February 2024: ఫిబ్రవరిలో ఈ తేదీలు శుభప్రదం.. వివాహాల నుంచి వాహనాల కొనుగోళ్ల వరకు..!

February 2024: హిందూ సంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యమైనా మంచి రోజు చూసి ప్రారంభిస్తారు. ప్రస్తుతం జనవరి చివరి దశ కొనసాగుతోంది.

Arun Chilukuri
Updated on: 26 Jan 2024 7:30 PM IST
These Dates Are Auspicious In February Everything From Marriages To Vehicle Purchases Can Be Done
X

February 2024: ఫిబ్రవరిలో ఈ తేదీలు శుభప్రదం.. వివాహాల నుంచి వాహనాల కొనుగోళ్ల వరకు..!

February 2024: హిందూ సంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యమైనా మంచి రోజు చూసి ప్రారంభిస్తారు. ప్రస్తుతం జనవరి చివరి దశ కొనసాగుతోంది. మరో ఐదు, ఆరు రోజుల్లో ఫిబ్రవరి ప్రారంభంకానుంది. ఈ నెలలో చాలా శుభముహూర్తాలు ఉన్నాయి. ఇప్పటికే మంచి రోజులు లేక చాలా శుభకార్యాలు పెండింగ్‌లో ఉన్నాయి. సనాతన ధర్మంలో ఏ శుభ కార్యమైనా శుభ ముహూర్తంలో చేస్తే శుభ ఫలితాలు వస్తాయని, సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజు ఫిబ్రవరిలోని శుభ ముహూర్తాల గురించి తెలుసుకుందాం.

వాహనం ఆస్తి కొనుగోలుకు అనుకూలమైన తేదీలు

ఫిబ్రవరి 04, 06, 13, 18, 23, 24, 25 తేదీల్లో ఇల్లు, ఆస్తి కొనుగోలు చేయవచ్చు. ఈ రోజుల్లో అనుకూల సమయం ఉంటుంది. అయితే మీరు 01, 02, 04, 18, 21, 22, 29 తేదీల్లో కారును కూడా కొనుగోలు చేయవచ్చు.

వివాహానికి అనుకూలమైన తేదీలు

సనాతన ధర్మంలో వివాహం చాలా పవిత్రమైన కార్యంగా చెబుతారు. దీనికి శుభ సమయం చాలా ముఖ్యం. ఫిబ్రవరిలో వివాహానికి 04, 06, 07, 08, 12, 13, 17, 24, 25, 26, 29 రోజులు అనుకూలంగా ఉంటాయి.

నామకరణం, గృహ ప్రవేశానికి అనుకూలమైన తేదీలు

ఫిబ్రవరి 26 గృహ ప్రవేశానికి మంచి రోజు. అలాగే బిడ్డకు 01, 02, 04, 08, 11, 14, 18, 21, 22, 25, 26 , 29 తేదీల్లో పేరు పెట్టడానికి శుభసమయం.

సర్వార్థ సిద్ధి యోగం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సర్వార్థ సిద్ధి యోగంలో పని చేయడం శుభప్రదంగా చెబుతారు. ఫిబ్రవరి 03, 06, 08, 12, 13, 16, 18, 20, 22, 25, 31 తేదీల్లో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతోంది. ఈ యోగంలో పని ప్రారంభిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారలకు అనుకూల సమయం.

ఫిబ్రవరి నెలలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే 12, 16, 26 తేదీల్లో ప్రారంభించవచ్చు. ఈ రోజు్లో సమయం అనుకూలంగా ఉంటుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story