Weekly Horoscope, October 27 to November 2: వారఫలాలు :ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే

Weekly Horoscope in Telugu, October 27 to November 2: వారఫలాలు :ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

P Vijay Kumar Astrologer
Updated on: 27 Oct 2024 6:00 AM IST
Weekly horoscope in Telugu, October 27 to November 2
X

Weekly horoscope in Telugu, October 27 to November 2

Weekly Horoscope in Telugu, October 27 to November 2: వారఫలాలు :ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

మేషం

యోగదాయకంగా ఉంటుంది. చేపట్టిన కార్యాలు సఫలం అవుతాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు మానసిక సంతృప్తినిస్తాయి. శారీరక సౌఖ్యాన్ని పొందుతారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా సాగుతాయి. దీర్ఘకాలంగా కొనసాగుతోన్న అపార్థాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో అనురాగం వృద్ధి చెందుతుంది. ప్రయాణాలు వినోదంగా సాగుతాయి. నిజాయితీకి తగ్గ గుర్తింపు లభిస్తుంది. సంతానం తీరు కొంచెం చికాకు పెట్టిన త్వరగానే సర్దుకుంటుంది. వృథా ఖర్చులు బాగా నియంత్రించాలి.

పరిహారం: శ్రీమహావిష్ణువును పూజించండి. ఆకుపచ్చ రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

వృషభం

స్వస్థాన ప్రాప్తి ఉంది. బంధు, మిత్రులను కలుస్తారు. మానసిక వేదన తొలగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తారు. న్యాయ వివాదాలు పరిష్కారమవుతాయి. పోయింది అనుకున్న వస్తువు తిరిగి లభిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు అంత సజావుగా సాగవు. మాతృసంబంధీకుల గురించిన వార్త కలవర పరుస్తుంది. నమ్మిన వారే మోసగిస్తారు. రియల్టర్లు, విద్య, సేవారంగాల్లోని వారు జాగ్రత్తగా ఉండాలి. బద్ధకిస్తే మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కీలక కార్యాల్లో నిపుణులను సంప్రదించండి.

పరిహారం: పార్వతీదేవిని పూజించండి. ఎరుపు, ఆకుపచ్చ రంగులు కలగలిసిన వస్త్రాలను ధరించండి.

మిథునం

ఆదాయం వృద్ధి చెందుతుంది. పనులు సవ్యంగానే సాగుతాయి. మిత్రులు తోడుగా ఉంటారు. మీ నాయకత్వ పటిమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. అన్నివైపులా శుభ ఫలాలుంటాయి. కొత్త వస్త్రాలను కొంటారు. తోబుట్టువుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ప్రయాణాలు ఆశించిన లబ్దిని చేకూరుస్తాయి. కుటుంబ సభ్యుల తీరు చికాకు పరుస్తుంది. ఆస్తి క్రయవిక్రయాలు లాభించవు. తెలియన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకండి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త. దురాలోచనలను అదుపు చేయాలి. బద్ధకం వద్దు.

పరిహారం: శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించండి. లేత పసుపు రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

కర్కాటకం

కీలక సమాచారం ఆనందపరుస్తుంది. ప్రయత్నాలు శుభ ఫలితాలనిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రియమైన వారిని కలుస్తారు. వారితో సంభాషణ నూతన ఉత్తేజాన్నిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక అంశాలు మీలో ప్రేరణను కలిగిస్తాయి. తొందరపాటుతో ఇచ్చిన పూచీ వల్ల సమస్యల్లో పడతారు. కుటుంబ వ్యవహారాలూ చికాకు పరుస్తాయి. మాట తప్పడం వల్ల నింద పడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అనవసర ఖర్చుల వల్ల డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. శత్రుపీడ కూడా పెరుగుతుంది.

పరిహారం: సూర్యభగవానుడిని ఆరాధించండి. తెలుపు రంగు కలగలిసిన వస్త్రాలను ధరించండి.

సింహం

వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. కార్యాలు విజయవంతంగా సాగుతాయి. కీలక వ్యవహారంలో అదృష్టం తోడుగా ఉంటుంది. ఆదాయం మెరుగవుతుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. చిన్ననాటి స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ వ్యవహారాలు సంతృప్తిగా ఉంటాయి. ఆత్మీయుల కలయిక ఉత్తేజాన్నిస్తుంది. భవిష్యత్తు గురించి చక్కటి ఆలోచనలు చేస్తారు. కమ్యూనికేషన్లు తృప్తినిస్తాయి. సహచరుల తోడ్పాటు లభిస్తుంది. ఖర్చులను అదుపు చేయాలి. అనవసర జోక్యం వద్దు. ఆరోగ్యం జాగ్రత్త.

పరిహారం: శ్రీ లక్ష్మీనృసింహ స్వామిని పూజించండి. ఎరుపు రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

కన్య

పనులు అనుకున్నరీతిలోనే సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. బంధు,మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. సమాజ పరిస్థితుల గురించి ఆలోచిస్తారు. గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకొస్తాయి. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణం గోచరిస్తోంది. వృథా ఖర్చులను నియంత్రించాలి. ఎవరికీ హామీలు ఇవ్వకండి. కుటుంబ వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.

