Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 26 July 2024

Today Horoscope in Telugu, 26 July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? ఈ రోజు 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.

P Vijay Kumar Astrologer
Updated on: 26 July 2024 6:01 AM IST
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 26 July 2024
X

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 26 July 2024

Today Horoscope in Telugu, 26 July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? ఈ రోజు 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం

తిధి: షష్ఠి రాత్రి గం.11.30 ని.ల వరకు

నక్షత్రం: ఉత్తరాభాద్ర మధ్యాహ్నం గం.2.30 ని,.ల వరకు తర్వాత రేవతి

అమృతఘడియలు: ఉదయం గం.10.03 ని.ల నుంచి గం.11.32 ని.ల వరకు

వర్జ్యం: అర్ధరాత్రి గం.1.45 ని.ల నుంచి గం.3.15 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.8.32 ని.ల నుంచి గం.9.24 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.50 ని.ల నుంచి గం.1.42 ని.ల వరకు

రాహుకాలం: ఉదయం గం.10.48 ని.ల నుంచి గం.12.24 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం.5.58 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం.6.51 ని.లకు

మేషం

వ్యవహారాలు ఆశించినట్లు సాగవు. ఆటంకాలుంటాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. బద్ధకం కారణంగా చిక్కుల్లో పడతారు. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. వేళకు భోజనంవుండదు. మనశ్శాంతి లోపిస్తుంది.

వృషభం

రోజు ఆనందంగా గడుస్తుంది. అభీష్టం నెరవేరుతుంది. ఇష్టమైన వారితో విందుల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఇల్లు నిర్మించే ఆలోచన కొలిక్కి వస్తుంది.

మిథునం

ప్రయత్నించిన ప్రతి కార్యమూ సఫలమవుతుంది. అధికారుల మన్ననలను పొందుతారు. అవకాశాలను ఉపయోగించుకోండి. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. కీర్తి పెరుగుతుంది.ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది.

కర్కాటకం

పనులు నెమ్మదిగా సాగుతాయి. బ్యాంకు లావాదేవీలు తృప్తినివ్వవు. దూర ప్రదేశానికి వెళ్లే సూచన ఉంది. సంతానం తీరును వ్యతిరేకిస్తారు. కుటుంబంలో చికాకులొస్తాయి. త్వరగా అలసిపోతారు. దైవధ్యానం మేలు.

సింహం

నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి కావు. అడుగడుగునా ఆటంకాలొస్తాయి. ఇతరుల శైలిపై దురభిప్రాయం కలుగుతుంది. తగాదాలకు ఆస్కారముంది. పెద్దల కోపానికి గురవుతారు. ఉద్రేకాన్ని అదుపు చేసుకోవాలి.

కన్య

యత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. అన్ని చోట్లా సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థిక చికాకులు తొలగుతాయి. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. ప్రయాణాలు ఉపయోగపడతాయి. విందులో పాల్గొంటారు.

తుల

చేపట్టిన పనుల్లో శుభ ఫలితాలను అందుకుంటారు. ధనలాభం ఉంది. శత్రువుల బెడద తగ్గుతుంది. బంధువుల తోడ్పాటుతో కుటుంబ సమస్యల్ని పరిష్కరిస్తారు. కీర్తి పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.

వృశ్చికం

ఆటంకాలు ఎక్కువవుతాయి. వ్యవహారాలు సజావుగా సాగవు. అభీష్టం నెరవేరదు. నిరాశ అలముకుంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ముఖ్యమైన సమయంలో మిత్రుల సహకారం మేలు చేస్తుంది.

ధనుస్సు

వ్యవహార నష్టాల వల్ల భయాందోళనలు పెరుగుతాయి. అయినవారే శత్రువులుగా వ్యవహరిస్తారు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. ఆస్తి అమ్మే ప్రయత్నాలు వాయిదా వేయండి. వృథా ఖర్చులు తగ్గించుకుంటే మేలు.

మకరం

యత్నించిన ప్రతి కార్యమూ ఫలిస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. కీలక సమయంలో మీ పరాక్రమానికి ప్రశంసలొస్తాయి. దాయాదుల సహకారం పొందుతారు. మధ్యవర్తిత్వం ద్వారా లబ్దిని పొందుతారు.

కుంభం

ఆర్థిక వ్యవహారాలు చికాకు పెడతాయి. అనూహ్యమైన ఖర్చుల వల్ల నిల్వలు తరుగుతాయి. చేయని తప్పునకు నింద భరించాల్సి రావచ్చు. అకారణ విరోధం ఏర్పడుతుంది.కంటి సమస్యను అశ్రద్ధ చేయకండి.

మీనం

రోజంతా అదృష్టం తోడుగా ఉంటుంది. దీర్ఘకాల సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.



P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story