Today Horoscope in Telugu (16-07-2025): నేటి రాశిఫలాలు – 12 రాశుల జాతక ఫలితాలు ఇలా ఉన్నాయి!

Today Horoscope in Telugu (16-07-2025): నేటి రాశిఫలాలు – 12 రాశుల జాతక ఫలితాలు ఇలా ఉన్నాయి!
x

Today Horoscope in Telugu (16-07-2025): Here's How the Daily Predictions Look for All 12 Zodiac Signs!

Highlights

16 జూలై 2025 నాటి రాశి ఫలాలు – మేషం నుండి మీనం వరకు 12 రాశుల జాతక ఫలితాలు తెలుగులో తెలుసుకోండి. ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ విషయాల్లో మీ రాశికి శుభ సూచనలు ఇవే.

ఈ రోజు మీ జీవితంలో ఏ మార్పులు సంభవించనున్నాయో తెలుసుకోండి. 12 రాశుల వారీగా ఈరోజు ఆర్థిక, ఉద్యోగ, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చదవండి. నేటి రాశి ఫలితాలు (Telugu Daily Horoscope) మీకు మార్గదర్శకంగా ఉంటాయి.

మేషం (Aries)

శుభ ఫలితాలు ఎదుర్కొంటారు. అధికారులతో ముఖ్యమైన సమావేశం అనుకూలంగా పూర్తవుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. శ్రీవిష్ణు ఆరాధన శుభప్రదం.

వృషభం (Taurus)

ప్రారంభించే పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఇష్టమైన వారితో ఆనందంగా గడుపుతారు. శ్రీఆంజనేయుడిని పూజించండి.

మిథునం (Gemini)

చిత్తశుద్ధితో పనుల్ని పూర్తి చేయండి. విజయానికి అవకాశం ఉంది. శివ ఆరాధన శుభంగా మారుతుంది.

కర్కాటకం (Cancer)

మిశ్రమ ఫలితాల దినం. బుద్ధి, ధైర్యంతో వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దైవారాధన మానకండి.

సింహం (Leo)

ఇప్పటి దాకా ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. శ్రీగణపతి ఆరాధన శుభప్రదం.

కన్యా (Virgo)

పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయోజనాలు ఉన్నా, శారీరక శ్రమ ఎక్కువ. శని శ్లోకం పఠనం మంచిది.

తుల (Libra)

ప్రధాన విషయాల్లో అనుకున్న ఫలితాలు పొందుతారు. కుటుంబంలోని పెద్దల మాట వినాలి. శివాష్టోత్తర శతనామావళి చదవాలి.

వృశ్చికం (Scorpio)

విందులు, వినోదాలు మీరోజును అలరిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శ్రీఆంజనేయుడిని ఆరాధించండి.

ధనుస్సు (Sagittarius)

విజయం కోసం తోటి వారి సహకారం లభిస్తుంది. శుభవార్తలు ఉత్సాహాన్నిస్తుంది. శ్రీరామనామ జపం శుభదాయకం.

మకరం (Capricorn)

ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శుభవార్తలు. సమయపాలనతో విజయాలు. శ్రీవిష్ణు ఆలయం దర్శనం శుభప్రదం.

కుంభం (Aquarius)

కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేస్తారు. హనుమాన్ చాలీసా పఠనం మేలు కలిగిస్తుంది.

మీనం (Pisces)

కర్మసిద్ధి కలుగుతుంది. ధైర్యంతో ముందుకు సాగితే విజయం మీ సొంతం. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం.

Show Full Article
Print Article
Next Story
More Stories