Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (26/10/2024)

Telugu Horoscope Today, October 26, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Updated on: 26 Oct 2024 6:01 AM IST
Telugu Horoscope Today
X

Telugu Horoscope Today

Telugu Horoscope Today, October 26, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు, కృష్ణ పక్షం.

తిధి: దశమి రేపు తె.వా.గం. 5.23 ని.ల వరకు ఆ తర్వాత ఏకాదశి.

నక్షత్రం: ఆశ్లేష ఉదయం గం.9.46 ని.ల వరకు ఆ తర్వాత మఖ.

అమృతఘడియలు: ఉదయం గం.8.31 ని.ల నంచి గం.9.46 ని.ల వరకు.

వర్జ్యం: రాత్రి గం.11.05 ని.ల నుంచి గం.12.51 ని.ల వరకు.

దుర్ముహూర్తం: ఉదయం గం.6.12 ని.ల నుంచి గం.7.45 ని.ల వరకు.

రాహుకాలం: ఉదయం గం.9.06 ని.ల నుంచి గం.10.33 ని.ల వరకు.

సూర్యోదయం: తె.వా. గం. 6.12 ని.లకు.

సూర్యాస్తమయం: సా. గం. 5.47 ని.లకు.

మేషం

పరిస్థితి అనుకూలంగా లేదు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. నమ్మినవారే మోసం చేస్తారు. ముఖ్యంగా స్థిరాస్తి విక్రయాల్లో జాగ్రత్తగా ఉండండి. సంతాన వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండవు. వృథా ఖర్చు పెరుగుతుంది.

వృషభం

ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక లావాదేవీలు బావుంటాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి రంగంలోని వారు జాగ్రత్తగా ఉండాలి. సోదరుల సూచన పాటించండి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

మిథునం

కొన్ని ఆటంకాలు ఎదురైనా పనులను పూర్తి చేస్తారు. తోబుట్టువుల సహకారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగానే ఉంటాయి. విరోధాలకు దూరంగా ఉండండి. జీవితభాగస్వామి సూచనను పాటించండి,.

కర్కాటకం

వ్యవహారాలు ఆశించిన రీతిలోనే సాగుతాయి. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. బ్యాంకు వ్యవహారాలు తృప్తినివ్వవు. విందుకు హాజరవుతారు. నోటి దురుసు వల్ల విరోధం తలెత్తే వీలుంది. కుటుంబంపై శ్రద్ధ పెట్టండి.

సింహం

పని పూర్తికి బాగా కష్టపడాల్సి వుంటంది. డబ్బులకు సంబంధించిన వ్యవహారాల్లో చాలా జాగ్రత్త అవసరం. దూరప్రయాణం సూచిస్తోంది. కుటుంబ సభ్యులు అండగా నిలుస్తారు. కీలక వేళలో అదృష్టం తోడవుతుంది.

కన్య

పనులు సవ్యంగానే సాగుతాయి. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆత్మీయులను కలుస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. బంధువుల తీరు ఆవేదనను కలిగిస్తుంది.

తుల

ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు విశేష లాభాన్నిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పోటీల్లో గెలుస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విందుకు హాజరవుతారు.

వృశ్చికం

కొద్దిపాటి శ్రమతో కార్యాలను విజయవంత చేసుకుంటారు. ఉద్యోగులకు యోగదాయకంగా ఉంటుంది. పోటీని అధిగమించి అవకాశాలను దక్కించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ధనుస్సు

కార్యనష్టం గోచరిస్తోంది. మిత్రులతోటే అపార్థాలు వచ్చే వీలుంది. వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. వారసత్వ ఆస్తి వ్యవహారాలు ఫలించవు. జీర్ణ సంబంధ సమస్యలుంటాయి.

మకరం

పనులు సవ్యంగా సాగుతాయి. బంధువులను కలుస్తారు. ప్రయాణం లాభదాయంగా ఉంటుంది. కీర్తి పెరుగుతుంది. కోపాన్ని తగ్గించుకోవాలి. తొందరపాటు వల్ల తగాదాలు వస్తాయి. మోకాలి సమస్య ఉంటుంది.

కుంభం

చేపట్టిన ప్రతి పనీ లాభసాటిగా ముగుస్తుంది. డబ్బుకి ఇబ్బంది ఉండదు. వివాదాలు పరిష్కారం అవుతాయి. పోటీల్లో మీదే పైచేయిగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. మనశ్శాంతిని పొందుతారు.

మీనం

ఆటంకాలను తేలిగ్గా దాటేస్తారు. ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక చికాకులు తొలగుతాయి. ప్రత్యర్థులను జయిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story