Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (9/11/2024)

Telugu Horoscope Today, November 9, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Updated on: 9 Nov 2024 10:25 AM IST
Telugu Horoscope Today, November 9 2024
X

Telugu Horoscope Today November 9, 2024

Telugu Horoscope Today, November 9, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్ల పక్షం

తిధి: అష్టమి రాత్రి గం.10.45 ని.ల వరకు ఆ తర్వాత నవమి

నక్షత్రం: శ్రవణము ఉదయం గం.11.47 ని.ల వరకు ఆ తర్వాత ధనిష్ట

అమృతఘడియలు: అర్ధరాత్రి గం.12.56 ని.ల నుంచి గం.12.29 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.3.39 ని.ల నుంచి గం.5.12 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.6.18 ని.ల నుంచి గం. 7.49 ని.ల వరకు

రాహుకాలం: ఉదయం గం.9.09 ని.ల నుంచి గం. 10.34 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.18 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం.5.42 ని.లకు

మేషం

ప్రయత్నించిన ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది. అధికారవృద్ధి గోచరిస్తోంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఇష్ట కార్య సిద్ధి ఉంది.

వృషభం

వ్యవహారాలు ఆశించినరీతిలో సాగవు. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. అనవసర జోక్యాల వల్ల గొడవలు వస్తాయి. సంతానం తీరు చికాకు పెడుతుంది. దూర ప్రయాణం సూచిస్తోంది. అలసట పెరుగుతుంది.

మిథునం

ప్రతి పనీ జాప్యమవుతుంటుంది. ప్రయత్నాలేవీ కలసిరావు. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వేళకు సరైన భోజనముండదు పోటీల్లో అనూహ్య పరాజయం ఎదురవుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

కర్కాటకం

వ్యవహారాలన్నీ తృప్తికరంగా సాగుతాయి. ఆర్థికవృద్ధి ఉంది. వ్యాపార విస్తరణ ఆలోచనలు చేస్తారు. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. బంధువులతో విందుకు వెళతారు.

సింహం

పనులు ఎలాంటి ఆటంకాలూ లేకుండా సాగుతాయి. ఆర్థిక వృద్ధి ఉంది. అపార్థాలు తొలగి, వివాదాలు పరిష్కారమవుతాయి. బంధువుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. విందుకు వెళతారు.

కన్య

వ్యవహారాలు ఆశించిన రీతిలో సాగవు. బద్ధకాన్ని వదలాలి. మీ విశ్లేషణలకు తగిన గుర్తింపు లభించదు. అనవసర గొడవలకు ఆస్కారముంది. ముఖ్యంగా ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి.

తుల

ప్రతి పనిలోనూ ఆచితూచి వ్యవహరించాలి. శత్రుపీడ అధికంగా ఉంటుంది. ఆస్తి క్రయవిక్రయాలను వాయిదా వేయడం మంచిది. నమ్మినవారి వల్లే మోసపోతారు. విద్య, సేవా రంగాల్లోని వారు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం

వ్యవహారాలన్నీ శుభఫలితాలన్నిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో విశేష లాభాన్ని చూస్తారు. నూతన వస్త్రాభరణాలు కొంటారు. సహచరులు, ఇరుగుపొరుగు వారితో బంధాలు బలపడతాయి. ఓ సమాచారం ఆనందపరుస్తుంది.

ధనుస్సు

పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. బ్యాంకు లావాదేవీలు ఆశించినట్లుగా ఉండవు. ఇతరుల వల్ల ఇబ్బంది పడతారు. రెండో పెళ్లి ప్రయత్నాలు ఫలించవు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. మాట తప్పడం వల్ల నిందలొస్తాయి.

మకరం

ఉల్లాసంగా గడుపుతారు. మీ వ్యక్తిత్వానికి చక్కటి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికవృద్ధి ఉంది. గౌరవం పెరుగుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. విందు, వినోదాలకు హాజరవుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

కుంభం

బద్ధకం వల్ల చిక్కులొస్తాయి. తలపెట్టిన కార్యానికి అడ్డంకులు వస్తాయి. ఇంటికి దూరంగా ఉంటారు. ప్రయాణాల్లో అలసిపోతారు. వేళకు సరైన బోజనముండదు. నడిచేటప్పుడు, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.

మీనం

వ్యవహారాలన్నీ సఫలమవుతాయి. ఇతరుల నుంచీ సహకారం లభిస్తుంది. ఇంటికి కావలసిన సౌకర్యాలను సమకూరుస్తారు. సంతాన సంబంధ సౌఖ్యాన్ని పొందుతారు. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story