Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (29/11/2024)

Telugu Horoscope Today, November 29, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Updated on: 29 Nov 2024 3:01 AM IST
Telugu Horoscope Today, 29 November 2024
X

Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (29/11/2024)

Telugu Horoscope Today, November 29, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.


మేషం

అభీష్టం నెరవేరుతుంది. భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. అనుబంధాలు బలపడతాయి. శారీరక సౌఖ్యాన్ని పొందుతారు. ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. బంధువులతో విందుకు హాజరవుతారు.

వృషభం

అన్ని వ్యవహారాల్లోనూ అనుకూల ఫలితాలు లభిస్తాయి. అపార్థాలు తొలగిపోతాయి. అదృష్టం తోడవుతుంది. కోర్టు లావాదేవీలు అనుకూలిస్తాయి. మిత్రులు సహకరిస్తారు. వేదన తొలగుతుంది. ఆరోగ్యం బావుంటుంది.

మిథునం

కీలక వ్యవహారాల్లో సొంత తెలివితేటలను ప్రయోగించకండి. పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. ఆత్మీయుల సూచనలను పాటించండి. సంతానం తీరు చికాకు పెడుతుంది. చెడు ఆలోచనలను అదుపు చేసుకోండి.

కర్కాటకం

బుద్ధి నిలకడగా ఉండదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి అమ్మే ప్రయత్నం అనుకూలించదు. ప్రయత్నాలు ఫలించక పోవడం వేదనను కలిగిస్తుంది.

సింహం

ఆత్మ విశ్వాసంతో ఉంటారు. చేపట్టిన పనులు ఆశించిన రీతిలోనే సాగుతాయి. ధనలాభం ఉంది. ఆత్మీయుల కలయిక కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది. దాయాదులతో సఖ్యత ఏర్పడుతుంది. విందుకు హాజరవుతారు.

కన్య

అనుకున్నవి జరగవు. కార్యనిర్వహణలో ఇబ్బందులు వస్తాయి. ధననష్టం ఉంది. అకారణ విరోధం గోచరిస్తోంది. కుటుంబంలో చికాకులు తలెత్తే వీలుంది. వేళకు భోజనముండదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

తుల

అన్ని ప్రయత్నాలూ అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కీలక సమయంలో అదృష్టం తోడవుతుంది. వాహనయోగం ఉంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది.

వృశ్చికం

వృథా ఖర్చులను అదుపు చేయాలి. పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు. మిత్రులే విరోధులయ్యే సూచన ఉంది. అనవసర ప్రయాణాలు వద్దు. కోర్టు కేసుల్లో జాగ్రత్తగా ఉండండి.

ధనుస్సు

అనుకున్న రీతిలోనే పనులు సాగుతాయి. ఆర్థిక లబ్ది ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. అవసరమైన సౌకర్యాలు సమకూరతాయి. ఆరోగ్యం మెరుగ్గాఉంటుంది.

మకరం

అన్నింటా అనుకూలంగా ఉంటుంది. శత్రువులపైన, పోటీల్లోలనూ విజయం సాధిస్తారు. చక్కటి అవకాశాలు అందివస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. గౌరవం పెరుగుతుంది. విందుకు హాజరవుతారు.

కుంభం

పనులు అనుకున్నంత వేగంగా సాగవు. సంతాన వ్యవహారాలు చికాకు పెడతాయి. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. దూర ప్రయాణం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. అశాంతి ఏర్పడుతుంది. పెద్దలను కలుస్తారు.

మీనం

అనుకున్నట్లుగా పనులు సాగవు. ఇతరులపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. కోపాన్ని అదుపు చేసుకోవాలి. తగాదాలకు దూరంగా ఉండాలి. శత్రుపీడ పెరుగుతుంది. ఉద్యోగులు విధినిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story