2025 Yezdi Adventure Launch: రోడ్ కింగ్.. మార్కెట్లోకి యెజ్డీ అడ్వెంచర్ బైక్.. అసలు దీని క్రేజ్ గురించి మీకు తెలుసా..?

2025 Yezdi Adventure Launch: రోడ్ కింగ్..  మార్కెట్లోకి యెజ్డీ అడ్వెంచర్ బైక్.. అసలు దీని  క్రేజ్ గురించి మీకు తెలుసా..?
x

2025 Yezdi Adventure Launch: రోడ్ కింగ్.. మార్కెట్లోకి యెజ్డీ అడ్వెంచర్ బైక్.. అసలు దీని క్రేజ్ గురించి మీకు తెలుసా..?

Highlights

2025 Yezdi Adventure Launch: క్లాసిక్ లెజెండ్స్ త్వరలో భారత మార్కెట్లో 2025 యెజ్డి అడ్వెంచర్‌ను విడుదల చేయబోతోంది.

2025 Yezdi Adventure Launch: క్లాసిక్ లెజెండ్స్ త్వరలో భారత మార్కెట్లో 2025 యెజ్డి అడ్వెంచర్‌ను విడుదల చేయబోతోంది. ముందుగా దీనిని మే 15, 2025న ప్రారంభించాలని నిర్ణయించారు, కానీ భారతదేశం, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా, కంపెనీ దాని ప్రారంభ తేదీని వాయిదా వేసింది. దీని కొత్త లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు, కానీ జూన్‌లో విడుదల చేస్తారని భావిస్తున్నారు. 2025 క్లాసిక్ లెజెండ్స్ యెజ్డి అడ్వెంచర్‌లో ఎటువంటి ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఉంటాయో తెలుసుకుందాం.

2025 Yezdi Adventure Design

2025 యెజ్డి అడ్వెంచర్ డిజైన్‌లో అనేక ప్రధాన మార్పులను చూడవచ్చు. కొత్త హెడ్‌లైట్, టెయిల్ లైట్, సీటులో కూడా చాలా మార్పులను చూడవచ్చు. ఇది మాత్రమే కాదు, కొత్త యెజ్డి అడ్వెంచర్‌కు కొత్త కలర్ స్కీమ్ కూడా ఇవ్వచ్చు, దీనిలో కొత్త గ్రాఫిక్స్ కూడా ఉంటాయని భావిస్తున్నారు.

2025 Yezdi Adventure Specifications

2025 యెజ్డి అడ్వెంచర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్,USB టైప్-C ఛార్జ్ పోర్ట్‌తో కూడిన LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్లు మునుపటిలాగే ఉండే అవకాశం ఉంది. దీనిలో మూడు ABS మోడ్‌లు కూడా ఉంటాయి - రోడ్, రెయిన్, ఆఫ్-రోడ్. కొత్త అడ్వెంచర్‌లో ఇంకా చాలా గొప్ప ఫీచర్లను చూడచ్చు, ఇది డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.

2025 Yezdi Adventure Engine

2025 యెజ్డి అడ్వెంచర్‌ను అదే 334సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో చూడవచ్చు, ఇది 29.6పిఎస్ పవర్, 29.8ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఉంటుంది. దీని ఇంజిన్‌ను తాజా OBD-2B ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేయచ్చు. దాని ఇంజిన్ ట్యూన్‌లో స్వల్ప మార్పులు ఉంటాయి.

2025 Yezdi Adventure Price

ఇటీవల విడుదల చేసిన యెజ్డి అడ్వెంచర్ ధర రూ. 2,09,900 నుంచి రూ. 2,19,900 మధ్య ఉంటుంది, ఎక్స్-షోరూమ్. కొత్త అప్‌డేట్ వచ్చిన తర్వాత, దాని ధరలో స్వల్ప పెరుగుదల ఉండచ్చు. భారతీయ మార్కెట్లో, ఇది XPulse 210, KTM 250 అడ్వెంచర్, సుజుకి V-Strom SX 250, టీవీఎస్ అపాచీ RTX 300 వంటి ఇతర అడ్వెంచర్ బైక్‌లతో పోటీపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories