Weekly Horoscope: ఈ రాశివారి జీవిత భాగస్వామి సూచనలతో అంతా శుభమే..12 రాశుల వారి వార ఫలాలు

Weekly Horoscope in Telugu, September 29th to October 05th 2024: 12 రాశుల వారి వార ఫలాలు

P Vijay Kumar Astrologer
Updated on: 29 Sept 2024 5:00 AM IST
Weekly Horoscope in Telugu
X

Weekly Horoscope in Telugu

Weekly Horoscope in Telugu: 12 రాశుల వారి వార ఫలాలు (28-09-2024 నుంచి 05-10-2024 వరకు)

మేషం

అడ్డంకులు తొలగిపోతాయి. పనులు చకచకా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీల్లో లాభాలను అందుకుంటారు. బలహీనతలను అధిగమిస్తారు. బంధువుల తోడ్పాటుతో కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. కొత్త వస్తువులను కొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. చర్చల ద్వారా అపార్థాలు తొలగిపోతాయి. న్యాయ వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రత్యర్థుల కుట్రలను భగ్నం చేస్తారు. విందులో పాల్గొంటారు. బంధాలు బలపడతాయి. కీలకవేళ బద్ధకం వల్ల నష్టపోతారు. వృథా ఖర్చులను తగ్గించుకోవాలి. ముఖ్యమైన సందర్భాల్లో జీవిత భాగస్వామి సూచనలు పాటించండి. ప్రేమవ్యవహారాల్లో నిరాశ ఎదురయ్యే సూచనఉంది.

పరిహారం: కనక దుర్గ అమ్మవారిని పూజించడం వల్ల మేలు కలుగుతుంది. ఎరుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

వృషభం

పనుల పూర్తికి బాగా కష్టపడాల్సి వుంటుంది. స్థిర చిత్తంతో చేపట్టే పనులు విజయవంతం అవుతాయి. వ్యవహారాల్లో శుభ ఫలితాలు లభిస్తాయి. కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. పోయిందనుకున్న వస్తువులు తిరిగి దొరుకుతాయి. ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆస్తి క్రయవిక్రయాలు ఏమంత లాభసాటిగా ఉండవు. బుద్ధి నిలకడ లోపం వల్ల చిక్కుల్లో పడతారు. విందుకు హాజరవుతారు. ఫుడ్ పాయిజనింగ్‌కు ఆస్కారం ఉంది. జాగ్రత. ఇతరుల వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకండి. సంతానం వైఖరిపై అసంతృప్తి కలుగుతుంది. ముందుచూపుతో వ్యవహరించడం మంచిది.

పరిహారం: శ్రీ మహావిష్ణువుని పూజించండి. తెలుపు రంగు ఎక్కువగా కలిసిన దుస్తులను ధరించండి.

మిథునం

అన్ని వైపులా మంచే జరుగుతుంది. ఆత్మవిశ్వాసం పనులను కొనసపాగించండి. శుభ ఫలితాలు అందుతాయి. ధనాదాయం ఉంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మీయులను కలుస్తారు. విందులో పాల్గొంటారు. సోదరుల సహకారంతో కీలక సమస్య నుంచి బయటపడతారు. దాయాదులు కూడా సహకరిస్తారు. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆలోచన విధానం మారడం వల్ల స్వజనులతోనే గొడవలు వస్తాయి. రహస్య జీవనం గడపాల్సి వస్తుంది. ఆస్తి వ్యవహారాలు సజావుగా సాగవు. వృథా ఖర్చులను తగ్గించాలి. అవమానాలకు ఆస్కారం ఉంది. అనవసర జోక్యాలు వద్దు. మీ సమర్థతకు తగిన గుర్తింపు లభించకపోవడం బాధిస్తుంది.

పరిహారం: సూర్య భగవానుడిని ఆరాధించండి. నీలి రంగు కలిసిన దుస్తులను ధరించడం మేలు చేస్తుంది.

కర్కాటకం

వ్యవహారాల్లో ఒడుదుడుకులు ఎదురైనా, విజయం సాధిస్తారు. ఆదాయం మెరుగవుతుంది. బ్యాంకు లావాదేవీలు మాత్రం అనుకున్న రీతిలో సాగవు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. దాయాదులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. ఆత్మీయులను కలుస్తారు. ఇరుగు పొరుగుతో సఖ్యత ఏర్పడుతుంది. మిత్రులు సహకరిస్తారు. తోబుట్టువుల వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇతరులతో ఆచితూచి మాట్లాడండి. లేకుంటే అపార్థాలు పెరిగే వీలుంది. రెండో పెళ్లి ప్రయత్నాల్లో జాప్యం ఏర్పడుతుంది. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. తల్లివైపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

పరిహారం: సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించడం శ్రేయస్కరం.

సింహం

మేలిమి కాలం నడుస్తోంది. అన్ని కార్యాల్లోనూ అదృష్టం తోడుగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగులు ఉన్నతస్థాయికి చేరేందుకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బాల్య స్నేహితులను కలుస్తారు. సోదరుల తోడ్పాటు లభిస్తుంది. మీ ఆలోచన తీరు, నాయకత్వ పటిమలకు చక్కటి ప్రశంసలు అందుతాయి. నిరుద్యోగులకు శుభవర్తమానం అందుతుంది. ఎవరికీ పూచీకత్తును ఇవ్వకండి. మనసులోని భావాన్ని చెప్పలేక చిక్కుల్లో పడతారు.

పరిహారం: గాయత్రీమాతను పూజించండి. ఎర్రటి రంగు కలిసిన దుస్తులను ధరించడం వల్ల శుభం చేకూరుతుంది.

కన్య

అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యవహారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సవ్యంగా సాగుతాయి. మీ తెలివితేటలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. గౌరవప్రదమైన స్థాయికి చేరుకుంటారు. కీర్తి పెరుగుతుంది. చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకుంటారు. సామాజిక స్పృహ పెరుగుతుంది. ఇచ్చిన హామీ నిలుపుకోలేక మాట పడే సూచన ఉంది. కుటుంబ వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇంటికి దూరంగా గడపాల్సి వస్తుంది. వేళకు భోజనం ఉండదు. వృథా ఖర్చులను బాగా తగ్గించాలి. నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. నిద్రలేమి వేధిస్తుంది.

పరిహారం: శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించండి. గోధుమ రంగు కలిసిన వస్త్రాలను ధరించడం వల్ల మేలు కలుగుతుంది.

తుల

అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. అప్పులు తీర్చే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. సంతాన సంబంధ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. శుభ కార్యాచరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ ప్రాప్తి యోగం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు చక్కటి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కొత్త బాధ్యతలను స్వీకరించే సూచన ఉంది. కొత్త స్నేహాలు లాభసాటిగా ఉంటాయి. ఆకాంక్షలు నెరవేరతాయి. అన్ని వేళలా అదృష్టం తోడుగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. బద్ధకాన్ని వదలాలి.

పరిహారం: శ్రీ లక్ష్మీనృసింహ స్వామిని పూజించండి. ఊదారంగు కలిసిన దుస్తులను ధరించండి.

వృశ్చికం

అభీష్టం నెరవేరుతుంది. ప్రయత్నించిన ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. మనసు స్థిరపడుతుంది. ఉద్యోగులకు మేలిమి అవకాశాలు అందివస్తాయి. ఉన్నత పదవుల్లోని వారి అండదండలు లభిస్తాయి. ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సహా అన్ని వ్యవహారాలూ అనుకూలంగా సాగుతాయి. పోటీలు, వేలం వంటి వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బంధాలు దృఢమవుతాయి. రుణ విముక్తి యత్నాలు అనుకూలిస్తాయి. సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వారం చివరలో ఆత్మీయుల వైద్యానికి ఖర్చు చేయాల్సి రావచ్చు. బద్ధకం కారణంగా బాధ్యత నుంచి వైదొలగాల్సి రావచ్చు.

పరిహారం: గణపతిని పూజించండి. నారింజ రంగు కలిసిన దుస్తులను ధరించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు.

ధనుస్సు

కాలం అత్యంత యోగదాయకంగా ఉంటుంది. ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. అభీష్టం నెరవేరుతుంది. ఇతరులతో విరోధంలోనూ విజయం మీకే దక్కుతుంది. ఉద్యోగులు అధికారుల ఆదరాభిమానాలను పొందుతారు. అధికారం వృద్ధి చెందుతుంది. కుటుంబ వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. దూర ప్రాంతాల్లో స్థిరనివాసం కోసం చేసే ప్రయత్నం అనుకూలిస్తుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. రుణవిముక్తి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. సేవారంగంలోని వారికి మేలిమి ఫలితాలుంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన వృద్ధి చెందుతుంది.

పరిహారం: అమ్మవారి ఆలయాన్ని సందర్శించండి. ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు ఆకుపచ్చ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మకరం

పనుల పూర్తికి శ్రమించాల్సి ఉంటుంది. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు సజావుగానే సాగుతాయి. బంధువులను కలుస్తారు. ఉద్యోగులు అవకాశాలను అందిపుచ్చుకోవాలి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. నైపుణ్యానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. దూర ప్రాంతాల్లో స్థిరనివాసం కోసం చేసే ప్రయత్నం అనుకూలిస్తుంది.

చెప్పుడు మాటలను నమ్మటం వల్ల అపోహలు పెరుగుతాయి. తగాదాలకూ ఆస్కారం ఉంది. పోటీల్లో ప్రత్యర్థులకే విజయం లభిస్తుంది. సంతానం తీరు చికాకు పెడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

పరిహారం: శనైశ్చరుడిని దర్శించి, ప్రదక్షిణలు చేయండి. నల్లటి రంగు కలిసిన దుస్తులను ధరించడం వల్ల గ్రహశాంతి, తద్వారా మనశ్శాంతి లభిస్తుంది.

కుంభం

భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. ఆర్థిక లబ్ది చేకూరుతుంది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. బంధువులను కలుస్తారు. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. బంధాలు బలపడతాయి. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. సంతాన సంబంధ వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. వాహనం నడిపేటప్పడు జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న సమయానికి నిర్దేశిత సౌకర్యాలు సమకూరక పోవడం వేదనను కలిగిస్తుంది. చెడుదారులు తొక్కే వీలుంది. ఉద్యోగులు అధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది. బలహీనతలపై దెబ్బ పడుతుంది.

పరిహారం: నవగ్రహాలను సందర్శించి, ప్రదక్షిణలు చేయండి. నల్లటి రంగు కలిసిన దుస్తులను ధరించడం వల్ల శుభ ఫలితాలుంటాయి.

మీనం

వారమంతా శుభప్రదంగా గడుస్తుంది. అన్ని వ్యవహారాల్లోనూ విజయం సిద్ధిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. బంధువులతో సఖ్యతకు జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. బలహీనతలను అధిగమిస్తారు. ప్రత్యర్థుల వ్యూహాలను కట్టడి చేస్తారు. అపార్థాలు తొలగి వివాదాలు పరిష్కారమవుతాయి. విందులో పాల్గొంటారు. కొత్త విజ్ఞానాన్ని పొందేందుకు అనువైన సమయమిది. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగులు జాగ్రత్తగా లేకుంటే

పైఅధికారుల కోపానికి గురయ్యే వీలుంది. వారసత్వపు ఆస్తి వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది.

పరిహారం: దత్తాత్రేయ స్వామిని పూజించండి. నశ్యపు రంగు కలిసిన దుస్తులను ధరించడం వల్ల శుభ ఫలితాలు దక్కుతాయి.



P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story