Weekly Horoscope 11 To 17 August 2024: ఆర్థిక సమస్యల ఒత్తిడి నుంచి వారికి ఉపశమనం..12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope 11 To 17 August 2024: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే 11 ఆగస్టు నుంచి 17 ఆగస్టు వరకు.

P Vijay Kumar Astrologer
Updated on: 11 Aug 2024 6:00 AM IST
Weekly Horoscope 11 To 17 August 2024
X

Weekly Horoscope 11 To 17 August 2024: వారఫలాలు 11 ఆగస్టు నుంచి 17 ఆగస్టు వరకు

Weekly Horoscope 11 To 17 August 2024: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే 11 ఆగస్టు నుంచి 17 ఆగస్టు వరకు.

మేషం

తలచిన పనుల పూర్తికి కొంచెం ఎక్కువగా శ్రమించాల్సి వుంటుంది. ధన సంబంధ లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. దీర్ఘకాల పెట్టుబడులపై లాభం వస్తుంది. వివాహ సంబంధ శుభకార్యాల గురించి చర్చిస్తారు. జీవిత భాగస్వామి చొరవతో కుటుంబ సమస్యలు పరిష్కరిస్తారు. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అనుకున్న రీతిలో సౌకర్యాలు సమకూరక చికాకు పెరుగుతుంది. దూరప్రయాణం గోచరిస్తోంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. తగాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృషభం

శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి కార్యం విజయవంతం అవుతుంది. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. కుటుంబ అవసరాలను తీరుస్తారు. జీవిత భాగస్వామితో అనురాగం పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. బంధువులను కలుస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు పెరుగుతాయి. శత్రుపీడ తగ్గుతుంది. వ్యక్తిగత గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి. వృథా ఖర్చులు తగ్గించాలి. అనవసర వివాదాల్లో తలదూర్చితే చింతించాల్సి వస్తుంది.

మిథునం

ప్రారంభంలో కాస్త ఒడుదుడుకులుగా అనిపించినా, వారమంతా శుభప్రదంగా సాగుతుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. ధనలాభం ఉంది. వాహనయోగం ఉంది. తృప్తికరమైన విందుకు హాజరవుతారు. గృహోపకరణాలకు డబ్బు ఖర్చు చేస్తారు. శత్రువులపై గెలుపు సాధించడంలో మిత్రుల సహకారం లభిస్తుంది. నూతన విజ్ఞానం పొందేందుకు, జ్ఞానాన్ని వృద్ధి చేసుకునేందుకు అనువైన కాలం. ప్రయాణాలు లాభకరంగా సాగుతాయి. ఇంటి విషయాల్లో జీవిత భాగస్వామి సూచనలు పాటించడం మేలు. బంధాలు బలపడతాయి.

కర్కాటకం

ఆశించిన లక్ష్యం చేరుకునేందుకు బాగా శ్రమించాల్సి వుంటుంది. ధన సంబంధ వ్యవహారాలు వారం చివరికిగానీ కొలిక్కి రావు. ఎదురయ్యే ఆటంకాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. మీ తెలివితేటలకు సరైన గుర్తింపు లభించదు. కీలక తరుణంలో బంధువులు ఆదుకుంటారు. వృథా ఖర్చులు తగ్గించండి. సంతాన సంబంధ వ్యవహారాలు చికాకును కలిగిస్తాయి. నిరాశను, సోమరితనాన్ని వదిలేయండి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కీర్తి పెరుగుతుంది. శత్రువులు శాంతిస్తారు.

సింహం

ముఖ్యమైన కార్యాలను వారం ప్రారంభంలోనే మొదలు పెట్టండి. ఆశించిన ప్రయోజనం దక్కుతుంది. ఆర్థిక లావాదేవీల్లో అతి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. భూసంబంధ వ్యవహారాలు బెడిసికొడతాయి. సంతాన సంబంధ వ్యవహారాలు ఆందోళన కలిగిస్తాయి. తెలివిగేటలకు గుర్తింపు లభించదు. సోదర వర్గం తోడ్పాటుతో సమస్యను దాటేస్తారు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆత్మీయుల కలయిక నూతన ఉత్తేజాన్నిస్తుంది. ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. చెప్పుడు మాటలు వినకండి. విరోధాలకు దూరంగా ఉండండి.

