Horoscope: రాశిఫలం... మంగళవారం 7 మే, 2024

Horoscope: రాశిఫలం... మంగళవారం 7 మే, 2024

P Vijay Kumar Astrologer
Updated on: 7 May 2024 11:10 AM IST
Today Horoscope In Telugu 7th May 2024
X

Horoscope: రాశిఫలం... మంగళవారం 7 మే, 2024

(07-05-2024, మంగళవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, చైత్ర మాసం, ఉత్తరాయణం, వసంతరుతువు, బహుళ పక్షం,

తిధి : చతుర్దశి ఉదయం గం.11.40 ని.ల వరకు ఆ తర్వాత అమావాస్య

నక్షత్రం: అశ్వని మధ్యాహ్నం గం.3.32 ని.ల వరకు ఆ తర్వాత భరణి

అమృతఘడియలు: ఉదయం గం.8.59 ని.ల నుంచి ఉదయం గం.10.27 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.11.54 ని.ల నుంచి మధ్యాహ్నం గం.1.21 ని.ల వరకు మళ్లీ అర్ధరాత్రి గం. 12.21 ని.ల నుంచి గం.1.49 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.21 ని.ల నుంచి గం.8.53 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.11.06 ని.ల నుంచి రాత్రి గం.11.50 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం. 3.26 ని.ల నుంచి సాయంత్రం గం. 5.02 ని.ల వరకు

సూర్యోదయం : ఉదయం గం. 5.47 ని.లకు

సూర్యాస్తమయం : సాయంత్రం గం.6.38 ని.లకు

ఇవాళ్టి విశేషం : దర్శ అమావాస్య

ఉగాది తర్వాత, తొలిసారిగా చంద్రుడు కనిపించని రాత్రిని దర్శ అమావాస్యగా జరుపుకుంటారు. మనఃకారకుడైన చంద్రుని ప్రీతి కోసం.. ఈరోజంతా ఉపవసించి, మరునాడు చంద్రదర్శనం అయ్యాకే భోజనం చేస్తారు. ఈరోజు చేసే శ్రాద్ధ కర్మల వల్ల.. పితృదేవతలకు శాశ్వత మోక్షం లభిస్తుందన్న విశ్వాసమూ ఉంది. ఉత్తరభారతంలో ఈ దర్శ అమావస్యను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

మేషం :

శుభప్రదంగా ఉంటుంది. అవసరానికి సరిపడా డబ్బు అందుతుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విందులకు హాజరవుతారు. కుటుంబ చికాకులు తొలగుతాయి. అదృష్టం తోడవుతుంది.

వృషభం :

ఆటంకాలను ధైర్యంగా దాటేస్తారు. శత్రువులు పెరుగుతారు. అకారణ విరోధాలూ ఏర్పడతాయి. మాట తప్పడం వల్ల సమస్య వస్తుంది. వేళకు భోజనముండదు.ఖర్చులు తగ్గించండి. విష్ణువుని పూజించండి.

మిథునం :

సోదరుల తోడ్పాటు లభిస్తుంది. కార్యాల్లో శుభ ఫలితాలుంటాయి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. చాలాకాలంగా ఎదురు చూస్తున్న కీలక సమాచారం అందుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

కర్కాటకం:

చేపట్టిన పని పూర్తికి బాగా శ్రమించాలి. ఆస్తి అమ్మే ప్రయత్నాలు వాయిదా వేయండి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి ఒత్తిళ్లు పెరుగుతాయి. డబ్బుకీ కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. దుర్గమాతను పూజించండి.

సింహం:

బద్ధకం వదిలి పెట్టాలి. చిత్తశుద్ధితో పనులు కొనసాగించండి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. వాత సంబంధ సమస్యలుంటాయి. సంతానం వల్ల చికాకులొస్తాయి. డాక్యుమెంట్లు పోగొట్టుకునే సూచన ఉంది.

కన్య:

శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన పనులు సఫలమవుతాయి. అవసరానికి సరిపడా డబ్బు అందుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్య సమస్యలు తీరతాయి. బంధుమిత్రులు తోడుగా ఉంటారు.

తుల:

అభీష్టం నెరవేరుతుంది. ధనసమస్యలు తొలగుతాయి. ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. జీవితభాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

వృశ్చికం:

అనుకున్నట్లుగా పనులు సాగవు. చిరాకు కలుగుతుంది. ఇతరులపై చెడు అభిప్రాయం వల్ల తప్పుడు మార్గంలోకి వెళ్లే సూచన ఉంది. ఇష్టం లేని పనులూ చేయాల్సి వస్తుంది. వేంకటేశ్వరుని పూజించండి.

ధనుస్సు:

కష్టే ఫలి అని గుర్తిస్తారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు. పుత్రులతో విరోధం గోచరిస్తోంది. కొన్ని బాధ్యతల నుంచి వైదొలగుతారు. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేస్తారు. మానసిక అలసటకు గురవుతారు.

మకరం:

యోగదాయకంగా ఉంటుంది. చాలా అవకాశాలు వస్తాయి.. ఉపయోగించుకోండి. అధికారులూ మీకు అండగా ఉంటారు. కొత్త బాధ్యతలు చేపడతారు. ప్రమోషన్లకూ అనుకూలం. ఇంట్లో శాంతి నెలకొంటుంది.

కుంభం:

సుఖ సంతోషాలతో ఉంటారు. ఇష్టమైన వారిని కలుస్తారు. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. అప్పులు కొంతమేర తీరుస్తారు. అవసరమైన సౌకర్యాలను ఏర్పరచుకుంటారు. సంతాన వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి.

మీనం:

పనులు అనుకున్నంత సవ్యంగా సాగవు. బద్ధకాన్ని వదిలించుకుని బాగా శ్రమించాలి. వృథాఖర్చులు ఉంటాయి. కొన్ని బాధ్యతల నుంచి బలవంతంగా తప్పుకోవాల్సి రావచ్చు. దక్షిణామూర్తిని ధ్యానించండి.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story