Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (October 21, 2024)

Telugu Horoscope Today, October 21, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Updated on: 21 Oct 2024 6:26 AM IST
Telugu Horoscope Today
X

Telugu Horoscope Today

.Telugu Horoscope Today, October 21, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి సోమవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు, కృష్ణ పక్షం.

తిధి: పంచమి అర్ధరాత్రి దాటాక గం.2.29 ని.ల వరకు ఆ తర్వాత షష్ఠి.

నక్షత్రం: రోహిణి ఉదయం గం.6.50 ని.ల వరకు ఆ తర్వాత మృగశిర.

అమృతఘడియలు: రాత్రి గం.9.25 ని.ల నుంచి గం.10.57 ని.ల వరకు.

వర్జ్యం: మధ్యాహ్నం గం.12.12 ని.ల నుంచి గం.1.44 ని.ల వరకు.

దుర్ముహూర్తం: మధ్యాహ్నం గం.12.24 ని.ల నుంచి గం.1.11 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.2.44 ని.ల నుంచి గం.3.30 ని.ల వరకు.

రాహుకాలం: ఉదయం గం.7.38 ని.ల నుంచి గం. 9.06 ని.ల వరకు.

సూర్యోదయం: తె.వా. గం. 6.11 ని.లకు.

సూర్యాస్తమయం: సా. గం. 5.50 ని.లకు.

మేషం

పనులన్నీ అతి తేలిగ్గా సఫలమవుతాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. గౌరవం పెరుగుతుంది. మనో స్థితి ఉల్లాసంగా ఉంటుంది. సమాజంలోని అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి.

వృషభం

పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. బంధు, మిత్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన పెడుతుంది. వైద్యం కోసం ఖర్చు చేయాల్సివస్తుంది. అనవసర జోక్యాల వల్ల చిక్కులొస్తాయి. దూర ప్రదేశానికి వెళ్లే సూచన గోచరిస్తోంది.

మిథునం

పెద్దవారి ఆశీస్సులను పొందుతారు. ఆకాంక్షలు తీరతాయి. వస్తువులను సేకరిస్తారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చిస్తారు. విందుకు హాజరవుతారు. ఆరోగ్యం బావుంటుంది.

కర్కాటకం

ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అభీష్టం నెరవేరుతుంది. గృహశాంతి ఉంటుంది.

సింహం

ఆటంకాలను అధిగమిస్తారు. ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తారు. నోటిదురుసుతనం వల్ల బంధువులతో విరోధం వచ్చే వీలుంది. ఉద్యోగులు విధినిర్వహణలో అప్రమత్తంగా లేకుంటే బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది.

కన్య

కార్యసాధనలో మీ బలహీనతలే అవరోధంగా మారతాయి. అనుకున్న రీతిలో పనులు సాగవు. గొడవలకు ఆస్కారం ఉంది. ఉద్రేకాన్ని తగ్గించుకోవాలి. ప్రత్యర్థుల కదలికలను శ్రద్ధగా గమనించాలి. ఆరోగ్యం జాగ్రత్త.

తుల

తృప్తికరంగా ఉంటుంది. కార్యాలు సజావుగా సాగుతాయి. ధన సంబంధ వ్యవహారాలు తృప్తిగా ఉంటాయి. నూతన విషయాన్ని గ్రహిస్తారు. ప్రయాణం లాభిస్తుంది. సంతానం గురించిన సమాచారం ఆనందాన్నిస్తుంది.

వృశ్చికం

బలహీనతలను దాటేస్తారు. ఆర్థిక లబ్దిని పొందుతారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. మిత్రులు సహకరిస్తారు. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. ఆరోగ్యం బావుంటుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది.

ధనుస్సు

ఆటంకాలను దాటితేనే పనులు సఫలం అవుతాయి. బద్ధకం వల్ల చిక్కుల్లో పడే సూచన ఉంది. అభీష్టం నెరవేరే అవకాశం కనిపించడం లేదు. మీ సామర్థ్యానికి తగ్గ ఫలితం దక్కదు. దురాలోచనలను అదుపులో ఉంచాలి.

మకరం

బుద్ధి నిలకడగా ఉండదు. తొందరపాటు నిర్ణయాల వల్ల పనులు చెడిపోతాయి. ఆర్థికంగా ఒడుదుడుకులు ఉంటాయి. వృథా ఖర్చులు చింతను కలిగిస్తాయి. ఆలోచన విధానం మార్చుకోవాలి. తల్లి ఆరోగ్యం జాగ్రత్త.

కుంభం

పనులన్నీ సవ్యంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీలక వ్యవహారంలో మిత్రులు అండగా నిలుస్తారు. నాయకత్వ లక్షణానికి తగ్గ ప్రతిఫలాన్ని అందుకుంటారు.

మీనం

మనసులోని భావాలను చెప్పలేక చిక్కుల్లో పడతారు. డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది. వేళకు భోజనం ఉండదు. ఇతరుల వల్ల ఇబ్బందులు వస్తాయి. అనవసర జోక్యాలు వద్దు. ఆరోగ్యం గురించిన శ్రద్ధ అవసరం.



P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story