Weekly Horoscope 25 To 31 August 2024: ఆర్థిక సమస్యల ఒత్తిడి నుంచి వారికి ఉపశమనం..12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope 25 To 31 August 2024: ఆర్థిక సమస్యల ఒత్తిడి నుంచి వారికి ఉపశమనం..12 రాశుల వారికి వారఫలాలు

P Vijay Kumar Astrologer
Updated on: 25 Aug 2024 6:00 AM IST
weekly horoscope 25 to 31 august 2024 rasi phalalu in telugu all zodiac signs astrology prediction
X

Weekly Horoscope 25 To 31 August 2024: ఆర్థిక సమస్యల ఒత్తిడి నుంచి వారికి ఉపశమనం..12 రాశుల వారికి వారఫలాలు

(25-08-2024 నుంచి 31-08-2024 వరకు)

మేషం :


వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక చిక్కులను సామరస్యంతో పరిష్కరిస్తారు. ఆదాయం పెరుగుతుంది. అనవసర భేషజాలకు వెళ్లకండి. మాట తప్పడం వల్ల అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. సోదరుల వల్ల మేలు జరుగుతుంది. చాలాకాలంగా ఎదురు చూస్తున్న శుభ వర్తమానం అందుతుంది. భూసంబంధ లావాదేవీలను వాయిదా వేయండి. బంధువర్గంతో వాగ్వాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఓదశలో బుద్ధి నిలకడ లోపిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.

వృషభం :


మేలిమి ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. గృహోపకరణాలు కొంటారు. వాహనయోగం ఉంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. నిరుద్యోగులకు శుభ వర్తమానం అందుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విందుల్లో పాల్గొంటారు. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. ఆత్మీయుల కలయిక నూతన ఉత్తేజాన్నిస్తుంది. ఎవరికీ పూచీగా ఉండకండి. అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు. ఖర్చులు తగ్గించాలి. స్థిరచిత్తంతో చేసే పనులు సఫలం అవుతాయి.

మిథునం :


కార్య సఫలతకు బాగా శ్రమించాల్సి వుంటుంది. అడుగడుగునా ఆటంకాలను దాటాల్సి వుంటుంది. బద్ధకం వదిలి పెట్టాలి. బంధువులను కలుస్తారు. విందులో పాల్గొంటారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరికీ అనవసర హామీలు ఇవ్వకండి. ఇతరుల వల్ల ఇబ్బందులు వచ్చే వీలుంది. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. కుటుంబంలో చికాకులు వస్తాయి. ఇంటికి దూరంగా గడపాల్సి వుంటుంది. కంటి మస్యలుంటాయి. కీలక వేళ అదృష్టం తోడుగా ఉంటుంది.

కర్కాటకం:


యోగదాయకంగా ఉంటుంది. కార్యజయం ఉంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. అప్పులు చెల్లించే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. శుభకార్యాల గురించిన సమాలోచనలు చేస్తారు. ఆత్మీయులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లోను, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఖర్చులు అదుపు చేయాలి. అనవసర జోక్యాల వల్ల చిక్కులొస్తాయి. కలహాలకు దూరంగా ఉండండి.

సింహం :


పట్టింది బంగారంలా సాగిపోతుంది. అభీష్టం నెరవేరుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల మన్ననలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి వుంటుంది. అన్ని రంగాల్లోని వారికి చక్కటి అవకాశాలు అందివస్తాయి. నూతన పరిచయాల వల్ల వ్యవహార లాభం ఉంటుంది. రుణ విముక్తి యత్నాలు ఫలిస్తాయి. చక్కటి సౌకర్యాలను సమకూరతాయి. పొదుపుపై శ్రద్ధ పెట్టాలి. నోటి దురుసుతనాన్ని తగ్గించుకోకుంటే ఆత్మీయులతోనే విరోధాలు తలెత్తుతాయి.

కన్య :


అభీష్టం నెరవేరుతుంది. లక్ష్యసాధనలో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలను అనుకూలంగా ఉంటాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తారు. అన్ని రకాల పోటీల్లోనూ ప్రత్యర్థుల కన్నా ముందంజలో ఉంటారు. అద్భుతమైన అవకాశాలు అందివస్తాయి. ఇష్టమైన వారితో విందులో పాల్గొంటారు. సంతానానికి సంబంధించిన ఆకాంక్ష నెరవేరుతుంది. పరిచయస్తులు సహకరిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన వృద్ధి చెందుతుంది.

తుల :


బాగా కష్టపడితేనే ఫలితాలు దక్కుతాయి. కష్టానికి తగ్గ ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది. ఇష్టకార్యం సిద్ధిస్తుంది. మీకు వ్యతిరేకంగా ప్రత్యర్థులు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. అధికారుల అభిమానాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విజయం వల్ల ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. ఒత్తిడి కారణంగా కొంత అశాంతికి గురవుతారు. దూర ప్రదేశానికి వెళ్లే సూచన ఉంది. వాహనం నడిపేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు తగ్గించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

వృశ్చికం :


కీలకమైన కార్యాలను వారం ప్రారంభంలోనే ముగించండి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. ఇతరులతో సత్సంబంధాలు పెరుగుతాయి. కొత్త అంశాలను అధ్యయనం చేయడానికి అనువైన కాలమిది. ప్రయాణాలు ఆనందంగానే సాగినా, సొంతంగా వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతాన వ్యవహారాలు చికాకు పెడతాయి. తగాదాలకు ఆస్కారం ఉంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వృథా ఖర్చులను తగ్గించండి.

ధనుస్సు :


అన్ని ప్రయత్నాలూ ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్తువులను సేకరిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. రుణ విముక్తి యత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి. ఇరుగు పొరుగు, సహచరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు అనువైన వారం. అపోహల వల్ల తగాదాలకు ఆస్కారం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త. ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకోవాలి.

మకరం :


కార్యసాధనలో అడ్డంకులను సమయస్ఫూర్తితో ఎదుర్కొంటారు. వ్యవహారాలన్నీ విజయవంతంగా సాగుతాయి. ధనలాభం ఉంది. కొత్త వస్తువులను కొంటారు. సంతానం తీరు చికాకు పెడుతుంది. జీవిత భాగస్వామి తోడ్పాటుతో సమస్యను పరిష్కరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మేలిమి ఫలితాలు అందుతాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. మానసిక ప్రశాంతతను పొందుతారు. వృథా ఖర్చులను తగ్గించాలి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులు సహకరిస్తారు.

కుంభం :


అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. బుద్ధి నిలకడ లోపిస్తుంది. అయినవారితోనే గొడవలు వస్తాయి. భూసంబంధ లావాదేవీలను వాయిదా వేయడం మంచిది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. వారం చివరినాటికి పరిస్థితులు మెరుగవుతాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. బంధుమిత్రులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. విలువైన డాక్యుమెంట్లు, వస్తువులను జాగ్రత్తపరచండి.

మీనం :


పనులు సవ్యంగా సాగవు. అభీష్టం నెరవేరదు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కీలకమైన కార్యాలను వారం ప్రారంభంలోనే చేపట్టండి. శుభ ఫలితాలుంటాయి. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభించదు. సంతానం గురించిన ఆందోళన కలుగుతుంది. మనసు నిలకడగా ఉండదు. ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. సోదరులు తోడుగా ఉంటారు. ప్రియమైన వారి కలయిక నూతన ఉత్తేజాన్నిస్తుంది. తల్లి, తత్సమానమైన వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. కీలక వర్తమానం ఆనందాన్నిస్తుంది.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story