Telugu Horoscope Today: నేటి మీ రాశిఫలాలు ఇలా (7/11/2024)

Telugu Horoscope Today, November 7, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Published on: 7 Nov 2024 2:05 AM IST
Telugu Horoscope Today, November 7, 2024
X

Telugu Horoscope Today, November 7, 2024

Telugu Horoscope Today, November 7, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్ల పక్షం

తిధి: షష్ఠి అర్ధరాత్రి గం.12.34 ని. ల వరకు ఆ తర్వాత సప్తమి

నక్షత్రం: పూర్వాషాఢ ఉదయం గం.11.47 ని.ల వరకు ఆ తర్వాత ఉత్తరాషాఢ

అమృతఘడియలు: ఉదయం గం.6.50 ని.ల నుంచి గం.8.29 ని.ల వరకు మళ్లీ అర్ధరాత్రి దాటాక రేపు తె.వా. గం.5.35 ని.ల నుంచి గం.7.12 ని.ల వరకు

వర్జ్యం: సాయంత్రం గం.7.52 ని.ల నుంచి గం.9.29 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.10.06 ని.ల నుంచి గం.10.51 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.2.40 ని.ల నుంచి గం.3.25 ని.ల వరకు

రాహుకాలం: మధ్యాహ్నం గం.1.25 న.ల నుంచి గం. 2.51 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.17 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 5.42 ని.లకు

మేషం

కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఇబ్బందులు సృష్టించే వారి విషయంలో జాగ్రత్త. కలహాలకు ఆస్కారం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం మానండి. సంతానం ఆలోచనలను విభేదిస్తారు. ఖర్చు తగ్గించాలి.

వృషభం

ఉద్యోగులకు పరీక్షాకాలం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వ్యతిరేక ఫలితాలొస్తాయి. నిర్దేశిత సదుపాయాలు సమకూరవు. మనసుకు కష్టమనిపిస్తుంది. దురాలోచనలను దూరం చేయండి. వేళకు సరైన భోజనముండదు.

మిథునం

ఆకాంక్ష నెరవేరుతుంది. వస్తు, వాహన సౌఖ్యం లభిస్తుంది. ఇతరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రయాణం వినోదాన్నిస్తుంది. సంతాన సంబంధ సంతోషాన్ని ఆస్వాదిస్తారు. గౌరవం వృద్ధి చెందుతుంది.

కర్కాటకం

అన్ని పనులు ఆశించిన రీతిలోనే లాభసాటిగా ముగుస్తాయి. ధన సంబంధ లావాదేవీలు తృప్తినిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. నూతన విజ్ఞానాన్ని పొందేందుకు అనుకూలం. వివాదం పరిష్కారమౌతుంది.

సింహం

నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉండదు. నిరాశ ఏర్పడుతుంది. అనుమానం వీడి చిత్తశుద్ధితో కష్టిస్తే సత్ఫలితాలు వస్తాయి. విలువైన డాక్యుమెంట్లు జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వృథా ఖర్చులుంటాయి.

కన్య

పనులు ఆశించిన రీతిలో సాగవు. బుద్ధి నిలకడగా ఉండదు. బంధువిరోధ ఉంది.ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తత అవసరం. కుటుంబ వ్యవహారాలు చికాకు పరుస్తాయి. నీటి వనరుల వద్ద వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

తుల

ముఖ్యమైన సమాచారం సంతృప్తినిస్తుంది. మీలోని నాయకత్వ లక్షణాలకు గుర్తింపు లభిస్తుంది. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలుంటాయి. ఆర్థికంగా విశేష లాభముంటుంది. మిత్రులతో విందుకు వెళతారు.

వృశ్చికం

మాట పలుకుబడి తగ్గడాన్ని గమనిస్తారు. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. బ్యాంకు లావాదేవీలను వీలైతే వాయిదా వేయండి. ఆస్తి విక్రయ ప్రయత్నం వద్దు. నింద మనశ్శాంతిని దూరం చేస్తుంది.

ధనుస్సు

పనులు సవ్యంగా సాగుతాయి. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఆనందం వెల్లివిరుస్తుంది. విందులకు హాజరవుతారు. వాహన యోగం ఉంది. కీర్తి పెరుగుతుంది. అదృష్టం తొడుంటుంది.

మకరం

పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. బద్ధకాన్ని వదిలి కష్టపడాల్సివుంటుంది. ఆర్థిక లావాదేవీలు ఏమాత్రం సంతృప్తినివ్వవు. దూర ప్రయాణం గోచరిస్తోంది. బంధువుల ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది.

కుంభం

ఆర్థిక చిక్కుముళ్లు వీడిపోతాయి. చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆత్మీయులతో విందుకు వెళతారు. విజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. బంధాలు బలపడతాయి.

మీనం

ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. మంచి అవకాశాలు అందివస్తాయి. విధి నిర్వహణలో ప్రశంసలు లభిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబం వ్యవహారాలపై శ్రద్ధ పెడతారు. శత్రువులపై విజయం సాధిస్తారు.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story