Weekly Horoscope, October 13-19: వారఫలాలు :ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే

Weekly horoscope in Telugu, October 13 to19: 12 రాశుల వారి వార ఫలాలు.

P Vijay Kumar Astrologer
Updated on: 13 Oct 2024 6:01 AM IST
Weekly horoscope in Telugu October 13 to19
X

Weekly horoscope in Telugu October 13 to19

Weekly horoscope in Telugu, October 13 to19: 12 రాశుల వారి వార ఫలాలు.

మేషం

ఆకాంక్షలు నెరవేరతాయి. గొప్ప స్థితికి చేరాలన్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిత్రులు సహకరిస్తారు. అదృష్టం కూడా తోడుంటుంది. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. వాహనయోగం ఉంది. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. బంధువులతో విందులకు హాజరవుతారు. తెలివితేటలకు, నాయకత్వ లక్షణాలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. ఇంటికి దూరంగా ఒంటరిగా గడపాల్సి రావచ్చు. వృథా ప్రయాణాలను వాయిదా వేసుకోండి.

పరిహారం: దక్షిణామూర్తిని పూజించండి. కాషాయపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

వృషభం

చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. సమర్థతతో వ్యవహారాలను చక్కదిద్దుతారు. ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. దూర ప్రాంతాల్లో స్థిరనివాస ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. బంధాలు బలపడతాయి. కొత్త స్నేహాలు లాభసాటిగా ఉంటాయి. అప్పు చెల్లించే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతాన వ్యవహారాలు తృప్తిగా సాగుతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అనూహ్యమైన ఖర్చులుంటాయి. నిద్రలేమి ఉంటుంది.

పరిహారం: భవానీదేవిని పూజించండి. ఎర్రటి రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

మిథునం

అన్ని రంగాల వారికీ అనుకూలంగా ఉంటుంది. అభీష్టం నెరవేరుతుంది. ఉద్యోగుల ఎదుగుదలకు వీలుగా చక్కటి అవకాశాలు వస్తాయి. పెద్దల ఆశీస్సులను పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో ఆత్మీయులతో పాటు, ఇతరులూ సహకరిస్తారు. సంతానం వృద్ధిలోకి వస్తుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు మొదలవుతాయి. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. బలహీనతలను జయించండి. వృథా ఖర్చులుంటాయి.

పరిహారం: నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. ఆవుకు గ్రాసం పెట్టండి. ఊదా రంగు వస్త్రాలను ధరించండి.

కర్కాటకం

అన్ని పనుల్లోనూ విజయం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సజావుగానే సాగుతాయి. బంధువులతో విందుకు హాజరవుతారు. ఇతరులతో విరోధం ఏర్పడినా విజయం మీకు దక్కుతుంది. ఉద్యోగులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. అవకాశాలను దుర్వినియోగం చేసుకోకండి. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చెప్పుడు మాటలు వినకండి. అపోహల వల్ల శత్రుత్వం పెరుగుతుంది. ఇష్టం లేని పని చేయాల్సి వుంటుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వారసత్వ వ్యవహారాలు ఫలించవు.

పరిహారం: శివుణ్ణి పూజించండి. తెల్లటి రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

సింహం

ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు బాగానే సాగుతాయి. కీలక సందర్భాలన్నింట్లోనూ జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటే మంచిది. బంధువులను కలుస్తారు. నూతన విజ్ఞానం పొందేందుకు అనువైన వారమిది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. సంతాన సంబంధ వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. ప్రయాణం లాభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. ఇతరులపై చెడు అభిప్రాయాలు ఏర్పడతాయి. ఉద్రేకాన్ని తగ్గించుకోవాలి. తగాదాలకూ దూరంగా ఉండండి. దైవ చింతన వృద్ధి చెందుతుంది.

పరిహారం: నవగ్రహాలలో శనిని ఉద్దేశించి ప్రదక్షిణలు చేయండి. నీలపు రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

కన్య

వ్యవహారాలన్నింటా విజయం లభిస్తుంది. బంధుమిత్రుల సహకారం బాగా ఉపయోగ పడుతుంది. అపార్థాలు తొలగిపోతాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు కేసులు అనుకూలంగా సాగుతాయి. స్వేచ్ఛా జీవితంపై కోరిక పెరుగుతుంది. నిజాయితీకి తగిన ప్రశంసలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. మనశ్శాంతి లభిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. ఆలోచనలు చెడుమార్గం పట్టకుండా నియంత్రించుకోండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

పరిహారం: లక్ష్మీనరసింహ స్వామిని పూజించండి. ఎర్రటి రంగు కలిసిన దుస్తులను ధరించండి.

తుల

పట్టింది బంగారంలా ఉంటుంది. పూర్వ వైభవం దిశగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యవహారాలు అన్నింటా శుభ ఫలితాలు లభిస్తాయి. బంధువులు సహకరిస్తారు. ఆర్థిక పురోగతి ఉంటుంది. కొత్త వస్తువులు కొంటారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. పోయిన వస్తువు తిరిగి దొరుకుతుంది. వివాదాలకు తెర పడుతుంది. కుటుంబ బంధాలు బలపడతాయి. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలుంటాయి. సంతానం తీరు చికాకు పెడుతుంది. కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. ఆభరణాలు జాగ్రత్త.

పరిహారం: దత్తాత్రేయ స్వామిని పూజించండి. తెల్లటి రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

వృశ్చికం

నెమ్మదిగానే అయినా పనులు సవ్యంగా సాగుతాయి. ధనలాభంతో పాటే వృథా ఖర్చులూ ఉంటాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వేలం పాటలు, పోటీలలలో అనుకూల ఫలితాలుంటాయి. అడ్డంకులను తేలిగ్గా దాటేస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. అదృష్టం తోడవుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు లాభించవు. అనుకూలం అనుకున్న వాళ్లే దెబ్బ తీసే వీలుంది. వాహనాలకు సంబంధించి చిక్కులు వస్తాయి. సొంత తెలివితేటలను ఉపయోగించకండి. అనవసర జోక్యం వల్ల తగాదాలొస్తాయి. మనశ్శాంతి లోపిస్తుంది.

పరిహారం: శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజించండి. లేత పసుపు రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

ధనుస్సు

చిత్తశుద్ధితో చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. సోదర వర్గపు సహకారం లభిస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆదాయం మెరుగవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. కీలక సమాచారం ఆనందపరుస్తుంది. స్థిరాస్తి లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. రక్తసంబంధీకుల గురించిన సమాచారం బాధిస్తుంది. సంతానం తీరు చికాకు పెడుతుంది. అనవసర విరోధాలకు ఆస్కారం ఉంది. నోటిదురుసు తనం తగ్గించుకుంటే మంచిది.

పరిహారం: సూర్యుణ్ణి ఆరాధించండి. నారింజ రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

మకరం

వ్యవహారాలు జయప్రదంగా సాగుతాయి. కీలక సమస్య పరిష్కారంలో సోదరుల అండ లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలూ సంతృప్తికరంగానే ఉంటాయి. ఆత్మీయులను కలుస్తారు. కొత్త వస్తువులు, వస్త్రాలను కొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు సహచరుల సహకారం లభిస్తుంది. పొరపాటున కూడా ఎవరికీ పూచిగా ఉండకండి. మాట తప్పడం వల్ల నింద భరించాల్సి వస్తుంది. ఇతరుల కారణంగా సమస్యలు వస్తాయి. విడాకులు, రెండో పెళ్లి యత్నాలు అనుకూలించవు. ప్రేమ వ్యవహారాలూ ప్రతికూలంగా ఉంటాయి.

పరిహారం: ఆంజనేయ స్వామిని పూజించండి. సిందూరపు రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

కుంభం

యోగదాయకంగా ఉంటుంది. వ్యవహారాలన్నీ విజయవంతం అవుతాయి. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. విందులకు హాజరవుతారు. నూతన విజ్ఞానం పొందేందుకు అనువైన వారమిది. చిన్ననాటి స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ధైర్యసాహసాలకు గుర్తింపు లభిస్తుంది. భావాలను స్పష్టంగా వ్యక్తం చేసే మీ వ్యక్తిత్వం పెద్దలను ఆకర్షిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో పురోభివృద్ధికి ఉపకరిస్తుంది. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులకు అవకాశం ఉంది.

పరిహారం: విఘ్నేశ్వరుని పూజించండి. లేత ఆకుపచ్చ రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

మీనం

అడ్డంకులు ఎదురైనా కార్యాలను సాధించుకుంటారు. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. సమాజం గురించిన శ్రద్ధ పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పురోభివృద్ధికి అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్లే సూచన ఉంది. అనూహ్య ఖర్చులు ఆందోళన పరుస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా సంభాషణల్లో అప్రమత్తంగా ఉండండి. అనవసర ప్రయాణాలు వద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

పరిహారం: సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి. పసుపు రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story