Weekly Horoscope in Telugu 21 July To 27 July 2024: వారఫలాలు.. ఆ రాశి నిరుద్యోగులకు శుభసమయం

Weekly Horoscope In Telugu 21 July To 27 July 2024: వారఫలాలు.. ఆ రాశి నిరుద్యోగులకు శుభసమయం

P Vijay Kumar Astrologer
Updated on: 21 July 2024 6:00 AM IST
weekly Horoscope In Telugu 21st July TO 27th July 2024
X

Weekly Horoscope 21 July To 27 July 2024: వారఫలాలు.. ఆ రాశి నిరుద్యోగులకు శుభసమయం

(21-07-2024 నుంచి 27-07-2024 వరకు)


మేషం :

అన్నింటా అనుకూలంగా ఉంటుంది. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక స్థిరత్వం దిశగా అడుగులు పడతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యదక్షతకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా ప్రశాంత పరిస్థితులు ఉంటాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. సంతాన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. దూర ప్రయాణాలుంటాయి. బద్ధకం వదలాలి.


వృషభం :

ప్రారంభంలో కాస్త ఒడుదుడుకులుగా అనిపించినా, పనులు సవ్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన రీతిలోనే సాగుతాయి. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగులు అధికారుల నుంచి గుర్తింపును పొందుతారు. శత్రుపీడ తొలగిపోతుంది. గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. మిత్రుల వల్ల లాభపడతారు. ఆకాంక్షలు నెరవేరతాయి. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తారు. విందుల్లో పాల్గొంటారు. బలహీనతలను బయటపెట్టకండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.


మిథునం :

విపరీతమైన శ్రమ తర్వాతే ఏ పనైనా సానుకూలం అవుతుంది. ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. శత్రువుల కదలికలపై ఓ కన్నేసి ఉంచండి. వివాదాలు నెమ్మదిగా పరిష్కారం అవుతాయి. చెప్పుడు మాటలు నమ్మకండి. తగాదాలకు ఆస్కారం ఉంది. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. అధికారులకు మీపై ఏర్పడిన వారాంతానికి సమసిపోతుంది. ఓపికగా వ్యవహరించండి. దూర ప్రయాణాలు, ఉన్నత చదువులకు అనుకూలం.


కర్కాటకం :

కీలకమైన పనులను వారం మొదట్లోనే ప్రారంభించండి. అవసరమైనంత డబ్బు చేతికి అందుతుంది. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ చిక్కులను పరిష్కరిస్తారు. విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు అనువైన సమయమిది. ప్రయాణాలు లాభిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఎవరిపైనా అపోహలు పెంచుకోకండి. కొన్ని సార్లు అయిష్టంగానే పనిచేయాల్సి వస్తుంది. ఉద్రేకాన్ని అణచుకోండి. దూర ప్రదేశాలకు వెళ్లే సూచన ఉంది. ఉన్నత విద్యకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్ ప్రణాళికలను రూపొందిస్తారు.


సింహం :

అభీష్టాలు నెరవేరతాయి. చేపట్టిన ప్రతి కార్యం సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. వస్తువాహనాలు కొనే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులు తోడ్పడతారు. విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. మానసిక ప్రశాంతతను పొందుతారు. వారం చివర్లో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దురుసుతనం పనికిరాదు. జీర్ణ, కీళ్ల సంబంధ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.


కన్య :

కార్యాలన్నింటా విజయం సిద్ధిస్తుంది. మనోభీష్టం నెరవేరుతుంది. పూర్వవైభవం దిశగా సాగుతారు. బంధుమిత్రులు సహకరిస్తారు. నూతన వస్తుప్రాప్తి ఉంది. విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి. కీర్తి పెరుగుతుంది. సంతానం తీరు కాస్త చికాకు పరుస్తుంది. వాత సంబంధ సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.


తుల :

శ్రమానంతరం విజయం సిద్ధిస్తుంది. ప్రతి పనిలోనూ ఆటంకాలను దాటాల్సి వస్తుంది. ఎదురయ్యే పరిణామాల వల్ల బుద్ధి నిలకడగా ఉండదు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. పైగా అనూహ్యమైన వృథా ఖర్చులు మరింత చికాకు పరుస్తాయి. బద్ధకాన్ని వదిలిపెట్టండి. కీలక నిర్ణయాల్లో సొంత తెలివితేటలను ప్రదర్శించకండి. మీ శ్రేయస్సును కోరేవారి సూచనలు పాటించండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. సంతాన వ్యవహారాలు ఒకింత కలవరాన్ని కలిగిస్తాయి. ఆస్తిని అమ్మే ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది.


వృశ్చికం :

మిశ్రమ ఫలితాలుంటాయి. ప్రయత్నాలు అంత తేలిగ్గా ఫలించవు. ఆటంకాలు సృష్టించే వారు పెరుగుతారు. ఆర్థిక లావాదేవీల్లో జాప్యం నెలకొంటుంది. స్థిరాస్తి సంబంధ వ్యవహారాలూ ముందుకు సాగవు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి. కీలక సమయంలో సోదరవర్గం తోడ్పాటు గట్టెక్కిస్తుంది. కుటుంబ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆత్మీయులను కలవడం ఉత్తేజాన్నిస్తుంది.


ధనుస్సు :

ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు ఆపదలో పడేస్తాయి. అత్యవసర సమయాల్లో దాయాదులు మీకు అండగా నిలుస్తారు. మాట నిలుపుకోలేని కారణంగా అవమానం ఎదురవుతుంది. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ చూపండి. కీలక వర్తమానం అందుతుంది. సద్వినియోగం చేసుకోండి. కంటి సంబంధ సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. ఆస్తి క్రయవిక్రయాలను వాయిదా వేయండి. ఆత్మీయుల కలయిక ఆనందాన్నిస్తుంది. మిత్రులు సహకరిస్తారు.


మకరం :

అనుకూలమైన వారమిది. పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక ప్రయోజనాలు నెరవేరతాయి. కొత్త వస్తువులను కొంటారు. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. సోదరులు సహకరిస్తారు. ఆస్తి అమ్మే ప్రయత్నాలు వాయిదా వేయండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కీలక సమాచారం అందుతుంది. కొత్త విషయాలను గ్రహిస్తారు. బ్యాంకు లావాదేవీల్లో జాప్యం ఉంటుంది. ఇచ్చిన మాట నిలుపుకోని కారణంగా అవమానానికి గురవుతారు.


కుంభం :

పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి వుంటుంది. ఆటంకాలను అధిగించాలి. అవసరానికి సరిపడా డబ్బు అందుతుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఆత్మీయుల వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వుంటుంది. కీలక వ్యవహారాల్లో అదృష్టం తోడుగా నిలుస్తుంది. ఎవరికీ హామలు ఇవ్వకండి. అకారణ విరోధాలు గోచరిస్తున్నాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. కంటి జబ్బులు చికాకు పరుస్తాయి.


మీనం :

యోగదాయకంగా ఉంటుంది. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక చిక్కులు తొలగిపోతాయి. రుణాలు చెల్లించే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంటి నిర్మాణ ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. ఆత్మీయుల సహకారం అందుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు గోచరిస్తున్నాయి. విరోధం గోచరిస్తోంది. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. కీర్తి పెరుగుతుంది.



P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story