కన్య

ఆటంకాలను దాటితేనే అభీష్టం నెరవేరుతుంది. బ్యాంకు సంబంధ వ్యవహారాలు చికాకు పరుస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కీలక వర్తమానం అందుతుంది. ఇతరుల కారణంగా ఇబ్బందుల్లో పడతారు. ప్రియతముల కలయిక నూతన ఉత్తేజాన్నిస్తుంది. సోదర వర్గం సహకారం లభిస్తుంది. ఎవరికీ పూచీకత్తులు ఇవ్వకండి. మాట నిలుపుకోని కారణంగా నింద పడాల్సి రావచ్చు. భూ, విద్యా సంబంధ విషయాలు వాయిదా వేయండి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

తుల

ఆశించిన ప్రయోజనాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. గృహోపకరణాలను కొంటారు. శుభవర్తమానం అందుకుంటారు. ధైర్యసాహసాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మేలు. బంధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ పరిస్థితులు తృప్తినిస్తాయి. కీలక తరుణంలో అదృష్టం తోడుగా నిలుస్తుంది. ఉద్యోగులకు మేలిమి అవకాశాలుంటాయి. మనశ్శాంతిని పొందుతారు. వాగ్వాదాల్లో మాట తూలకండి. వృథా ఖర్చులు తగ్గించాలి.

వృశ్చికం

మిశ్రమ ఫలితాలుంటాయి. చేపట్టిన పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి వుంటుంది. అయినా అభీష్టం నెరవేరే సూచన లేదు. ఆర్థిక వ్యవహారాల్లో ధననష్టం గోచరిస్తోంది. జాగ్రత్త. బంధువులతోనే విరోధం ఏర్పడినా, చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. దూర ప్రాంతాలకు వెళ్లే సూచన ఉంది. అనవసరంగా ఎవరికీ హామీలు ఇవ్వకండి. ఇతరుల వల్ల అకారణ విరోధాల్లో చిక్కుకుంటారు. ఆస్తి క్రయవిక్రయ వ్యవహారాలు లాభసాటిగా ఉండవు. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

ధనుస్సు

అనుకూలంగా ఉంటుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. రుణ సంబంధ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇష్టమైన వారితో విందులో పాల్గొంటారు. సంతాన సంబంధ శుభ కార్యంపై శ్రద్ధను పెంచుతారు. మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. కాలం ఆనందదాయకంగా సాగుతుంది. అత్యవసర వేళ అదృష్టం అండగా ఉంటుంది. మనశ్శాంతిని పొందుతారు. దూర ప్రయాణాలు ఉంటాయి. బంధువర్గంలోని వారి వైద్యం కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. బద్ధకం వల్ల సమస్యల్లో పడతారు. జాగ్రత్త.

మకరం

యోగదాయకమైన వారమిది. చేపట్టిన ప్రతి కార్యం సఫలం అవుతుంది. డబ్బుకి సంబంధించిన చిక్కులు తొలగిపోతాయి. మీతో విభేదించే వారిని సంతృప్తి పరుస్తారు. పెద్దల ప్రశంసలను పొందుతారు. ఇతరుల నుంచీ సహాయసహకారాలు లభిస్తాయి. గృహోపకరణాలను కొంటారు. మిత్రులు తోడుగా నిలుస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానం ద్వారా వినోద సుఖాన్ని పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దూర ప్రయాణాలున్నాయి. వారం చివరలో వృథా ఖర్చులుంటాయి. అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు.

కుంభం

పట్టింది బంగారంలా ఉంటుంది. మనోవాంఛ నెరవేరుతుంది. ఆర్థిక చికాకులు తొలగిపోతాయి. ఉద్యోగులు చక్కటి గుర్తింపును పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. అధికారుల మన్ననలను పొందుతారు. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. రుణ విముక్తి ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంతాన సంబంధ శుభ వార్తను వింటారు. గృహశాంతి ఉంటుంది.

మీనం

అభీష్టం నెరవేర్చుకునేందుకు బాగా శ్రమించాల్సి వుంటుంది. అవసరానికి సరిపడా డబ్బు అందుతుంది. బంధువులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. అధికారులు, పెద్దల ఆశీస్సులను పొందుతారు. మేలిమి అవకాశాలు అందివస్తాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త బాధ్యతలను చేపడతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అపోహలు తగ్గించకుంటే మంచిది. వాహనాలు నడిపేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి. వృథా ఖర్చులుంటాయి. భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. దైవ సంబంధ శుభ కార్యాల్లో పాల్గొంటారు.



P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story