Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (21/11/2024)

Telugu Horoscope Today, November 21, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Published on: 21 Nov 2024 2:07 AM IST
Telugu Horoscope Today, 21 November 2024
X

Telugu Horoscope Today, November 21, 2024

Telugu Horoscope Today, November 21, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, కృష్ణ పక్షం.

తిధి: షష్ఠి సాయంత్రం గం.5.03 ని.ల వరకు.

నక్షత్రం: పుష్యమి మధ్యాహ్నం గం.3.35 ని.ల వరకు ఆ తర్వాత ఆశ్లేష.

అమృతఘడియలు: ఉదయం గం.8.59 ని.ల నుంచి గం.10.38 ని.ల వరకు.

వర్జ్యం: అర్ధరాత్రి దాటాక తె.వా.గం.5.14 ని.ల నుంచి గం.6.56 ని.ల వరకు.

దుర్ముహూర్తం: ఉదయం గం.10.10 ని.ల నుంచి గం.10.55 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.2.40 ని.ల నుంచి గం.3.25 ని.ల వరకు.

రాహుకాలం: మధ్యాహ్నం గం.1.26 ని.ల నుంచి గం.2.51 ని.ల వరకు.

సూర్యోదయం: తె.వా. గం. 6.24 ని.లకు.

సూర్యాస్తమయం: సా. గం. 5.40 ని.లకు.

మేషం

పనులు ఆశించిన రీతిలో పూర్తి కావు. డబ్బుకి కొంత ఇబ్బందిగా ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. విద్య, స్థిరాస్తి, సేవా రంగాల్లోని వారు అప్రమత్తంగా ఉండాలి. వాహన సంబంధ చికాకులు కలుగుతాయి.

వృషభం

వ్యవహారాల్లో విశేష లాభముంటుంది. కీలక సందర్భంలో సోదరులు సహకరిస్తారు. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వస్త్రాభరణాలను కొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మిథునం

కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి. ఆస్తి సంబంధ విషయాలల్లో జాగ్రత్త. చెప్పుడు మాటలను నమ్మడం వల్ల నష్టపోతారు. ఎవరికీ పూచీగా ఉండకండి. ముందుచూపుతో వ్యవహరించండి. కంటి సమస్య వేధిస్తుంది.

కర్కాటకం

వ్యవహారాలు శుభప్రదంగా సాగుతాయి. ఆశించిన లబ్ది చేకూరుతుంది. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. అవసరమైన సందర్భంలో అదృష్టం తోడుగా నిలుస్తుంది. ప్రతిష్ట పెరుగుతుంది. విందులో పాల్గొంటారు.

సింహం

పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి వుంటుంది. అనవసర జోక్యాలు మానుకోండి. ఆత్మీయుల ఆరోగ్యం కలవర పెడుతుంది. ఇంటికి దూరంగా వెళ్లాల్సి రావచ్చు. అనూహ్య ఖర్చులు ఉంటాయి. వేళకు భోజనం ఉండదు.

కన్య

వ్యవహారాలన్నీ అనుకూలంగా పూర్తవుతాయి. ధనలాభం ఉంది. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శత్రువుల బెడద తగ్గుతుంది. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి.

తుల

స్థిరచిత్తంతో చేసే అన్ని పనుల్లోనూ విజయం లభిస్తుంది. అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఇష్టమైన కార్యం సిద్ధిస్తుంది. వృత్తిపర నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది. తండ్రి సామాజిక స్థితి మీ ఎదుగదలకు ఉపకరిస్తుంది.

వృశ్చికం

ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పనులు ఆశించిన రీతిలో సాగవు. పెద్దల కోపానికి గురవుతారు. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. ఆధ్యాత్మిక ఆసక్తి వృద్ధి చెందుతుంది.

ధనుస్సు

అనుకున్న రీతిలో పనులు సాగవు. వారసత్వపు ఆస్తి వ్యవహారాలు బెడిసికొట్టే వీలుంది. తగాదాలకు ఆస్కారం ఉంది. ఆలోచనలను అదుపు చేసుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్త. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి.

మకరం

వ్యవహారాలు శుభప్రదంగా సాగుతాయి. ఆర్థిక లాభాలను అందుకుంటారు. విజ్ఞనాభివృద్ధికి అనుకూలం. ప్రయాణం లాభిస్తుంది. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి.

కుంభం

అన్ని ప్రయత్నాలూ సఫలం అవుతాయి. కీలక వ్యవహారాల్లో శుభ ఫలితాలను అందుకుంటారు. ధనలాభం ఉంది. కొత్త వస్తువులను కొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శత్రుపీడ ఉండదు. స్వస్థాన ప్రాప్తి ఉంది.

మీనం

పనులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. బద్ధకం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయి. వృథా ఖర్చులను తగ్గించాలి. తెలివితేటలకు గుర్తింపు ఉండదు. ఆధ్యాత్మిక, వేద సంబంధ అంశాలపై శ్రద్ధ పెడతారు.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story