Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (14/11/2024)

Telugu Horoscope Today, November 14, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Updated on: 14 Nov 2024 2:00 AM IST
Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (14/11/2024)
X

Telugu Horoscope Today, November 14, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి గురువారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్ల పక్షం.

తిధి: త్రయోదశి ఉదయం గం.9.43 ని.ల వరకు ఆ తర్వాత చతుర్దశి.

నక్షత్రం: అశ్వని అర్ధరాత్రి గం.12.33 ని.ల వరకు ఆ తర్వాత భరణి.

అమృతఘడియలు: సాయంత్రం గం.6.08 ని.ల నుంచి గం.7.34 ని.ల వరకు.

వర్జ్యం: రాత్రి గం.8.59 ని.ల నుంచి గం.10.25 ని.ల వరకు.

దుర్ముహూర్తం: ఉదయం గం.10.07 ని.ల నుంచి గం.10.53 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.2.39 ని.ల నుంచి గం.3.24 ని.ల వరకు.

రాహుకాలం: మధ్యాహ్నం గం.1.26 ని.ల నుంచి గం. 2.51 ని.ల వరకు.

సూర్యోదయం: తె.వా. గం. 6.21 ని.లకు.

సూర్యాస్తమయం: సా. గం. 5.40 ని.లకు.

మేషం

రోజంతా ఉత్సాహంగా సాగుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. విందుకు హాజరవుతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వ్యక్తిత్వానికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. జన్మస్థలానికి సంబంధించిన జ్ఞాపకాలు వస్తాయి.

వృషభం

పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. వివాదాలను వీలైన మేర రాజీ మార్గంలో పరిష్కరించుకోండి. అనవసర జోక్యాలు వద్దు. ప్రయాణంలో జాగ్రత్త.

మిథునం

కార్యసాధనలో ఆత్మీయుల సహకారం తోడవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. బంధువులతో విందుకు హాజరవుతారు. సంతాన వ్యవహారాలు ఆనందపరుస్తాయి. ఆరోగ్యం నిలకడగా బావుంటుంది.

కర్కాటకం

అభీష్టం నెరవేరుతుంది. అన్ని పనుల్లోనూ విజయం లభిస్తుంది. ధన సంబంధ లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. బంధువులతో విందులకు వెళతారు. ఇతరులతో విభేదాలు తలెత్తినా మీకే విజయం లభిస్తుంది.

సింహం

పనులు అనుకున్నంత వేగంగా సాగవు. ఆర్థిక చిక్కులుంటాయి. వృథా ఖర్చులను తగ్గించాలి. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. సంతానం తీరు చికాకు పెడుతుంది. దైవ క్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.

కన్య

అనుకున్న సమయానికి పనులు కావు. ఆశించిన సౌకర్యాలూ సమకూరవు. దురాలోచనలు చేస్తారు. ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. కోపాన్ని తగ్గించుకోవాలి. పోటీల్లో పాల్గొనకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

తుల

అన్ని వ్యవహారాల్లోనూ శుభఫలితాలు లభిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ప్రయాణం లాభిస్తుంది. బంధుమిత్రులతో విందుకు వెళతారు.

వృశ్చికం

శుభప్రదంగా సాగుతుంది. మిత్రుల సహకారంతో కీలక కార్యం జయప్రదం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. శత్రుపీడ తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వివాదాలు పరిష్కారమవుతాయి.

ధనుస్సు

పనులకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పడతాయి. శత్రువుల బెడద పెరుగుతుంది. అభీష్టం నెరవేరదు. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభించదు. వృథా ఖర్చులు వేదనకు గురి చేస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

మకరం

బుద్ధి నిలకడగా ఉండదు. అయినవారితోనే విరోధం గోచరిస్తోంది. పనులు సజావుగా సాగవు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. స్థిరాస్తి విక్రయ ప్రయత్నాల్లో పురోగతి ఉండదు. తల్లివైపు బంధువుల గురించిన సమాచారం వస్తుంది.

కుంభం

అన్ని రకాల ప్రయత్నాలూ శుభ ఫలితాలనిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు తృప్తికరంగా సాగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలకు తగ్గ గుర్తింపు లభిస్తుంది.

మీనం

పనులు ఆశించిన రీతిలో సాగవు. బ్యాంకు లావాదేవీలు చికాకుపెడతాయి. వేళకు భోజనముండదు. ఆరోగ్యం జాగ్రత్త. ఎవరికీ పూచీలను ఇవ్వకండి. విడాకుల వ్యవహారాలు ఫలించవు. ప్రయాణాల వల్ల లాభం ఉండదు.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story