Weekly Horoscope: జీవిత భాగస్వామి సహకారంతో సమస్యలకు చెక్.. ఈ వారమంతా మంచి రోజులే..!

Weekly Horoscope For May 12 to 18 May 2024
x

Weekly Horoscope: జీవిత భాగస్వామి సహకారంతో సమస్యలకు చెక్.. ఈ వారమంతా మంచి రోజులే..!

Highlights

Weekly Horoscope: జీవిత భాగస్వామి సహకారంతో సమస్యలకు చెక్.. ఈ వారమంతా మంచి రోజులే..!

వారఫలం: (12-05-2024 నుంచి 18-05-2024 వరకు)


మేషం: మిశ్రమ ఫలితాలుంటాయి. మిత్రులు, సోదరుల తోడ్పాటుతో ఆటంకాలను దాటేస్తారు. అగ్రిమెంట్లకు వారం ప్రారంభంలోనే బావుంటుంది. అవసరానికి తగినంత డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంది. ఆస్తి క్రయవిక్రయాలు ముందుకు సాగక పోగా విరోధాలకు కారణమవుతుంది. అనవసర ప్రయాణాలు వద్దు. వాత సంబంధ సమస్యలుంటాయి. బద్ధకాన్ని వదిలి ఆత్మధైర్యంతో సాగండి. దక్షిణామూర్తిని ధ్యానించండి.


వృషభం: అభీష్టం నెరవేరేందుకు బాగా శ్రమించాలి. కుటుంబంలోను, బంధువర్గంతోను తలెత్తే చికాకులను జీవిత భాగస్వామి తోడ్పాటుతో సరిదిద్దుతారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వల్ల నిందలు భరించాల్సి వస్తుంది. వృథాఖర్చులుంటాయి. ఆత్మీయుల కలయిక ఆనందాన్నిస్తుంది. భూ సంబంధ లావాదేవీలు ఆశాజనకంగా ఉండవు. కీలక సమయానికి మిత్రుల సహకారం లభిస్తుంది. కనకదుర్గమ్మను పూజించడం మేలు చేస్తుంది.


మిథునం : శుభప్రదంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వస్త్రాభరణ యోగం ఉంది. బంధువులను కలుస్తారు. వినోదాల్లో పాల్గొంటారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబంలోనూ ప్రశాంతత ఉంటుంది. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. అనవసరంగా ఎవరితోనూ గొడవ పడకండి. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. గణపతి పూజ మరింత శుభకరం.


కర్కాటకం : చేపట్టిన పనులు సవ్యంగా సాగుతాయి. ధనలాభం ఉంది. చక్కటి సౌకర్యాలు సమకూర్చుకుంటారు. వాహనయోగం ఉంది. కుటుంబంలో శాంతి ఉంటుంది. విందుల్లో పాల్గొంటారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చితే చికాకులు తప్పవు. మాట నిలుపుకోని కారణంగా అవమానాలు ఎదురవుతాయి. వృథాఖర్చులు వద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆత్మీయుల వైద్యానికి ఖర్చు చేయాల్సి రావచ్చు.


సింహం : శుభ ఫలితాలు అందుకుంటారు. ఆత్మీయుల సహకారంతో రుణాలు తీర్చగలుగుతారు. సంతానం వృద్ధిలోకి వస్తుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. మానసిక శాంతిని పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కొత్త బాధ్యతను చేపడతారు. పరుల విషయాల్లో జోక్యం వద్దు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక తరుణంలో అదృష్టం తోడుగా ఉంటుంది.


కన్య: యోగవంతమైన కాలం నడుస్తోంది. చేపట్టిన పనులన్నీ సఫలం అవుతాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ధనసంబంధ సమస్యలు కొలిక్కి వస్తాయి. శత్రువులు తోకముడుస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అవసరమైన సమయాల్లో ఆత్మీయులు చేయందిస్తారు. అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అన్నింటా అనుకూలంగానే ఉంటుంది.


తుల : అభీష్టం నెరవేరుతుంది. బాధ్యతల నిర్వహణలో విజయం సాధిస్తారు. ఇతరులతో విరోధం ఏర్పడినా మీమాటే చెల్లుబాటు అవుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో వినోదాల్లో పాల్గొంటారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డబ్బుకి ఇబ్బందుండదు. ఆరోగ్యం మెరుగవుతుంది. సంతాన వ్యవహారాల్లో తృప్తి లభిస్తుంది.


వృశ్చికం : ఒడుదుడుకులను అధిగమించి పనులు పూర్తి చేసుకుంటారు. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. ఇతరులపై దురభిప్రాయాలు వద్దు. వదంతులు ప్రచారం చేయడం వల్ల మీరే చిక్కుల్లో పడతారు. కష్టాన్ని నమ్మి, అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు. వృథాఖర్చులు తగ్గించండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.


ధనుస్సు : బద్ధకాన్ని పక్కనపెట్టి కాస్తంత శ్రమిస్తే కార్యాలన్నీ అనుకూలమవుతాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబ చికాకులు తొలగిపోతాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తప్పనిసరై ఇష్టంలేని పని చేయాల్సి వస్తుంది. వృథాఖర్చులు తగ్గించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. భవిష్యత్ ప్రణాళిక రూపొందిస్తారు.


మకరం : యోగవంతంగా ఉంటుంది. చేపట్టిన పనులు సఫలమవుతాయి. దీర్ఘకాలంగా వేధిస్తోన్న సమస్య తీరిపోతుంది. డబ్బుకి ఇబ్బంది ఉండదు. కీలక వ్యవహారాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. విందుల్లో పాల్గొంటారు. శారీరక ఆనందం, మానసిక శాంతిని పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. అనవసర అపోహలు మానండి. జీవిత భాగస్వామి సూచనలు పాటించండి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.


కుంభం : మేలిమి కాలం. చేపట్టిన కార్యాలు విజయవంతం అవుతాయి. పూర్వవైభవం దిశగా అడుగులు పడతాయి. మిత్రులు సహకరిస్తారు. వస్తువాహనాలు కొంటారు. విందుల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. విజ్ఞానం పెంచుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలక డాక్యుమెంట్లు, వస్తువులు జాగ్రత్త.


మీనం : పనులు అనుకున్నట్లుగా సాగవు. బాగా శ్రమించాకే కార్యజయం ఉంటుంది. డబ్బుకి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఆస్తి అమ్మే ప్రయత్నాలు వాయిదా వేసుకోండి. రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చి అవమానాలు ఎదుర్కొంటారు. ఇంట్లోనూ చికాకులుంటాయి. మిత్రుల తోడ్పాటుతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. గణపతిని పూజించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories