Telugu Horoscope Today: నేటి మీ రాశిఫలాలు ఇలా (6/11/2024)

Telugu Horoscope Today, November 6, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Published on: 6 Nov 2024 2:33 AM IST
Telugu Horoscope Today, November 6, 2024
X

Telugu Horoscope Today, November 6, 2024

Telugu Horoscope Today, November 6, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షినాయనం, శరదృతువు, శుక్ల పక్షం

తిధి: పంచమి అర్ధరాత్రి గం.12.41 ని.ల వరకు ఆ తర్వాత షష్ఠి

నక్షత్రం: మూల ఉదయం గం.11.00 ని.ల వరకు ఆ తర్వాత పూర్వాషాఢ

వర్జ్యం: ఉదయం గం.9.19 ని.ల నుంచి గం.11.00 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.8.55 ని.ల నుంచి గం.10.34 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.11.37 ని.ల నంచి గం.12.23 ని.ల వరకు

రాహుకాలం: మధ్యాహ్నం గం.12.00 ని.ల నుంచి గం.1.25 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.17 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 5.43 ని.లకు

మేషం

ఉద్యోగులు అజాగ్రత్తగా ఉంటే బాధ్యతలకు దూరమయ్యే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణం గోచరిస్తోంది. పెద్దల ఆశీస్సులు అవసరమవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

వృషభం

ప్రతి పనికీ అడ్డంకులొస్తాయి. అపోహలు పెరుగుతాయి. ఇతరుల గురించిన చెడు ఆలోచనలు వస్తాయి. విధుల్లో అలసత్వం ఉద్యోగులకు ఇబ్బందిని తెస్తుంది. తగాదాలకు ఆస్కారం ఉంది. పైత్య సమస్య ఉంటుంది.

మిథునం

రోజంతా శుభప్రదంగా ఉంటుంది. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ చికాకులను సరిచేస్తారు. బంధాలు బలపడతాయి. ప్రయాణం లాభిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. బంధు మొత్రులతో విందులో పాల్గొంటారు.

కర్కాటకం

అన్ని పనులూ విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. శత్రుపీడ ఉండదు. ఆరోగ్యం బావుంటుంది. కోర్టు వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. స్వస్థానప్రాప్తి ఉంది.

సింహం

పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. బద్ధకం వల్ల మరిన్ని సమస్యలొస్తాయి. ఆలోచనలను నియంత్రించాలి. వృథా ఖర్చులను తగ్గించుకోవాలి. సంతానం తీరు కోపాన్ని కలిగిస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త పరచండి.

కన్య

పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమవుతుంది. భావసారూప్యమున్న వ్యక్తులను కలుస్తారు. ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మంచిది.

తుల

ఆకాంక్ష నెరవేరుతుంది. ధనాదాయం వృద్ధి చెందుతుంది. మానసిక సౌఖ్యం లభిస్తుంది. నూతన వస్త్రాభరణాలను కొంటారు. అందరి నుంచీ చక్కటి సహకారం అందుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

వృశ్చికం

బ్యాంకు లావాదేవీలు చికాకుపెడతాయి. అభిప్రాయాలను స్పష్టంగా చెప్పలేక సమస్యల్లో పడే వీలుంది. ఎవరికీ పూచీలివ్వకండి. కుటుంబం గురించి శ్రద్ధ పెట్టాలి. కంటి సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు. ఆరోగ్యం జాగ్రత్త.

ధనుస్సు

యోగదాయకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. గృహోపకరణాలకు ఖర్చు చేస్తారు. విందులకు హాజరవుతారు. వ్యక్తిత్వానికి చక్కటి ప్రశంసలు వస్తాయి. కీలక సమయంలో అదృష్టం వరిస్తుంది.

మకరం

పనులు అనుకున్నట్లు సాగవు. మనసు నిలకడగా ఉండదు. చెడు తలంపులను నియంత్రించుకోవాలి. మిత్రులతో విరోధం గోచరిస్తోంది. కోర్టు లావాదేవీల్లో జాగ్రత్త. నిద్రలేమి వేధిస్తుంది. అసూయను వదిలేయాలి.

కుంభం

ఆశించినట్లే పనులు పూర్తవడం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. సంతాన సంబంధ వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి.

మీనం

అన్ని పనులూ అనువుగానే పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఉద్యోగులు ప్రశంసలను పొందుతారు. అభీష్టం నెరవేరుతుంది.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story