Zodiac Signs: ఈ 3 రాశులవారికి శని దయ ఉంటుంది.. ధనప్రాప్తి, వ్యాపార పురోగతి..!

Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు, రాశుల ప్రభావం వల్ల మానవులు మంచి చెడులని అనుభవిస్తారు.

Jyothi
Updated on: 25 Aug 2023 7:00 AM IST
These 3 Zodiac signs will be Blessed by Shani there will be progress in money Employment and Business
X

Zodiac Signs: ఈ 3 రాశులవారికి శని దయ ఉంటుంది.. ధనప్రాప్తి, వ్యాపార పురోగతి..!

Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాలు, రాశుల ప్రభావం వల్ల మానవులు మంచి చెడులని అనుభవిస్తారు. అయితే జాతకంలో శనిగ్రహం చాలా ముఖ్యమైంది. కర్మలని బట్టి శని ఫలాలని అందిస్తాడు. మంచి పనులు చేసే వారికి సంపద అందిస్తాడు. చెడు పనులు చేసే వారిని ఇబ్బందులకి గురిచేస్తాడు. ప్రస్తుతం శని కుంభరాశిలో తిరోగమనంలో కదులుతున్నాడు. ఇది మొత్తం 12 రాశులని ప్రభావితం చేస్తుంది. నవంబర్ 4, 2023 వరకు శని తిరోగమనం కొనసాగుతుంది. దీనివల్ల 3 రాశులవారు శుభాలు పొందుతారు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

వృషభ రాశి

శని తిరోగమనం వృషభ రాశి వారికి ప్రయోజనాలను అందిస్తుంది. ఈ రాశికి అధిపతి శుక్రుడు అతను శనికి స్నేహితుడు కాబట్టి వృషభ రాశి ప్రజల వృత్తిలో గొప్ప పురోగతి లభిస్తుంది. ఉద్యోగంలో ఆకర్షణీయమైన ఆఫర్లను పొందవచ్చు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం విస్తరిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. పనులన్నీ పూర్తవుతాయి.

తుల రాశి

తులారాశికి అధిపతి శుక్రుడు. శని తిరోగమనం తులారాశి వారికి కూడా ప్రయోజనాలను అందిస్తుంది. ఈ రాశివారు ఒకదాని తర్వాత ఒకటిగా అనేక ఆహ్లాదకరమైన వార్తలను వింటారు. కెరీర్‌లో దినదినాభివృద్ధి చెందుతారు. జీవితంలో సుఖాలు పెరుగుతాయి. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఊహించని లాభాలను ఆర్జిస్తారు.

మకరరాశి

మకర రాశికి శని అధిపతి. దీనివల్ల చాలా లాభం చేకూరుతుంది. ఈ రాశివారికి అన్నిటిలో విజయం వరిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. పదవి-ప్రతిష్ఠ, గౌరవం పెరుగుతాయి. కెరీర్‌లో ఉన్నత స్థితికి వెళుతారు. కోరుకున్న ప్రమోషన్ మంచి జీతం పొందుతారు.

Jyothi

Jyothi

Next Story