Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (26/11/2024)

Telugu Horoscope Today, November 26, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Published on: 26 Nov 2024 1:32 AM IST
Telugu Horoscope Today, November 26, 2024
X

Telugu Horoscope Today, November 26, 2024

Telugu Horoscope Today, November 26, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, కృష్ణ పక్షం.

తిధి: ఏకాదశి అర్ధరాత్రి దాటాక తె.వా.గం.3.47 ని.ల వరకు ఆ తర్వాత ద్వాదశి.

నక్షత్రం: హస్త అర్ధరాత్రి దాటాక తె.వా. గం.4.35 ని.ల వరకు ఆ తర్వాత చిత్త.

అమృతఘడియలు: రాత్రి గం.9.47 ని.ల నుంచి గం.11.36 ని.ల వరకు.

వర్జ్యం: ఉదయం గం.10.55 ని.ల నుంచి మధ్యాహ్నం గం.12.43 ని.ల వరకు.

దుర్ముహూర్తం: ఉదయం గం.8.42 ని.ల నుంచి గం. 9.27 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.10.47 ని.ల నుంచి గం.11.38 ని.ల వరకు.

రాహుకాలం: మధ్యాహ్నం గం.2.52 ని.ల నుంచి గం.4.16 ని.ల వరకు.

సూర్యోదయం: తె.వా. గం. 6.27 ని.లకు.

సూర్యాస్తమయం: సా. గం. 5.40 ని.లకు.

మేషం

వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక పురోభివృద్ధి గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి శుభప్రదంగా ఉంటుంది. విందుకు హాజరవుతారు. ప్రత్యర్థుల ఎత్తును చిత్తు చేస్తారు. అపార్థం తొలగి పోతుంది.

వృషభం

కార్యసాధనలో ఆటంకాలను దాటాల్సి వుంటుంది. మీ సామర్థ్యం, మేధాశక్తికి తగిన గుర్తింపు ఉండదు. సంతాన సంబంధ వ్యవహారాలు చికాకు పెడతాయి. అభీష్టం నెరవేరక పోవడం దుఃఖాన్ని కలిగిస్తుంది. బద్ధకం వీడాలి.

మిథునం

నమ్మిన వారే మోసగిస్తారు. దుఃఖం కలుగుతుంది. అయిన వారితో విభేదాలు వస్తాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్త, వాహన సంబంధ సమస్య ఎదురవుతుంది. మనశ్శాంతి ఉండదు.

కర్కాటకం

చేపట్టిన కార్యాల్లో ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. ధైర్యసాహసాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. దాయాదుల సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సహచరుల తోడ్పాటు లభిస్తుంది.

సింహం

చెప్పుడు మాటలు వినకండి. చెడు ఆలోచనలను అదుపు చేసుకోండి. ఆర్థిక లావాదేవీల్లో నష్టం గోచరిస్తోంది. జాగ్రత్త. తగాదాలకు దూరంగా ఉండండి. వేళకు భోజనముండదు. కుటుంబం వ్యవహారాలపై శ్రద్ధ చూపండి.

కన్య

అభీష్టం నెరవేరుతుంది. చేస్తున్న ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. మీ తెలివితేటలకు తగిన ప్రశంసలు లభిస్తాయి. రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. గౌరవం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు.

తుల

అనవసర జోక్యం కారణంగా ఆపదలో చిక్కుకునే సూచన ఉంది. ప్రతి అడుగూ ఆచితూచి వేయాలి. కోర్టు వ్యవహారాల్ల్లో నిర్లక్ష్యం వల్ల పరిహారం చెల్లించాల్సి రావచ్చు. వృథా ఖర్చు పెరుగుతుంది. నిద్రలేమి వేధిస్తుంది.

వృశ్చికం

ప్రతి పనీ సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. రుణ సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. మిత్రులు తోడుంటారు. మనశ్శాంతి లభిస్తుంది.

ధనుస్సు

ప్రయత్నపూర్వకంగా చేసే పని సఫలం అవుతుంది. పెద్దల ఆదరాభిమానాలను పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. గృహశాంతి ఉంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.

మకరం

పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి వుంటుంది. ఆర్థికంగా స్వల్ప ఒడుదుడుకులు ఉంటాయి. సంతాన సంబంధ వ్యవహారాలు వేదనను కలిగిస్తాయి. ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ప్రయాణాలు వద్దు.

కుంభం

తగాదాలకు ఆస్కారముంది. వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బలహీనతలను అదుపు చేసుకోవాలి. పోటీల్లో పాల్గొనకండి. శత్రువుల కదలికలపై కన్నేసి ఉంచాలి. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

మీనం

లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ సమస్యను పరిష్కరిస్తారు. బంధువర్గంలో కీర్తి పెరుగుతుంది. విజ్ఞాన సముపార్జనకు అనువైన రోజు.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story