర్ మార్కెట్‌లో హోండా షైన్ ఇప్పుడు మధ్యతరగతి వారి మొదటి ఛాయిస్‌గా మారింది. రోజువారీ ప్రయాణాలకు, బడ్జెట్‌కు తగ్గ మైలేజ్ ఇచ్చే బైక్‌గా షైన్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

Honda Shine : భారతీయ టూ-వీలర్ మార్కెట్‌లో హోండా షైన్ ఇప్పుడు మధ్యతరగతి వారి మొదటి ఛాయిస్‌గా మారింది. రోజువారీ ప్రయాణాలకు, బడ్జెట్‌కు తగ్గ మైలేజ్ ఇచ్చే బైక్‌గా షైన్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. హీరో స్ప్లెండర్ తర్వాత భారతదేశంలో రెండవ అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిల్ ఇది. గత నెలలో అంటే మే 2025లో హోండా షైన్ మొత్తం 1,68,908 యూనిట్లు అమ్ముడయ్యాయి. మే 2024లో ఇది 1,42,751 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంటే, ఏడాదికి ఏడాది అమ్మకాల్లో దాదాపు 18శాతం పెరుగుదల నమోదైంది. షైన్ అమ్మకాలు పెరగడానికి ముఖ్య కారణాలు.. బడ్జెట్-ఫ్రెండ్లీ ధర, మెరుగైన మైలేజ్, మంచి పనితీరు.

హోండా షైన్ 100 అనేది కంపెనీలో అత్యంత సరసమైన బైక్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.68,794. ఇందులో 98.98సీసీ OBD2B కంప్లైంట్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 7.61 bhp పవర్, 8.05 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. కంపెనీ చెప్పిన ప్రకారం.. ఇది 65 నుండి 75 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. 9 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో, ఈ బైక్ ఒక ఫుల్ ట్యాంక్‌తో 600 కిమీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదు.

ఈ కారణాల వల్లే ఇది మధ్యతరగతి వారికి ఒక ఆప్షన్ గా మారింది. ఫీచర్ల విషయానికి వస్తే, షైన్ 100లో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్, ఫ్రంట్-రియర్ డ్రమ్ బ్రేక్స్, 17-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు, అల్లాయ్ వీల్స్, సైడ్-స్టాండ్ ఇండికేటర్‌తో పాటు ఇంజిన్ కట్-ఆఫ్, 5 కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

మీరు కొంచెం ఎక్కువ పవర్, ప్రీమియం ఫీల్ కోరుకుంటే షైన్ 125 ఒక మెరుగైన ఆప్షన్. దీని డ్రమ్ బ్రేక్ వెర్షన్ ధర రూ.85,021, డిస్క్ బ్రేక్ వెర్షన్ ధర రూ.89,772. ఈ బైక్ 123.94సీసీ ఎయిర్-కూల్డ్, BS6 ఇంజిన్‌తో వస్తుంది. ఇది 10.59 bhp పవర్, 11 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు, ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంది. మైలేజ్ విషయానికి వస్తే, షైన్ 125 కూడా లీటరుకు 60-70కిమీ వరకు ఇంధన సామర్థ్యాన్ని అందించగలదు. ఇందులో CBS, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ , సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, i3S టెక్నాలజీ, సౌకర్యవంతమైన సీటింగ్, స్మూత్ సస్పెన్షన్, కొత్త గ్రాఫిక్స్, ప్రీమియం కలర్ ఆప్షన్లు ఉన్నాయి. దీని టాప్ వేరియంట్‌లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఉన్న డిజిటల్ క్లస్టర్ కూడా ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories