Weekly Horoscope November 3rd to 9th, 2024: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే

Weekly Horoscope in Telugu, November 3rd to 9th, 2024: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

P Vijay Kumar Astrologer
Updated on: 3 Nov 2024 6:00 AM IST
Weekly horoscope in Telugu
X

Weekly horoscope in Telugu

Weekly Horoscope in Telugu, November 3rd to 9th, 2024: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

మేషం

వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక ఫలాలను అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మేలిమి అవకాశాలు అందివస్తాయి. కుటుంబ స్థితిగతులు సంతృప్తినిస్తాయి. మీ సమర్థతకు తగ్గ ఫలం లభిస్తుంది. తండ్రితో సత్సంబంధాలు ఉంటాయి. గౌరవం పెరుగుతుంది. చెప్పుడు మాటలు వినకండి. వారసత్వ ఆస్తి వ్యవహారాలు ఆలస్యం అవుతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ఇబ్బందులొస్తాయి.

పరిహారం: శ్రీవేంకటేశ్వర స్వామిని పూజించండి. పసుపు రంగు కలిసిన దుస్తులు ధరించండి.

వృషభం

వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. వస్తు, వాహన సుఖముంది. సంబంధ, బాంధవ్యాలు బలపడతాయి. బంధుమిత్రులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి. స్వేచ్ఛా జీవితంపై ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబ చిక్కులు పరిష్కరిస్తారు. నిజాయితీకి తగ్గ ఫలితాన్ని పొందుతారు. శత్రువుల కదలికలపై కన్నేసి ఉంచండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వీలునామా, అగ్రిమెంట్లకు అనుకూలం కాదు. కీలక సమయంలో అదృష్టం ముఖం చాటేస్తుంది.

పరిహారం: పార్వతీదేవిని పూజించండి. ఎరుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మిథునం

శుభప్రదంగా ఉంటుంది. ప్రతి ప్రయత్నమూ సఫలమవుతుంది. ఆర్థిక లావాదేవీల్లో వృద్ధి కనిపిస్తుంది. కొత్త వస్తువులను సేకరిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. కోర్టు వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామి తోడ్పాటు వల్ల మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన పని కోసం చేసే ప్రయాణం లాభిస్తుంది. నూతన విజ్ఞానాన్ని పొందేందుకు అనువైన వారం. వారం చివరలో తగాదాలకు ఆస్కారముంది. ఇతరుల వ్యవహారాల్లోజోక్యం చేసుకోకండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

పరిహారం: సూర్యభగవానుడిని ఆరాధించండి. లేత నీలం రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కర్కాటకం

నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరతారు. ఆటంకాలను అవలీలగా దాటేస్తారు. మిత్రులు సహకరిస్తారు. ధనలాభం ఉంది. సహచరులు, ఇరుగుపొరుగుతో నెలకొన్న అపార్థాలు తొలగిపోతాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. అంతర్గత ఆనందం రెట్టింపవుతుంది. కుటుంబ బంధం బలపడుతుంది. వ్యాపారస్తులకు యోగదాయకంగా ఉంటుంది. కార్యసాధనలో బద్ధకించకండి. సంతానం తీరు చికాకు పెడుతుంది. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. డాక్యుమెంట్లు జాగ్రత్త.

పరిహారం: శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించండి. తెల్లటి రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

సింహం

స్వల్పంగా ఒడుదుడుకులున్నా, ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా లాభం చేకూరుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సందేహాలకు సరైన సమాధానం దొరుకుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. పోయిన వస్తువు తిరిగి దొరుకుతుంది. అపోహల కారణంగా బంధువులతోనే విరోధం ఏర్పడుతుంది. బుద్ధి నిలకడగా ఉండదు. స్థిరాస్తి అమ్మే ప్రయత్నాలు వాయిదా వేసుకోండి. నమ్మిన వారే మోసం చేసే పరిస్థితి ఉంది. తెలివితేటలకు తగ్గ గుర్తింపుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలించవు. మూఢనమ్మకాలను వదలండి.

పరిహారం: శ్రీలక్ష్మీనృసింహ స్వామిని పూజించండి. రక్తవర్ణం కలిసిన దుస్తులను ధరించండి.

కన్య

వ్యవహారాల్లో విశేష లాభముంది. ఆదాయానికి ఇబ్బంది లేదు. ఆత్మవిశ్వాసంతో చేపట్టే ప్రతి కార్యమూ విజయవంతం అవుతుంది. అందరి నుంచీ చక్కటి సహకారాన్ని పొందుతారు. తోబుట్టువుల సమస్యలపై దృష్టి పెడతారు. శుభఫలితం లభిస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. సేవాసంస్థల వారికి ప్రతికూలతలు ఉంటాయి. సంతానం భవిష్యత్తు గురించిన ఆలోచనలు వస్తాయి. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి.

పరిహారం: గాయత్రీ మాతను పూజించండి. నశ్యపు రంగు కలిసిన దుస్తులు ధరించడం మేలు చేస్తుంది.

తుల

వ్యవహారాలు సఫలం అవుతాయి. సహచరుల సహకారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తికరంగానే సాగుతాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆత్మీయులను కలుస్తారు. సోదరుల సహకారంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. శుభవర్తమానం ఆనందాన్ని పెంచుతుంది. స్థిరాస్తి వ్యవహారాలను వాయిదా వేసుకోండి. తొందరపడి ఎవరికీ హామీలు ఇవ్వకండి. నిందలు పడాల్సి వస్తుంది. కంటికి సంబంధించిన సమస్యను నిర్లక్ష్యం చేయవద్దు. విడాకుల వ్యవహారం వాయిదా పడుతుంది.

పరిహారం: శనైశ్చరుడిని పూజించండి. నలుపు వర్ణం కలిసి వస్త్రాలను ధరించండి.

వృశ్చికం

నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరే ప్రయత్నం అనుకూలిస్తుంది. ధనలాభం ఉంది. మీ వ్యక్తిత్వానికి చక్కటి ప్రశంసలు అందుతాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విందులకు హాజరవుతారు. నిరుద్యోగులను అదృష్టం వరిస్తుంది. స్నేహితులతో వినోదంగా గడుపుతారు. తోబుట్టువుల వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆత్మీయ వ్యక్తులను కలుస్తారు. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల అపవాదులు వచ్చే సూచన ఉంది. అనవసర జోక్యాలు మానుకోండి. ఆస్తివ్యవహారాల్లో జాగ్రత్త. వృథా ఖర్చులుంటాయి.

పరిహారం: సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి. పాలమీగడ రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

ధనుస్సు

పనులు సజావుగా సాగుతాయి. సహచరులు మీ మనస్తత్వాన్ని గుర్తించి నడచుకుంటారు. తెలివితేటలకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. అదృష్టం తోడుగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సమాజంలోని ప్రముఖుల దృష్టిలో పడతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. బ్యాంకు లావాదేవీలు సంతృప్తిగా ఉండవు. బంధువులతో విరోధం గోచరిస్తోంది. మాట తప్పడం వల్ల అవమానానికి గురి కావాల్సి వస్తుంది.

పరిహారం: శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించండి. తెల్లటి రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మకరం

అన్ని కీలక సందర్భాల్లోనూ అదృష్టం తోడుగా ఉంటుంది. పనులన్నీ సఫలమవుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. సంతాన సంబంధ శుభవర్తమానం అందుతుంది. శుభకార్యంలో పాల్గొంటారు. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఇష్టమైన వారితో విందుకు హాజరవుతారు. వాహన యోగం ఉంది. తెలివితేటలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. స్వస్థానప్రాప్తి ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనవసర జోక్యాలు మానుకోండి. వృథా ఖర్చులను తగ్గించుకోవాలి. బంధువు ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

పరిహారం: పరమశివుణ్ణి పూజించండి. బూడిద రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

కుంభం

ఉద్యోగులకు అత్యంత యోగదాయకంగా ఉంటుంది. ఇష్టకార్యం అనుకూలిస్తుంది. నైపుణ్యంతో ప్రత్యర్థులపై విజయం సాధించి మేలిమి అవకాశాన్ని సొంతం చేసుకుంటారు. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి. రుణ విముక్తి యత్నాలు అనుకూలిస్తాయి. ఇతరుల నుంచీ సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంతాన సంబంధ శుభవార్త అందుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వారం చివరలో అనూహ్య ఖర్చులొస్తాయి. ఇంటికి దూరంగా వెళ్లాల్సి రావచ్చు. వేళకు భోజనముండదు.

పరిహారం: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. నీలివర్ణం కలిసిన దుస్తులను ధరించండి.

మీనం

అత్యంత యోగదాయకంగా ఉంటుంది. అభీష్టం నెరవేరుతుంది. పోటీ పరీక్షల్లో ఘనవిజయం సాధిస్తారు. పురోభివృద్ధికి సంబంధించిన చక్కటి అవకాశాలు అందివస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇప్పుడు ఏర్పడే కొత్త పరిచయాలు భవిష్యత్తులో లాభసాటిగా మారతాయి. సంతాన సంబంధ శుభవార్తను వింటారు. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి పురోభివృద్ధి ఉంటుంది. విదేశాల్లో స్థిర నివాస ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతిష్ట పెరుగుతుంది. దైవకార్యక్రమాలపై ఆసక్తి వృద్ధి చెందుతుంది.

పరిహారం: శ్రీ దక్షిణామూర్తిని ప్రార్థించండి. బంగారు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story