Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/10/24)

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం.. 12రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Updated on: 12 Oct 2024 1:57 AM IST
Today Horoscope in Telugu
X

Today Horoscope in Telugu

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం.. 12రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్ల పక్షం

తిధి: అష్టమి ఉదయం గం.6.45 ని.ల వరకు తర్వాత నవమి రేపు తె.వా.గం.5.37 ని.ల వరకు

నక్షత్రం: ఉత్తరాషాఢ అర్ధరాత్రి గం. 1.25 ని.ల వరకు

అమృతఘడియలు: రాత్రి గం.11.05 ని.ల నుంచి గం.12.40 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.1.36 ని.ల నుంచ గం.3.11 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.8.30 ని.ల నుంచి గం.9.17 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.25 ని.ల నుంచి గం.1.14 ని.ల వరకు

రాహుకాలం: ఉదయం గం.1.34 ని.ల నుంచి గం.12.03 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.08 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 5.57 ని.లకు

మేషం

వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ప్రతి ప్రయత్నమూ కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు శుభవార్త అందుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అభీష్టం నెరవేరుతుంది. మనసు శాంతంగా ఉంటుంది.

వృషభం

పనుల పూర్తికి బాగా కష్టపడాల్సి వుంటుంది. కీలక సమయంలో మిత్రులు తోడుగా నిలుస్తారు. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. భవిష్యత్తు గురించిన చింత కలుగుతుంది. దైవ కార్యాలకు హాజరవుతారు.

మిథునం

తగాదాలకు ఆస్కారం ఉంది. తొందరపాటు మాటలు, నిర్ణయాలు తగదు. అపోహల వల్ల చెడు ఆలోచనలు వస్తాయి. వాహనం నడిపేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు బద్ధకాన్ని వదిలిపెట్టి పనిచేయాలి.

కర్కాటకం

అన్ని ప్రయత్నాలూ సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి.

సింహం

వ్యవహారాల్లో శుభ ఫలితాలుంటాయి. ధనలాభం గోచరిస్తోంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అపార్థాలు తొలగిపోతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కొత్త వస్తువులను కొంటారు. విందుకు హాజరవుతారు.

కన్య

బద్ధకాన్ని వదిలి పెట్టాలి. అడ్డంకులను చాకచక్యంగా దాటేస్తారు సంతాన సంబంధ విషయాలపై శ్రద్ధ పెడతారు. వృథా ఖర్చులు పెరుగుతాయి. తెలివితేటలు ఉపయోగ పడవు. అభీష్టం నెరవేరే సూచన లేదు.

తుల

బుద్ధి నిలకడగా ఉండదు. అయిన వారితోనే విరోధాలు ఏర్పడతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో నష్టపోతారు. అవమానాలకు ఆస్కారముంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. విద్యారంగంలోనివారు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. అన్ని వైపులా శుభ ఫలితాలే ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో చేపట్టే కార్యాలు ఫలిస్తాయి. దాయాదులతో వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు గోచరిస్తున్నాయి.

ధనుస్సు

మనసుకి కష్టం కలిగే సంఘటలను ఎదురవుతాయి. అకారణ విరోధాలకూ ఆస్కారం ఉంది. కుటుంబంలో స్వల్ప చికాకులుంటాయి. వేళకు భోజనం ఉండదు. మాట నిలుపుకోలేక పోతారు. అనవసర జోక్యాలు వద్దు.

మకరం

ప్రతి పనీ విజయవంతంగా పూర్తవుతుంది. తెలివితేటలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. విందులకు హాజరవుతారు.చిన్ననాటి విషయాలు గుర్తుచేసుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది.

కుంభం

పనులు అనుకున్నట్లుగా సాగవు. జరిగే పరిణామాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. వేళకు భోజనం ఉండదు. అనవసర ప్రయాణాలు వద్దు. వృథా ఖర్చులు పెరుగుతాయి.

మీనం

రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలన్నీ శుభప్రదంగా సాగుతాయి. ఇంటి సమస్యలను చక్కదిద్దుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story