Telugu Horoscope Today: నేటి మీ రాశిఫలాలు ఇలా (5/11/2024)

Telugu Horoscope Today, November 5, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Updated on: 5 Nov 2024 11:29 AM IST
Telugu Horoscope Today: నేటి మీ రాశిఫలాలు ఇలా (5/11/2024)
X

Telugu Horoscope Today, November 5, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షినాయనం, శరదృతువు, శుక్ల పక్షం

తిధి: చవితి అర్ధరాత్రి గం.12.16 ని.ల వరకు ఆ తర్వాత పంచమి

నక్షత్రం: జ్యేష్ట ఉదయం గం.9.45 ని.ల వరకు ఆ తర్వాత మూల

అమృతఘడియలు: రేపు తె.వా. గం.4.16 ని.ల నుంచి గం.5.57 ని.ల వరకు

వర్జ్యం: సాయంత్రం గం.6.10 ని.ల నుంచి గం.7.51 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.8.34 ని.ల నుంచి గం. 9.19 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.10.44 ని.ల నుంచి గం. 11.35 ని.ల వరకు

రాహుకాలం: మధ్యాహ్నం గం.2.51 ని.ల నుంచి గం.4.17 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.16 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 5.43 ని.లకు

మేషం

పనుల పూర్తికి విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు ఆశించినట్లుగా ఉండవు. సంతానం తీరు చికాకు పెడుతుంది. ఉద్యోగులు చివాట్లు తినే సూచన ఉంది. తీర్థయాత్రలపై ఆసక్తి పెరుగుతుంది.

వృషభం

నిర్ణీత సమయానికి పనులు కావు. శత్రువులు మీ అవకాశాలను చెడగొట్టే వీలుంది. అనవసరంగా పోటీల్లో పాల్గొనకండి. బలహీనతలను అదుపు చేసుకోండి. వారసత్వ ఆస్తి వ్యవహారాల్లో జాప్యం ఏర్పడుతుంది.

మిథునం

వ్యాపార భాగస్వామ్య వ్యవహారాలు లాభాన్నిస్తాయి. కొత్త అగ్రిమెంట్లకు అనుకూలం. బంధాలు పెరుగుతాయి. ప్రయాణం వినోదంగా సాగుతుంది. సంతాన సంబంధ ఆనందాన్ని ఆస్వాదిస్తారు. విందుకు హాజరవుతారు.

కర్కాటకం

ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. బ్యాంకు లావాదేవీలు తృప్తినిస్తాయి. బంధువులను కలుస్తారు. వివాదాలు పరిష్కారమవుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. మనశ్శాంతిని పొందుతారు.

సింహం

ప్రతి పనికీ ఆటంకం ఎదురవుతుంది. చెడు ఆలోచనలు వస్తాయి. మనసును అదుపులో ఉంచుకోవాలి. మీ తెలివితేటలకు అక్కరకు రావు. సంతాన వ్యవహారాలపై దృష్టి పెడతారు. పెద్దల ఆశీస్సులను తీసుకుంటారు.

కన్య

పనులు ఆశించిన రీతిలో సాగవు. ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. బుద్ధి నిలకడగా ఉండదు. బంధువులతో విరోధం, అవమానం గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల తీరు కోపాన్ని తెప్పిస్తుంది.

తుల

వ్యవహారాలన్నీ విజయవంతంగా సాగుతాయి. సోదరుల సహకారంతో అభీష్టం నెరవేరుతుంది. సహచరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణం లాభిస్తుంది. ఆదాయం తృప్తినిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది.

వృశ్చికం

కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెడతారు. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త. అకారణ విరోధాలు గోచరిస్తున్నాయి. నోటిదురుసును తగ్గించుకోవాలి. వేళకు భోజనముండదు. రెండో పెళ్లి ప్రయత్నాల్లో జాప్యం ఏర్పడుతుంది.

ధనుస్సు

ప్రయత్నాలు ఫలిస్తాయి. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. విందులకు హాజరవుతారు. గౌరవం వృద్ధి చెందుతుంది.మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. ఆరోగ్యం బావుంటుంది.

మకరం

వ్యవహారాల్లో చికాకులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆందోళనను కలిగిస్తాయి. మనసు స్థిరంగా ఉండదు. ఇంటికి దూరంగా ఉంటారు. తొందరపాటు వల్ల నష్ట పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి గోచరిస్తోంది.

కుంభం

ఆకాంక్ష నెరవేరుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశించినట్లుగానే ఉంటాయి. ఆత్మీయులను కలుస్తారు. పెద్దవారి ఆశీస్సులను పొందుతారు. కొత్త వస్తువులను కొంటారు. విందుకు హాజరవుతారు. ఆరోగ్యం బావుంటుంది.

మీనం

మనసు ప్రశాంతంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి మేలిమి అవకాశాలను పొందుతారు. బంధువులతో విందుకు వెళతారు. ప్రత్యర్థులపై గెలుస్తారు.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story