పరిహారం: గణపతిని పూజించండి. ముదురు ఆకుపచ్చ వర్ణం కలిసిన వస్త్రాలను ధరించండి.

తుల

శుభప్రద ఫలితాలుంటాయి. చేపట్టిన ప్రతి కార్యం విజయవంతం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. రుణ విముక్తి యత్నాలు కొలిక్కివస్తాయి. ఆత్మీయులతో విందులకు హాజరవుతారు. సంతాన సంబంధ విషయాలు ఆనందాన్నిస్తాయి. కొత్త వస్తువులను సేకరిస్తారు. పెద్వల ఆశీస్సులను పొందుతారు. కొత్త బంధాలు ఏర్పడతాయి. కీలక సందర్భంలో అదృష్టం తోడుగా ఉంటుంది. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. అనూహ్య ఖర్చులుంటాయి.

పరిహారం: శివుడిని పూజించండి. ఊదారంగు కలిసిన దుస్తులను ధరించండి.

వృశ్చికం

పట్టింది బంగారంలా ఉంటుంది. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. అభీష్టం నెరవేరుతుంది. మేలిమి అవకాశాలు అందివస్తాయి. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. వృత్తిగత నైపుణ్యానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. సహచరుల తోడ్పాటూ లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సంతాన సంబంధ శుభకార్యాచరణకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచన చేస్తారు. దూరప్రయాణం గోచరిస్తోంది. కోర్టు కేసుల్లో జాగ్రత్త. వేళకు భోజనముండదు.

పరిహారం: సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. నిమ్మకాయ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

ధనుస్సు

ఈ వారమంతా అత్యంత యోగదాయకంగా ఉంటుంది.చేపట్టిన ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. అభీష్టం నెరవేరుతుంది. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు తృప్తిగా సాగుతాయి. వివాదాలు, పోటీల్లో మీదే పైచేయిగా ఉంటుంది. పాలనాదక్షతను కనబరుస్తారు. రుణ సంబంధ అంశాలు ఆశించినట్లే సాగుతాయి. సంతాన సంబంధ చికాకులను సమర్థంగా పరిష్కరిస్తారు. భవిష్యత్ కోసం ప్రణాళికలను రూపొందిస్తారు.

పరిహారం: ఆంజనేయ స్వామిని దర్శించండి. లేత సిందూర వర్ణం కలిసిన వస్త్రాలను ధరించండి.

మకరం

ఇష్ట కార్యం అనుకూలమవుతుంది. అన్నింటా అనుకూల ఫలితాలుంటాయి. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగులకు మేలిమి కాలం. పనితీరుకు తగ్గ రివార్డులను పొందుతారు. అవకాశాలను చేజార్చుకోకండి. బంధువులతో విందులకు హాజరవుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్నిసార్లు ఇష్టం లేని పనిచేయాల్సి వస్తుంది. కోపాన్ని తగ్గించుకోవాలి. శత్రువుల కదలికలపై దృష్టి పెట్టాలి. వీలునామా, వారసత్వ అంశాలు కొలిక్కిరావు. సంతానం తీరు చికాకు పెడుతుంది. గురువుల ఆశీస్సులు లభిస్తాయి.

పరిహారం: శనైశ్చరుడిని పూజించి ప్రదక్షిణలు చేయండి. నీలం రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

కుంభం

ప్రయత్నాలు విజయవంతంగా పూర్తవుతాయి. ధనలాభం ఉంది. విజ్ఞానాన్ని పొందేందుకు, అప్‌డేట్ చేసుకునేందుకు అనువైన వారమిది. బంధువులను కలుస్తారు. ప్రయాణాలు సుఖప్రదంగా ఉంటాయి. కీర్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. చెప్పుడు మాటల వల్ల ఇతరులపై దురభిప్రాయం ఏర్పడుతుంది. ఫలితంగా తగాదాలకు ఆస్కారముంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది.

పరిహారం: నవగ్రహాలను సందర్శించండి. నలుపు రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

మీనం

మేలిమి కాలం. చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. బంధువుల తోడ్పాటు లభిస్తుంది. బలహీనతలను అధిగమిస్తారు. వివాదాలను పరిష్కరించుకుంటారు. కోర్టు చిక్కులు తొలగిపోతాయి. కొత్త వస్తువులను కొంటారు. మిత్రులతో విందులకు హాజరవుతారు. జీవిత భాగస్వామితో సఖ్యత వృద్ధి చెందుతుంది. ఇతర బంధాలు కూడా బలపడతాయి. ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. చెప్పుడు మాటలు వినకండి. వారసత్వపు ఆస్తి వ్యవహారాలు ఫలించవు.

పరిహారం: శ్రీదత్తాత్రేయ స్వామిని పూజించండి. తెల్లటి వస్త్రాలను ధరించండి.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story