Telugu Horoscope Today: నేటి మీ రాశిఫలాలు ఇలా (2/11/2024)

Telugu Horoscope Today, November 2, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Updated on: 2 Nov 2024 6:00 AM IST
Telugu Horoscope Today
X

Telugu Horoscope Today

Telugu Horoscope Today, November 2, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్ల పక్షం

తిధి: పాడ్యమి రాత్రి గం.8.21 ని.ల వరకు తర్వాత విదియ

నక్షత్రం: విశాఖ రేపు తె.వా.గం.5.58 ని.ల వరకు ఆ తర్వాత అనూరాధ

అమృతఘడియలు: రాత్రి గం.8.16 ని.ల నుంచి గం.10.02 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.9.41 ని.ల నుంచి గం.11.27 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.6.15 ని.ల నుంచి గం.7.47 ని.ల వరకు

రాహుకాలం: ఉదయం గం.9.07 ని.ల నుంచి గం.10.33 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.15 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 5.44 ని.లకు

మేషం

విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది. ప్రయత్నాలు అంతగా సఫలం కావు. వేళకు భోజముండదు. తగాదాలకు వెళ్లకండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. దురాలోచనలు చెడు మార్గం పట్టించే వీలుంది. నిగ్రహంగా ఉండాలి.

వృషభం

చేపట్టిన పనులు సవ్యంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. అంతర్గత ఆనందం రెట్టింపవుతుంది. బంధాలు బలపడతాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. ప్రయాణం లాభిస్తుంది.

మిథునం

వ్యవహారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ధర్మపథంలో సాగుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మానసిక చికాకులు తొలగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కర్కాటకం

బద్ధకాన్ని వదిలిపెట్టండి. పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి వస్తుంది. ఆటంకూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మీలోని కార్యనిర్వాహక సామర్థ్యం కీలక వేళల్లో పని చేయదు.

సింహం

ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన సమయమిది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. కీలక వ్యవహారాల్లో ఆత్మీయుల సూచనలను తీసుకోండి. ఆస్తి వ్యవహారాలు నష్టదాయకంగా ఉంటాయి. ఒత్తిడి ఎక్కువవుతుంది.

కన్య :

వ్యవహారాలు ఆశించిన రీతిలోనే సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ప్రయాణం లాభిస్తుంది. కీలక వర్తమానం ఆనందపరుస్తుంది. ఆత్మధైర్యం వృద్ధి చెందుతుంది.

తుల

మనసులోని మాటను స్పష్టంగా చెప్పని కారణంగా చిక్కులొస్తాయి. అకారణ విరోధాలకూ ఆస్కారముంది. ఎవరికీ హామీ ఇవ్వకండి. కుటుంబంలో చిక్కులుంటాయి. వేళకు భోజనముండదు. వృథా ఖర్చులుంటాయి.

వృశ్చికం

అనుకూల ఫలితాలుంటాయి. ధనలాభం ఉంది. అదృష్టం తోడుగా ఉంటుంది. వాహన యోగముంది. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. విందుకు హాజరవుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కీర్తి పెరుగుతుంది.

ధనుస్సు

వ్యవహారాలు సజావుగా సాగవు. ఆర్థిక లావాదేవీలు చికాకు పరుస్తాయి. మానసిక దిగులు ఆవరిస్తుంది. నిరాశను వీడి ముందుకు సాగాలి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

మకరం

వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆకాంక్ష తీరుతుంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు. సంతానం వృద్ధిలోకి వస్తుంది. కొత్త వస్తువులను సేకరిస్తారు. విందుకు హాజరవుతారు.

కుంభం

ప్రయత్నించిన కార్యాలన్నీ సఫలం అవుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. వృత్తిపరవ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. గౌరవం పెరుగుతుంది. మనశ్శాంతి లభిస్తుంది.

మీనం

పనులు ఆశించిన రీతిలో సాగవు. వృథా ఖర్చులుంటాయి. కలహాలకు ఆస్కారముంది. పెద్దల ఆశీస్సులను పొందుతారు. కోర్టు లావాదేవీల్లో జాగ్రత్త. పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story