Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా..6 August 2024

Today Horoscope in Telugu, 06 August 2024: ఈరోజు రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.

P Vijay Kumar Astrologer
Updated on: 6 Aug 2024 6:00 AM IST
Today Horoscope in Telugu: Daily Rasi Phalalu for 6 August 2024 Tuesday in Telugu
X

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 06 August 2024

06-08-2024 (మంగళవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం.

తిధి : విదియ రాత్రి గం.7.52 ని.ల వరకు ఆ తర్వాత తదియ.

నక్షత్రం: మఖ సాయంత్రం గం.5.44 ని.ల వరకు ఆ తర్వాత పుబ్బ.

అమృతఘడియలు: మధ్యాహ్నం గం.3.05 ని.ల నుంచి గం.4.51 ని.ల వరకు.

వర్జ్యం: అర్ధరాత్రి దాటిన తర్వాత గం.2.39 ని.ల నుంచి గం.4.26 ని.ల వరకు.

దుర్ముహూర్తం : ఉదయం గం.8.31 ని.ల నుంచి గం.98.22 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.11.15 ని.ల నుంచి గం 12.00 ని.ల వరకు.

రాహుకాలం : మధ్యాహ్నం గం.3.34 ని.ల నుంచి గం.5.11 ని.ల వరకు.

సూర్యోదయం : తె.వా. గం. 5.57 ని.లకు.

సూర్యాస్తమయం : సా. గం. 6.47 ని.లకు.

మేషం


కార్యసాధనలో ఆటంకాలు పెరుగుతాయి. విశ్లేషణ శక్తి తగ్గుతుంది. సంతాన వ్యవహారాలు చికాకు పెడతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. శిక్షణ వ్యవహారాలు సజావుగా సాగవు. జీర్ణ సమస్యలను అశ్రద్ధ చేయకండి.

వృషభం


బుద్ధి నిలకడగా ఉండదు. అపోహలు పెరుగుతాయి. ఆలోచన విధానం వక్రగతిలో సాగుతుంది. బంధువులతో సఖ్యత చెడుతుంది. ఆస్తి వ్యవహారాలను వాయిదా వేయండి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది.

మిథునం


లక్ష్యాన్ని చేరుకుంటారు. వ్యవహారాల్లో బోళాతనం పనికి రాదు. ఆదాయం మెరుగవుతుంది. తోబుట్టువులతో అనుబంధం పెరుగుతుంది. ఆత్మీయులతో విందులో పాల్గొంటారు. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది.

కర్కాటకం


ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగవు. హామీపత్రాలపై సంతకాలు చేయకండి. వేళకు భోజనం ఉండదు. మనశ్శాంతి కరువవుతుంది. అనూహ్య ఖర్చులు పెరుగుతాయి.

సింహం


అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. బాల్య మిత్రులను కలుస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తు చేసుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది.

కన్య


పనులు అనుకున్న రీతిలో సాగవు. ఆర్థిక చికాకులు తప్పవు. బంధువులతో సఖ్యత తగ్గుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. అనూహ్య ఖర్చు గోచరిస్తోంది. వేళకు భోజనముండదు. ఒంటరితనాన్ని ఇష్టపడతారు.

తుల


ఉత్సాహంగా గడుపుతారు. ఆశలు నెరవేరతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. విందులో పాల్గొంటారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

వృశ్చికం


పనులు నిర్దేశించుకున్న రీతిలోనూ పూర్తవుతాయి. ధన సంబంధ చికాకులు తొలగుతాయి. మనోవాంఛ నెరవేరుతుంది. సామర్థ్యానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. గౌరవం పెరుగుతుంది.

ధనుస్సు


పనుల పూర్తికి బాగా కష్టపడాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీల్లో జాప్యం ఏర్పడుతుంది. దూర ప్రాంతానికి వెళ్లే సూచన ఉంది. పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సంప్రదాయాలపై ఆసక్తి పెరుగుతుంది. వృథా ఖర్చులు వద్దు.

మకరం


ఆటంకాలు పెరుగుతాయి. ధననష్టం ఉంది. బలహీనతలు బయటపెట్టకండి. శత్రుపీడ పెరుగుతుంది. ఓటమి భయం ఏర్పడుతుంది. పెద్దల కోపానికి గురవుతారు. వేళకు భోజనముండదు. కోపాన్ని తగ్గించుకోవాలి.

కుంభం


పనులు సజావుగా సాగుతాయి. అవసరానికి సరిపడా డబ్బు అందుతుంది. బంధువులను కలుస్తారు. ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. పోటీలో విజయం సాధిస్తారు.

మీనం


శుభ ఫలితాలు అందుకుంటారు. ధనలాభం ఉంది. మానసిక దృఢత్వం పెరుగుతుంది. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మిత్రులు సహకరిస్తారు. గౌరవం పెరుగుతుంది.



P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story