Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (15/11/2024)

Telugu Horoscope Today, November 15, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 15 Nov 2024 1:46 AM IST
Telugu Horoscope Today 15 November  2024
X

Telugu Horoscope Today, November 15, 2024

Telugu Horoscope Today, November 15, 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్ల పక్షం.

తిధి: పౌర్ణమి ఇవాళ అర్ధరాత్రి దాటాక గం.2.58 ని.ల వరకు ఆ తర్వాత కృష్ణ పాడ్యమి.

నక్షత్రం: భరణి రాత్రి గం.9.55 ని.ల వరకు.

అమృతఘడియలు: సాయంత్రం గం.5.38 ని.ల నుంచి గం. 7.04 ని.ల వరకు.

వర్జ్యం: ఉదయం గం.9.06 ని.ల నుంచి గం.10.31 ని.ల వరకు.

దుర్ముహూర్తం: ఉదయం గం.8.37 ని.ల నుంచి గం.9.22 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.12.23 ని.ల నుంచి గం. 1.09 ని.ల వరకు.

రాహుకాలం: ఉదయం గం. 10.36 ని.ల నుంచి గం. 12.01 ని.ల వరకు.

సూర్యోదయం: తె.వా. గం. 6.21 ని.లకు.

సూర్యాస్తమయం: సా. గం. 5.40 ని.లకు.

మేషం

పనులు ఆశించిన రీతిలోనే సాగుతాయి. ధన సంబంధ లావాదేవీలు తృప్తినిస్తాయి. మీ వ్యక్తిత్వం పెద్దల మనసును గెలుస్తుంది. ఉన్నత స్థితి కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కీలక సమయంలో అదృష్టం వరిస్తుంది.

వృషభం

అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. పనుల పూర్తికి బాగా కష్టపడాల్సి వుంటుంది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

మిథునం

అభీష్టం నెరవేరుతుంది. కాలం ఆనందంగా సాగుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంతాన సంబంధ వ్యవహారాలు తృప్తిగా సాగుతాయి. ఆరోగ్యం బావుంటుంది.

కర్కాటకం

అన్ని పనుల్లోనూ విజయం లభిస్తుంది. డబ్బుకి ఇబ్బందేమీ ఉండదు. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. నైపుణ్యంతో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. గౌరవం పెరుగుతుంది. మనశ్శాంతి లభిస్తుంది.

సింహం

పనుల పూర్తికి బాగా కష్ట పడాల్సివుంటుంది. ఆర్థిక లావాదేవీలు అంతంతమాత్రంగానే సాగుతాయి. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు. నష్ట పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది.

కన్య

పనులు అనుకున్న రీతిలో సాగవు. పైవారి కోపానికి గురయ్యే సూచన ఉంది. వారసత్వ ఆస్తి వ్యవహారాలు ఆశించిన ఫలితాలనివ్వవు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. పోటీల్లో పాల్గొనకండి. జీర్ణ సమస్యలుంటాయి.

తుల

పనులు సవ్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తపరిచయాలు ఏర్పడతాయి. శారీరక సౌఖ్యం లభిస్తుంది. ప్రయాణం లాభసాటిగా ఉంటుంది.

వృశ్చికం

వ్యవహారాలన్నింట్లోనూ విజయం సాధిస్తారు. ధన సంబంధ చికాకులు తొలగుతాయి. మిత్రులు సహకరిస్తారు. కొత్త వస్తువులను కొంటారు. కీర్తి వృద్ధి చెందుతుంది. వివాదాలు పరిష్కారం అవుతాయి. అదృష్టం వరిస్తుంది.

ధనుస్సు

బద్ధకం వల్ల చిక్కులొస్తాయి. పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి వుంటుంది. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆలోచనలు సవ్యంగా సాగవు. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి.

మకరం

పనులకు అడ్డంకులు వస్తాయి. ధన సంబంధ వ్యవహారాలు తృప్తినివ్వవు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో నష్టం గోచరిస్తోంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతోనూ గొడవలొచ్చే వీలుంది.

కుంభం

చేపట్టిన కార్యాలన్నీ సఫలం అవుతాయి. మిత్రుల ద్వారా అన్ని రకాల సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. కీలక సమాచారం ఆనందాన్నిస్తుంది. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి.

మీనం

కార్యసాధనలో ఒడుదుడుకులు ఎదురవుతాయి. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. వేళకు భోజనముండదు. చరాస్తి సంబంధ వ్యవహారాలు పరిష్కారం కావు. కోర్టు లావాదేవీల్లో జాగ్రత్త.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story