Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (8/11/2024)

Telugu Horoscope Today, November 8, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Published on: 8 Nov 2024 1:02 AM IST
Horoscope Today
X

Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (8/11/2024)

Telugu Horoscope Today, November 8, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి శుక్రవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్ల పక్షం

తిధి: సప్తమి రాత్రి గం.11.56 ని.ల వరకు ఆ తర్వాత అష్టమి

నక్షత్రం: ఉత్తరాషాఢ మధ్యాహ్నం గం.12.03 ని.ల వరకు ఆ తర్వాత శ్రవణం

అమృతఘడియలు: అర్ధరాత్రి దాటాక గం.1.30 ని.ల నుంచి గం.3.05 ని.ల వరకు

వర్జ్యం: సాయంత్రం గం.4.00 ని.ల నుంచి గం.5.35 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.8.35 ని.ల నుంచి గం.9.20 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.23 ని.ల నుంచి గం.1.08 ని.ల వరకు

రాహుకాలం: గం.10.34 ని.ల నుంచి గం.12.00 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.18 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 5.43 ని.లకు

మేషం

వృత్తి ఉద్యోగాల్లోని వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అభీష్టం నెరవేరుతుంది. సామాజిక స్థితిగతులు మెరుగవుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. బంధువులతో విందులో పాల్గొంటారు. గృహశాంతి ఉంటుంది.

వృషభం

బాగా శ్రమిస్తేనే పనులు కొలిక్కి వస్తాయి. సంతానం ఆలోచనలను విభేదిస్తారు. స్వజనులతోనే విరోధం గోచరిస్తోంది. ఉన్నత విద్యాప్రయత్నాలు అనుకూలించవు. విచారం పెరిగి మనశ్శాంతి కరువవుతుంది.

మిథునం

అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. అడుగడుగునా ఆటంకాలు సృష్టించేవారు పెరుగుతారు. తగాదాలకు ఆస్కారముంది. ఉద్యోగులు, అధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది. ఆరోగ్యం జాగ్రత్త.

కర్కాటకం

ఆకాంక్ష నెరవేరుతుంది. పనులు ఆశించినట్లే పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు విశేష లాభాన్నిస్తాయి.

సింహం

అన్ని పనులూ విజయవంతంగా సాగుతాయి. ధనలాభముంది. కొత్త వస్తువులను కొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. రుణదాతల ఒత్తిళ్లు తగ్గుతాయి. మిత్రులు సహకరిస్తారు.

కన్య

కార్యసాధనలో అడ్డంకులను దాటాల్సివుంటుంది. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెంచాలి. సంతానం తీరు స్వల్ప చికాకును కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాలు బెడిసికొట్టే వీలుంది. విలువైన వస్తువులను జాగ్రత్తపరచాలి.

తుల

ప్రతి పనిలోనూ అడ్డంకులొస్తాయి. ధననష్టమూ గోచరిస్తుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మాట తప్పిన కారణంగా అవమానాన్నీ ఎదుర్కోవాల్సి వుంటుంది. వృథా ఖర్చులను తగ్గించాలి. తల్లి ఆరోగ్యం జాగ్రత్త.

వృశ్చికం

పనులన్నీ విజయవంతం అవుతాయి. ఆదాయం మెరుగవుతుంది. ఆత్మీయులను కలుస్తారు. తోబుట్టువుల తోడ్పాటుతో కుటుంబ సమస్యను పరిష్కరిస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ధనుస్సు

వ్యవహారాల్లో నష్టపోతారు. ప్రతి పనిలోనూ జాగ్రత్తగా ఉండండి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వల్ల చికాకులు వస్తాయి. కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. అకారణ విరోధాలకు ఆస్కారముంది. నోటిదురుసు మంచిది కాదు.

మకరం

తలచిన పనులన్నీ శుభప్రదంగా పూర్తవుతాయి. ధనలాభం ఉంది. చక్కటి సౌకర్యాలు సమకూర్చుకుంటారు. వాహనయోగం ఉంది. గౌరవం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. మిత్రులతో విందుకు వెళతారు.

కుంభం

పనులు అనుకున్నట్లుగా సాగవు. వృథా ఖర్చులు పెరగడం మనశ్శాంతిని దూరం చేస్తుంది. దూర ప్రయాణం గోచరిస్తోంది. ముఖ్య బంధువు ఆరోగ్యం కలవర పరుస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో అనవసర జోక్యం వద్దు.

మీనం

కోరికలు నెరవేరతాయి. ఆనందం వెల్లివిరుస్తుంది. కొత్త వస్తువులను కొంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బంధుమిత్రులు సహకరిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story