Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (20/11/2024)

Telugu Horoscope Today, November 20, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Published on: 20 Nov 2024 1:38 AM IST
Telugu Horoscope Today, 20 November 2024
X

Telugu Horoscope Today, November 20, 2024

Telugu Horoscope Today, November 20, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, కృష్ణ పక్షం.

తిధి: పంచమి సాయంత్రం గం.4.49 ని.ల వరకు ఆ తర్వాత షష్ఠి.

నక్షత్రం: పునర్వసు మధ్యాహ్నం గం.2.50 ని.ల వరకు ఆ తర్వాత పుష్యమి.

అమృతఘడియలు: మధ్యాహ్నం గం.12.27 ని.ల నుంచి గం.2.02 ని.ల వరకు.

వర్జ్యం: రాత్రి గం.11.05 ని.ల నుంచి అర్ధరాత్రి గం.12.44 ని.ల వరకు.

దుర్ముహూర్తం: ఉదయం గం.11.39 ని.ల నుంచి గం.12.24 ని.ల వరకు.

రాహుకాలం: మధ్యాహ్నం గం.12.02 ని.ల నుంచి గం.1.26 ని.ల వరకు.

సూర్యోదయం: తె.వా. గం. 6.24 ని.లకు.

సూర్యాస్తమయం: సా. గం. 5.40 ని.లకు.

మేషం

పనులు ఆశించిన స్థాయిలో జరగవు. బుద్ధి కూడా నిలకడగా ఉండదు. ఆత్మీయ బంధువులతోనే విరోధం గోచరిస్తోంది. స్థిరాస్తి సంబంధ అంశాలను వాయిదా వేయడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త.

వృషభం

వ్యవహారాల్లో విశేష లాభాలు అందుతాయి. ధనాదాయం వృద్ధి చెందుతుంది. ఆత్మధైర్యం పెరుగుతుంది. చుట్టుపక్కల వారితో సఖ్యత పెరుగుతుంది. సోదరుల మద్దతు కారణంగా కీలక సమస్య పరిష్కారమవుతుంది

మిథునం

పనులకు పదేపదే ఆటంకాలు ఎదురవుతాయి. వ్యవహారాల్లో నష్టం గోచరిస్తోంది. కుటుంబంలోనూ చికాకులు ఏర్పడతాయి. ఇతరుల వల్ల ఇబ్బందులొస్తాయి. నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యం. ఆరోగ్యం జాగ్రత్త.

కర్కాటకం

రోజంతా ఉత్సాహంగా సాగుతుంది. ధనలాభం ఉంది. విందుకు హాజరవుతారు. కొత్త వస్తువులను కొంటారు. నూతన విజ్ఞాన సాధనకు అనువైన రోజు. గౌరవం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.

సింహం

పనులు ఆశించినట్లుగా సాగవు. అనూహ్యంగా ఖర్చులు పెరుగుతాయి. మిత్రులూ సహకరించే పరిస్థితి ఉండదు. ఇంటికి దూరంగా వెళ్లాల్సి రావచ్చు. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త. మనసు దిగులుగా ఉంటుంది.

కన్య

కాలం ఆనందంగా సాగుతుంది. చేపట్టిన ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. ఆకాంక్ష నెరవేరుతుంది. సంతాన సంబంధ వ్యవహారాలు సంతోషాన్నిస్తాయి. కొత్త వస్తువులను సేకరిస్తారు. ఆత్మీయులతో విందుకు వెళతారు.

తుల

వ్యవహారాలన్నీ అనుకూలంగా సాగుతాయి. ఇతరులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులు ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ వ్యవహారాలు మనశ్శాంతినిస్తాయి.

వృశ్చికం

పనుల పూర్తికి ఆటంకాలను అధిగమించాల్సి వుంటుంది. స్వజనంతో విరోధాలు ఏర్పడే సూచన ఉంది. ఖర్చు పెరుగుతుంది. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణముంది. కడుపులో ఇబ్బంది ఏర్పడుతుంది.

ధనుస్సు

ఇష్టం లేని పనిని చేయాల్సి వస్తుంది. ఆలోచనలను అదుపు చేసుకోవాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల సమస్యలొస్తాయి. తగాదాలకు దూరంగా ఉండాలి. శత్రుపీడ పెరుగుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

మకరం

పనులన్నీ శుభప్రదంగా పూర్తవుతాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. అనుబంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామి అండతో కుటుంబ వివాదాలను పరిస్కరిస్తారు. ప్రయాణం లాభిస్తుంది.

కుంభం

వ్యవహారాలు శుభదాయకంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. అపార్థాలు తొలగిపోతాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం బావుంటుంది.

మీనం

మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభించదు. అభీష్టం నెరవేరదు. చెడు ఆలోచనలను అదుపు చేసుకోవాలి. వాతసంబంధ ఆరోగ్య సమస్యలుంటాయి. విలువైన వస్తువులను భద్రపరచాలి. శత్రువుల బెడద పెరుగుతుంది.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story