Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (23/11/2024)

Telugu Horoscope Today, November 23, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Updated on: 23 Nov 2024 6:00 AM IST
Telugu Horoscope Today, 23 November 2024
X

Telugu Horoscope Today, November 23, 2024

Telugu Horoscope Today, November 23, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి శనివారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, కృష్ణ పక్షం.

తిధి: అష్టమి సాయంత్రం గం.7.56 ని.ల వరకు ఆ తర్వాత నవమి.

నక్షత్రం: మఖ సాయంత్రం గం.7.27 ని.ల వరకు ఆ తర్వాత పుబ్బ.

అమృతఘడియలు: సాయంత్రం గం.4.49 ని.ల నుంచి గం.6.35 ని.ల వరకు.

వర్జ్యం: రేపు తె.వా. గం.4.24 ని.ల నుంచి గం.6.11 ని.ల వరకు.

దుర్ముహూర్తం: ఉదయం గం.6.26 ని.ల నుంచి గం.7.55 ని.ల వరకు.

రాహుకాలం: ఉదయం గం.9.14 ని.ల నుంచి గం.10.38 ని.ల వరకు.

సూర్యోదయం: తె.వా. గం. 6.26 ని.లకు.

సూర్యాస్తమయం: సా. గం. 5.40 ని.లకు.

మేషం

కార్యసాధనలో అనుకోని ఆటంకాలు చికాకు పరుస్తాయి. మనసు స్థిమితంగా ఉండదు. అనుమానాలు పెరుగుతాయి. ఆలోచనలను నియంత్రించుకోండి. వృథా ఖర్చులు తగ్గించాలి. విలువైన వస్తువులు జాగ్రత్త.

వృషభం

బుద్ధి నిలకడగా ఉండదు. అయినవారితోనే గొడవలు వస్తాయి. పనులు చెడిపోతాయి. ఆర్థిక లావాదేవీలు కూడా ఆశించిన రీతిలో సాగవు. కొన్ని రహస్యాలు తెలుస్తాయి. నమ్మిన వారి వల్ల మోసపోయే సూచన ఉంది.

మిథునం

పనులు నిలకడగా పూర్తవుతాయి. అన్ని వర్గాల నుంచీ సహకారం లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కీలక సమాచారం ఆనందాన్నిస్తుంది. అవసరంలో సోదరుల తోడ్పాటు లభిస్తుంది. ధైర్యం పెరుగుతుంది,

కర్కాటకం

మనసులోని మాటను స్పష్టంగా చెప్పలేక వ్యవహారాల్లో నష్టపోతారు. నిందలు భరించాల్సి వస్తుంది. అకారణ విరోధాలకు ఆస్కారముంది. కంటి సంబంధ సమస్యలుంటాయి. మనశ్శాంతి లోపిస్తుంది. ధననష్టం ఉంది.

సింహం

అన్ని పనులూ సవ్యంగా సాగుతాయి. ధనలాభం ఉంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విందుల్లో పాల్గొంటారు. అదృష్టం వరిస్తుంది. మానసిక స్థితి ఉత్సాహకంగా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది.

కన్య

కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. అనవసర జోక్యాలను తగ్గించుకోండి. వైద్య అవసరాలకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. పరిహారం చెల్లించాల్సి వస్తుంది. మనశ్శాంతి కరువవుతుంది.

తుల

శుభప్రదంగా సాగుతుంది. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి.సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

వృశ్చికం

ప్రయత్నించిన ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. అన్ని వైపులా శుభఫలితాలుంటాయి. నైపుణ్యానికి గుర్తింపు ఉంటుంది. అవకాశాలు అందివస్తాయి. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి.

ధనుస్సు

పనులకు అడ్డంకులుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. శత్రుపీడ పెరుగుతుంది. దూర ప్రయాణం ఉంది. త్వరగా అలసిపోతారు. భవిష్యత్ వ్యూహాలను రచిస్తారు. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది.

మకరం

వ్యవహారాలు ఆశించిన రీతిలో సాగవు. డబ్బుకి ఇబ్బంది ఏర్పడుతుంది. ఆశించిన సౌకర్యాలు సమకూరవు. ఇష్టం లేని పని చేయాల్సి వుంటుంది. పోటీలకు దిగకండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. అనవసర జోక్యాలు వద్దు.

కుంభం

చేస్తున్న పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. కీర్తి పెరుగుతుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణం లాభసాటిగా ఉంటుంది.

మీనం

శుభ ఫలితాలను అందుకుంటారు. ధనలాభం ఉంది. కొత్త వస్తువులను కొంటారు. బంధువుల సహకారం లభిస్తుంది. వివాదం సమసిపోతుంది. ప్రత్యర్థులపై గెలుస్తారు. విందులో పాల్గొంటారు ఆరోగ్యం బావుంటుంది.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story