Telugu Horoscope Today: ఈ రాశివారి శ్రమకు తగిన ఫలితం శూన్యం (5 October 2024)

Telugu Horoscope Today: ఈరోజు తిథి పంచాంగం (Panchangam) వివరాలు. 12 రాశుల వారి శనివారం నాటి రాశిఫలాలు (Horoscope) ఎలా ఉన్నాయంటే?

P Vijay Kumar Astrologer
Updated on: 5 Oct 2024 6:00 AM IST
Telugu Horoscope Today
X

Telugu Horoscope Today

Telugu Horoscope Today: ఈరోజు తిథి పంచాంగం వివరాలు తెలుసుకోండి. 12 రాశుల వారి శనివారం నాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్ల పక్షం

తిధి: తదియ పూర్తి

నక్షత్రం: స్వాతి రాత్రి గం.9.33 ని.ల వరకు ఆ తర్వాత విశాఖ

అమృతఘడియలు: ఉదయం గం.11.41 ని.ల నుంచి మధ్యాహ్నం గం.1.29 ని.ల వరకు

వర్జ్యం: అర్ధరాత్రి దాటాక గం.3.46 ని.ల నుంచి గం. 5.32 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.6.16 ని.ల నుంచి గం. 7.50 ని.ల వరకు

రాహుకాలం: ఉదయం గం.9.13 ని.ల నుంచి గం. 10.41 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.16 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 6.02 ని.లకు

మేషం

చేపట్టిన ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. వ్యాపార భాగస్వామ్యాలు లాభిస్తాయి. ఆకాంక్ష నెరవేరుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

వృషభం

కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వివాదాలు పరిష్కారమైపోతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ అలవాటవుతుంది. మనోధైర్యం పెరుగుతుంది. కీలక సమయంలో మిత్రులు తోడుంటారు.

మిథునం

అభీష్టం నెరవేర్చుకునేందుకు బాగా శ్రమించాల్సి వుంటుంది. వృద్ధిని ఆటంక పరిచేవారు పెరుగుతారు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. మిత్రుల సూచన పాటించండి. విలువైన వస్తువులను భద్ర పరచుకోండి.

కర్కాటకం

పనులు అనుకున్నట్లుగా సాగవు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. ప్రయత్నానికి అడ్డంకి వస్తుంది. ఆస్తి అమ్మే ప్రయత్నాలు ఫలించవు. బుద్ధి నిలకడగా ఉండదు. బంధువులతో గొడవలొస్తాయి. విచారం కలుగుతుంది.

సింహం

ఆత్మవిశ్వాసంతో చేపట్టే ప్రతి కార్యమూ ఫలిస్తుంది. నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు. స్వయంకృషికి ఫలితం లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి.ఆరోగ్యం బావుంటుంది.

కన్య

అకారణ విరోధాలకు ఆస్కారం ఉంది. మీ తప్పు లేకున్నా, ఇతరుల కారణంగా ఇబ్బంది పడతారు. ప్రతి సందర్భంలోనూ జాగ్రత్తగా ఉండండి. విలువైన వస్తువు జాగ్రత్త. కుటుంబ సభ్యుల తీరు చికాకు పెడుతుంది.

తుల

ప్రయత్నాలన్నీ అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో లబ్దిని పొందుతారు. మీ తెలివితేటలకు చక్కటి గుర్తింపు వస్తుంది. మనో స్థైర్యం పెరుగుతుంది. విందులకు హాజరవుతారు. మనశ్శాంతి ఉంటుంది.

వృశ్చికం

శ్రమకు తగిన ఫలితం దక్కక పోవడం వేదనను కలిగిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ప్రయాణాలను వీలైనమేర వాయిదా వేయండి. బంధువులతో విరోధం గోచరిస్తోంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

ధనుస్సు

ఆశించిన పని జరుగుతుంది. ఇష్టమైన వారితో ఆనందంగా గడుపుతారు. మిత్రుల సహకారం లభిస్తుంది. సంతాన సంబంధ సౌఖ్యాన్ని పొందుతారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక వ్యవహారం లాభిస్తుంది.

మకరం

పనులన్నీ చకచకా సాగుతాయి. కొత్త అవకాశాలు అందివస్తాయి. ఆకాంక్ష నెరవేరుతుంది. మిత్రులతో విందుకు హాజరవుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉన్నతస్థాయి వ్యక్తుల పరిచయం లాభిస్తుంది.

కుంభం

పనులు అనుకున్న స్థాయిలో సాగవు. పెద్దవారిని కలిసి ఆశీస్సులు తీసుకుంటారు. వృథా ఖర్చుంటుంది. న్యాయపర వ్యవహారాల్లో చిక్కులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది.

మీనం

నిర్దేశిత సమయానికి సౌకర్యాలు సమకూరవు. కోపం పెరుగుతుంది. ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. స్వల్ప తగాదాలకు ఆస్కారముంది. ఇతరులపై దురభిప్రాయం ఏర్పడుతుంది. వేళకు భోజనం ఉండదు.



P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story