Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 22 July 2024

Today Horoscope in Telugu, 22 July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? జులై 22 సోమవారం నాటి 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.

P Vijay Kumar Astrologer
Updated on: 22 July 2024 2:33 PM IST
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 22 July 2024
X

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. 22 July 2024

Today Horoscope in Telugu, 22 July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? జులై 22 సోమవారం నాటి 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం

తిధి : పాడ్యమి మధ్యాహ్నం గం.1.11 ని.ల వరకు ఆ తర్వాత విదియ

నక్షత్రం: శ్రవణము రాత్రి గం.10.21 ని.ల వరకు ఆ తర్వాత ధనిష్ట

అమృతఘడియలు: మధ్యాహ్నం గం.12.46 ని.ల నుంచి గం.2.14 ని.ల వరకు

వర్జ్యం: ఇవాళ అర్ధరాత్రి దాటాక గం.2.00 ని.ల నుంచి గం. 3.28 ని.ల వరకు

దుర్ముహూర్తం : మధ్యాహ్నం గం.12.49 ని.ల నుంచి గం. 1.41 ని.ల వరకు, మళ్లీ మధ్యాహ్నం గం.3.25 ని.ల నుంచి గం. 4.17 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.7.30 ని.ల నుంచి గం.9.08 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం.5.52 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.53 ని.లకు

మేషం

క్లిష్టమైన కార్యాన్ని సుసాధ్యం చేస్తారు. అభీష్టం నెరవేరుతుంది.. ఉద్యోగులకు అధికారులతో సఖ్యత ఉంటుంది. శత్రుపీడ తగ్గుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఉత్సాహం పెరుగుతుంది

వృషభం

పిత్రార్జిత ఆస్తి వ్యవహారాలు చిక్కుల్లో పడతాయి. సంతానం తీరును విభేదిస్తారు. బంధువర్గంతో గొడవలకు ఆస్కారం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. శత్రుపీడ అధికమవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మిథునం

పనులను అయిష్టంగా చేయాల్సి వస్తుంది. ఆశించిన ప్రయోజనాలు నెరవేరవు. ఇతరులపై దురభిప్రాయం ఏర్పడుతుంది. మనసును నియంత్రించుకోవాలి. తగాదాలకు దూరంగా ఉండాలి. జీర్ణ సమస్యలుంటాయి.

కర్కాటకం

పనుల్లో ఆశించిన రీతిలోనే ఫలితాలుంటాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. వైవాహిక బంధం బలపడుతుంది. ప్రయాణాలు ఆనందాన్నిస్తాయి. కొత్త పరిచయస్తులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి.

సింహం

కీలకమైన వ్యవహారంలో విజయం లభిస్తుంది. అవసరానికి సరిపడనంత డబ్బు సమకూరుతుంది. వస్తువుల కొనుగోలుకు ఖర్చు చేస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కీర్తి పెరుగుతుంది. స్వస్థానప్రాప్తి ఉంది.

కన్య

ప్రయత్నాలు వ్యర్థమవుతాయి. ఉపాయాలు ఫలించవు. లాటరీలు, షేర్ల వంటి వాటిల్లో పెట్టుబడులకు అనుకూలం కాదు. క్రీడాకారులకు తగిన ఫలితం దక్కదు. వ్యాపారంలో మీ శ్రమ భాగస్వామికి లాభిస్తుంది.

తుల

ప్రతిచోటా ఆటంకాలుంటాయి. ఆర్థిక లావాదేవీలను వీలైతే వాయిదా వేయండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త.. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. మనశ్శాంతిని కోల్పోతారు. ఆస్తి అమ్మే ప్రయత్నం వద్దు.

వృశ్చికం

పనులు అనుకున్నట్లే జరుగుతాయి. ఆస్తి వ్యవహారాల్లో సోదరులు అనుకూలంగా వ్యవహరిస్తారు. ధనాదాయం పెరుగుతుంది. కీలక సమస్య పరిష్కారంలో ధైర్యం ప్రదర్శిస్తారు. మనశ్శాంతిని పొందుతారు.

ధనుస్సు

అప్రమత్తంగా ఉండండి. ఆటంకాలుంటాయి. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. ఇతరుల వల్ల ఇబ్బందులొస్తాయి. అనుకున్నవి సవ్యంగా జరగవు. ఆర్థిక ఇబ్బందులుంటాయి. అకారణ విరోధాలొస్తాయి.

మకరం

యోగదాయకంగా ఉంటుంది. ధనలాభం ఉంది. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. కొత్త విషయాలను గ్రహిస్తారు. గౌరవం పెరుగుతుంది. బంధువులతో విందుల్లో పాల్గొంటారు.

కుంభం

పనిపై ఏకాగ్రతను కనబరచాలి. బద్ధకం ఏమాత్రం కూడదు. దూర ప్రయాణం గోచరిస్తోంది. వేళకు భోజనం ఉండదు. బాధ్యత నుంచి తప్పుకోవాల్సి రావచ్చు. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా నడచుకోండి.

మీనం

కాలం ఆనందంగా గడుస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. మిత్రులతో సరదాగా గడుపుతారు. ఆత్మీయులతో విందుల్లో పాల్గొంటారు. సంతానం వ్యవహారాలు తృప్తినిస్తాయి. కొత్త వస్తువులను కొంటారు.


P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story