Astro News: ఈ 2 గ్రహాల కలయిక 15 ఏళ్ల తర్వాత జరుగుతుంది.. ఈ రాశుల వారికి అదృష్టం..!

Astro News: జ్యోతిష్యం ప్రకారం కొన్ని రకాల కలయిక అరుదుగా జరుగుతుంది. మరికొన్ని గ్రహాల కలయిక చాలా సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.

Shekhar G
Updated on: 2 Feb 2024 7:00 AM IST
The Combination Of These 2 Planets Will Happen After 15 Years People Of These Signs Will Be Lucky
X

Astro News: ఈ 2 గ్రహాల కలయిక 15 ఏళ్ల తర్వాత జరుగుతుంది.. ఈ రాశుల వారికి అదృష్టం..!

Astro News: జ్యోతిష్యం ప్రకారం కొన్ని రకాల కలయిక అరుదుగా జరుగుతుంది. మరికొన్ని గ్రహాల కలయిక చాలా సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. తాజాగా మార్చి 7న రాహువు, బుధుడు మీనరాశిలోకి ప్రవేశించి సంయోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ రెండు గ్రహాల కలయిక 15 సంవత్సరాల తర్వాత జరుగుతోంది. దీని ప్రభావం మొత్తం 12 రాశుల వారిపై పడుతుంది. ఈ కలయిక 3 రాశుల వారికి చాలా శుభప్రదం కానుంది. వారికి అదృష్టం కలిసివస్తుంది. ఆ రాశుల గురించి తెలుసుకుందాం.

మిధునరాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు, బుధుడు కలిసి ఉండటం వల్ల మిథున రాశి వారికి శుభ ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఉద్యోగం, వ్యాపారంలో పెద్ద ప్రయోజనాలు పొందుతారు. కెరీర్‌లో విజయం సాధిస్తారు. విదేశాలలో చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నవారికి అనుకూల సమయం. వ్యాపారం, కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించవచ్చు. తండ్రితో అనుబంధం బలపడుతుంది. పూర్వీకుల ఆస్తిలో వాటా పొందుతారు. ధనలాభానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి.

కర్కాటక రాశి

రాహువు, బుధుడు కలిసి ఉండటం వల్ల కర్కాటక రాశి వారి అదృష్టం ప్రకాశిస్తుంది. పెండింగ్‌ పనులు క్లియర్‌ అవుతాయి. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఏదైనా కొత్త వ్యాపారం లేదా పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే విజయవంతమవుతుంది. డబ్బు రాకతో కుటుంబంలో, సమాజంలో గౌరవం పెరుగుతుంది.

కుంభ రాశి

జ్యోతిషశాస్త్రం ప్రకారం కుంభ రాశి వారికి ఈ కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు పెద్ద మొత్తంలో డబ్బు పొందుతారు. వ్యాపారంలో అధిక లాభం ఉంటుంది. ఉద్యోగస్తులు తమ యజమాని హృదయంలో స్థానం సంపాదించడంలో విజయం సాధిస్తారు. దాని నుంచి ప్రయోజనం పొందుతారు. బ్యాంకింగ్, మార్కెటింగ్, మీడియా రంగాల వ్యక్తులు ఈ సమయం కలిసివస్తుంది.

Shekhar G

Shekhar G

Next Story