Today Horoscope in Telugu: ఆ రాశి ఉద్యోగులకు అధికార యోగం.. 12 రాశుల వారి గురువారం నాటి రాశిఫలాలు (10 October 2024)

Today Horoscope in Telugu, 10 October 2024: ఈరోజు పంచాంగం (Panchangam) వివరాలు. 12 రాశుల వారి గురువారం నాటి రాశిఫలాలు (Horoscope) ఎలా ఉన్నాయంటే?

P Vijay Kumar Astrologer
Updated on: 10 Oct 2024 6:00 AM IST
Today Horoscope in Telugu
X

Today Horoscope in Telugu: ఆ రాశి ఉద్యోగులకు అధికార యోగం.. 12 రాశుల వారి గురువారం నాటి రాశిఫలాలు (10 October 2024)

Today Horoscope in Telugu, 10 October 2024: ఈరోజు పంచాంగం (Panchangam) వివరాలు. 12 రాశుల వారి గురువారం నాటి రాశిఫలాలు (Horoscope) ఎలా ఉన్నాయంటే?

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షాణాయనం, శరదృతువు, శుక్ల పక్షం

తిధి: సప్తమి ఉదయం గం.7.18 ని.ల వరకు ఆ తర్వాత అష్టమి

నక్షత్రం: పూర్వాషాఢ అర్ధరాత్రి గం.1.41 ని.ల వరకు

అమృతఘడియలు: ఇవాళ అర్ధరాత్రి గం.12.48 ని.ల నుంచి గం.2.26 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.3.01 ని.ల నుంచి గం.4.39 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.10.05 ని.ల నుంచి గం. 10.52 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.2.49 ని.ల నుంచి గం.3.36 ని.ల వరకు

రాహుకాలం: మధ్యాహ్నం గం.1.32 ని.ల నుంచి గం.3.00 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.08 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం.5.58 ని.లకు

మేషం

పనులకు అడ్డంకులు ఉంటాయి. సంప్రదాయిక జీవితంపై ఆసక్తి పెరుగుతుంది. ధర్మ కార్యాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణం సూచిస్తోంది. ఆర్థిక వ్యవహారాలు మామూలుగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో జాగ్రత్త.

వృషభం

శత్రువులు, మీ బలహీనతలపై దెబ్బతీస్తారు. వారసత్వపు లావాదేవీలు లాభించవు. తగాదాలకు ఆస్కారం ఉంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఇష్టంలేని పని చేయాల్సి వస్తుంది.జీర్ణ సంబంధ సమస్యలుంటాయి.

మిథునం

నిజాయితీకి గుర్తింపు ఉంటుంది. పనులు తృప్తిగా సాగుతాయి. జీవత భాగస్వామి సూచన మేలు చేస్తుంది. బంధాలు బలపడతాయి. ప్రయాణం లాభిస్తుంది. అంతర్గత కోరిక తీరుతుంది. శారీరక సౌఖ్యముంటుంది.

కర్కాటకం

అపోహలు తొలగిపోతాయి. శత్రుపీడ ఉండదు. కోర్టు వ్యవహారాల్లో శుభ ఫలితాలుంటాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది. విందులో పాల్గొంటారు. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి.

సింహం

కీలక వ్యవహారాల్లో సొంత తెలివితేటలను ఉపయోగించకండి. ముందుచూపు లేమి వల్ల సమస్యలొస్తాయి. శిక్షణ పొందుతున్న వారికి అనుకూలంగా లేదు. మాయా సాధువుల వల్ల మోసపోయే పరిస్థితి గోచరిస్తోంది.

కన్య

పనులు ఏమంత తృప్తికరంగా సాగవు. ప్రతి చోటా అడ్డంకులుంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. నమ్మిన వారి వల్లే మోసపోయే సూచన ఉంది. మనశ్శాంతి కరువవుతుంది. భూసంబంధ చిక్కులుంటాయి.

తుల

పనులు సవ్యంగా సాగుతాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. తోబుట్టువుల సహకారంతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలుంటాయి. నైపుణ్యానికి తగ్గ గుర్తింపును పొందుతారు.

వృశ్చికం

బ్యాంకు లావాదేవీలు తృప్తినివ్వవు. ఇతరుల వల్ల ఇబ్బందులు పడతారు. అకారణ విరోధాలకు ఆస్కారం ఉంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు. కుటుంబంలోనూ చికాకులుంటాయి. వేళకు భోజనముండదు.

ధనుస్సు

అన్ని రంగాల్లోని వారికీ మేలిమి కాలం. పనులు సజావుగా సాగుతాయి. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. గౌరవం లభిస్తుంది. చక్కటి వ్యక్తిత్వంతో పెద్దవారిని ఆకట్టుకుంటారు. అంతులేని ఆనందాన్ని పొందుతారు.

మకరం

అనవసర జొక్యాల వల్ల చిక్కులొస్తాయి. మిత్రులూ విరోధులయ్యే సూచన ఉంది. ప్రతి సందర్భంలోనూ జాగ్రత్తగా నడచుకోవాలి. అనవసర ప్రయాణాలు వాయిదా వేయండి. నిద్రలేమి వేధిస్తుంది. ఆరోగ్యంజాగ్రత్త.

కుంభం

వ్యవహారాలన్నీ విజయవంతం అవుతాయి. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. మనశ్శాంతిని పొందుతారు. పెద్దవారి ఆశీస్సులను పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మీనం

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఉద్యోగులకు రివార్డులుంటాయి. ప్రత్యర్థులను గెలుస్తారు. దూరప్రాంతాల్లో స్థిరనివాస యత్నం చేస్తారు.



P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story