Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (ఫిబ్రవరి 2 - ఫిబ్రవరి 8)

Weekly Horoscope in Telugu, 2025 February 2 to February 8
x

Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (ఫిబ్రవరి 2 - ఫిబ్రవరి 8)

Highlights

Weekly Horoscope in Telugu, 2025 February 2 to February 8: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

Weekly Horoscope in Telugu, 2025 February 2 to February 8: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

మేషం

పనులు అనుకున్నరీతిలోనే పూర్తవుతాయి. అవసరానికి తగినంత డబ్బు సమకూరుతుంది. నిరుద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. మీదైన విశిష్ట వ్యక్తిత్వంలో అందరినీ ఆకట్టుకుంటారు. ఉన్నతస్థాయికి ఎదగాలన్న ప్రయత్నం అనుకూలిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. ప్రయాణాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. హామీలను ఇవ్వకండి. మాట నిలుపుకోని కారణంగా అవమానం ఎదురవుతుంది. తగాదాలకు దూరంగా ఉండండి.

పరిహారం: శ్రీదక్షిణామూర్తిని ఆరాధించండి. తెల్లటి వస్త్రాలను ధరించండి.

వృషభం

యోగదాయకమైన వారమిది. చేపట్టిన ప్రతి కార్యం విజయవంతం అవుతుంది. ఆర్థికంగానూ బలపడతారు. కొత్త స్నేహాలు లాభసాటిగా మారతాయి. నూతన విషయాలను గ్రహిస్తారు. సంతాన సంబంధ శుభకార్యాల గురించి చర్చలు సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బాల్యస్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. బంధువులతో విందుకు హాజరవుతారు. పెద్దలను కలిసి ఆశీస్సులను పొందుతారు. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. బంధువుల ఆరోగ్యం కలవరపరుస్తుంది.

పరిహారం: శ్రీసూర్య భగవానుడిని ఆరాధించండి. నారింజ రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

మిథునం

అన్నింటా అనుకూల ఫలితాలుంటాయి. అభీష్టం నెరవేరుతుంది. స్థిరత్వం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మేలిమి అవకాశాలు అందివస్తాయి. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. పైఅధికారుల సహకారం లభిస్తుంది. నైపుణ్యానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. అధికార వృద్ధి గోచరిస్తోంది. బంధాలు బలపడతాయి. ఇష్టమైనవారితో వినోదంగా గడుపుతారు. సంతానం వల్ల కీర్తి వృద్ధి చెందుతుంది. అనూహ్య ఖర్చులుంటాయి. బద్ధకాన్ని విడిచిపెట్టండి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.

పరిహారం: శ్రీ కనకదుర్గ అమ్మవారిని పూజించండి. మెరూన్ రెడ్ కలిసిన దుస్తులను ధరించండి.

కర్కాటకం

లక్ష్యసాధనలో విజయం సాధిస్తారు. యత్నకార్యం సఫలం అవుతుంది. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు విధినిర్వహణలో ప్రశంసలను పొందుతారు. ఉన్నతాధికారుల ఆదరాభిమానాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త స్నేహాలు లాభదాయకంగా మారతాయి. రుణవిముక్తి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం నికలడగా ఉంటుంది. దూరప్రయాణం గోచరిస్తోంది. తీర్థక్షేత్ర సందర్శనతో మనశ్శాంతి లభిస్తుంది.

పరిహారం: శ్రీవేంకటేశ్వరస్వామిని పూజించండి. లేత పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

సింహం

స్థిర నిర్ణయంతో చేసే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ఉద్యోగులకు శుభ ఫలితాలు అందుతాయి. అవకాశాలను వదులుకోకండి. ప్రత్యర్థులపై పైచేయిని సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. దూర ప్రదేశంలో స్థిర నివాస యత్నం కొలిక్కి వస్తుంది. తండ్రి సామాజిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులు తోడుంటారు. చెప్పుడు మాటలు విని దురభిప్రాయాలు ఏర్పరచుకోకండి. అసూయాపరులను దూరంగా ఉంచండి. తగాదాలకు ఆస్కారం ఉంది. కోపాన్ని అదుపు చేసుకోండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

పరిహారం: నవగ్రహాలకు తొమ్మిదిసార్లు ప్రదక్షిణలు చేయండి. నలుపు కలిసిన వస్త్రాలను ధరించండి.

కన్య

భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. ఎగుమతుల రంగంలో పెట్టుబడులకు అనువైన కాలం. విజ్ఞానాన్ని పెంచుకుంటారు. వృత్తి నైపుణ్యంతో పైఅధికారులను మెప్పిస్తారు. కొత్త సంబంధ, బాంధవ్యాలు పెరుగుతాయి. స్వేచ్ఛాజీవితంపై ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. వేళకు సరైన భోజనం ఉండదు. కీళ్ల సంబంధ సమస్యలు వేధిస్తాయి. తగాదాలకు దూరంగా ఉండండి. అనవసర పోటీలకు దిగకండి. వారసత్వపు ఆస్తి వ్యవహారాలు లాభించవు.

పరిహారం: శ్రీగాయత్రీమాతను పూజించండి. ఎర్రటి రంగు కలిసిన దుస్తులను ధరించండి.

తుల

వ్యవహారాలన్నింటా విజయం సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి ఉంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. కొత్త వస్తువులను సేకరిస్తారు. బలహీనతలను జయిస్తారు. ప్రత్యర్థులపై పోటీలో మీదే పైచేయిగా ఉంటుంది. చర్చల ద్వారా అపార్థాలు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వుంటాయి. కీలక సమయంలో అదృష్టం తోడుంటుంది. భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. కీళ్ల సంబంధ సమస్య ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

పరిహారం: శ్రీలక్ష్మీనారాయణులను పూజించండి. ఆకుపచ్చ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

వృశ్చికం

ఇష్టకార్యం సఫలం అవుతుంది. ఇతర వ్యవహారాల్లోనూ శుభ ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. బలహీనతలను జయిస్తారు. పోటీదారులపై విజయం సాధిస్తారు. మిత్రులు సహకరిస్తారు. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ చిక్కులను పరిష్కరిస్తారు. కొత్త వస్తువులను కొంటారు. వృత్తుల్లోని వారికి లాభసాటిగా ఉంటుంది. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వృథా ఖర్చులను తగ్గించండి. తగాదాలకు దూరంగా ఉండండి.

పరిహారం: శ్రీశంకరుడిని పూజించండి. ఊదా రంగు కలిసిన దుస్తులను ధరించండి.

ధనుస్సు

ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిత్రులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు అంతంతమాత్రంగానే ఉంటాయి. బంధువులతో విందులో పాల్గొంటారు. వృత్తిపరంగా ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కోర్టు వివాదాల్లో జాగ్రత్త. చర్చలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. తల్లివైపు బంధువుల ఆరోగ్యం కలవర పరుస్తుంది. బుద్ధి నిలకడ లోపం వల్ల బంధువులతోనే గొడవ పడతారు. ఆస్తి సంబంధ లావాదేవీల్లో నష్టం గోచరిస్తోంది. సంతాన వ్యవహారాలు చికాకు పెడతాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. మనశ్శాంతి ఉండదు.

పరిహారం: శ్రీ శనైశ్చరుడిని నువ్వుల నూనెతో అభిషేకించండి. నీలం రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మకరం

ఆశించిన ప్రయోజనాన్ని పొందుతారు. ఆదాయం తృప్తినిస్తుంది. వ్యవహారాల్లో శుభ ఫలితాలు లభిస్తాయి. సాహసంతో తీసుకునే నిర్ణయం సత్ఫలితాన్నిస్తుంది. సోదరుల సహకారంతో కీలక సమస్య నుంచి బయట పడతారు. ఆత్మీయుల కలయిక ఉల్లాసాన్నిస్తుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. చాలా కాలంగా ఊరిస్తోన్న సమాచారం అందుతుంది. ఆస్తి సంబంధ లావాదేవీలను వాయిదా వేయండి. సంతాన సంబంధ వ్యవహారాలు ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ప్రశాంతతను అలవాటు చేసుకోండి. వృథా ఖర్చులను తగ్గించండి. ఆరోగ్యం జాగ్రత్త.

పరిహారం: శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కుంభం

వ్యవహారాల్లో విశేష లాభాన్ని పొందుతారు. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. సోదరులు అన్నివిధాలుగా తోడుంటారు. కీలక వర్తమానం ఆనందపరుస్తుంది. ఆధ్యాత్మిక అంశాలు ప్రేరణనిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మీయులతో విందులో పాల్గొంటారు. ఇరుగు పొరుగుతో సఖ్యత పెరుగుతుంది. బ్యాంకు లావాదేవీల్లో జాప్యం ఉంటుంది. మాట తప్పడం వల్ల అవమానం ఎదురవుతుంది. జీవిత భాగస్వామి తీరు చికాకు పెడుతుంది. ఎవరికీ పూచీగా ఉండకండి. స్థిరాస్తి, సేవారంగంల్లోని వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం: శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించండి. కాషాయపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మీనం

పట్టింది బంగారంలా ఉంటుంది. ప్రతి కీలక సందర్భంలో అదృష్టం తోడుగా ఉంటుంది. కుటుంబ వ్యవహారం తృప్తినిస్తుంది. మానసిక స్థితి ఉల్లాసంగా ఉంటుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది. మీ విశిష్ట వ్యక్తిత్వంతో పెద్దల మనసు గెలుస్తారు. సోదరుల సమస్యకు పరిష్కారం చూపుతారు. ఆత్మీయులను కలుస్తారు. సహచరుల తోడ్పాటు లభిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయం సత్ఫలితాన్నిస్తుంది. బ్యాంకు లావాదేవీలపై శ్రద్ధ పెట్టండి. రెండో పెళ్లి ప్రయత్నాలు అనుకూలించవు.

పరిహారం: శ్రీఆంజనేయ స్వామిని పూజించండి. సిందూరపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

Read Today's Latest Horoscope News in Telugu and Telugu News

Show Full Article
Print Article
Next Story
More Stories