Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (13/11/2024)

Telugu Horoscope Today, November 13, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Updated on: 13 Nov 2024 6:31 AM IST
Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (13/11/2024)
X

Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (13/11/2024)

Telugu Horoscope Today, November 13, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి బుధవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్ల పక్షం.

తిధి: ద్వాదశి మధ్యాహ్నం గం.1.01 ని.ల వరకు ఆ తర్వాత త్రయోదశి.

నక్షత్రం: రేవతి అర్ధరాత్రి దాటాక తె.వా.గం.3.11 ని.ల వరకు ఆ తర్వాత అశ్వని.

అమృతఘడియలు: అర్ధరాత్రి గం.1.02 ని.ల నుంచి గం.2.28 ని.ల వరకు.

వర్జ్యం: సాయంత్రం గం.4.26 ని.ల నుంచి గం.5.52 ని.ల వరకు.

దుర్ముహూర్తం: ఉదయం గం.11.38 ని.ల నుంచి గం.12.23 ని.ల వరకు.

రాహుకాలం: మధ్యాహ్నం గం.12.00 ని.ల నుంచి గం.1.25 ని.ల వరకు.

సూర్యోదయం: తె.వా. గం. 6.20 ని.లకు.

సూర్యాస్తమయం: సా. గం. 5.41 ని.లకు.

మేషం

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ఇతరుల వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బంధువులతో గొడవలకు ఆస్కారముంది. వృథాఖర్చులు పెరుగుతాయి. న్యాయపరమైన చిక్కులుంటాయి.

వృషభం

పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లబ్ది చేకూరుతుంది. ఇతరులు కూడా సహకరిస్తారు. శుభ కార్యాలకు హాజరవుతారు. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. సంతానంతో సంతోషంగా గడుపుతారు.

మిథునం

సామాజిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో చేపట్టే ప్రతిపనీ విజయవంతం అవుతుంది. చక్కటి అవకాశాలు కలిసొస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. వృత్తిపరమై సమర్థతతో ప్రశంసలను పొందుతారు.

కర్కాటకం

ఉద్యోగులు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం మంచిది కాదు. అయినవారితోనే విభేదాలు వస్తాయి. దూర ప్రయాణం సూచిస్తోంది. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త.

సింహం

పనుల పూర్తికి బాగా కష్టపడాల్సివుంటుంది. అనుకున్నట్లుగా సౌకర్యాలు సమకూరవు. స్వల్ప తగాదాలకు ఆస్కారముంది. ఉద్యోగులకు ప్రతికూలంగా ఉంటుంది. కొపాన్ని తగ్గించాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

కన్య

అన్ని పనులూ సవ్యంగా సాగుతాయి. చక్కటి బాంధవ్యాలు ఏర్పడతాయి. ప్రయాణం ఆనందదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. కీర్తివృద్ధి చెందుతుంది. మానసిక శాంతి లభిస్తుంది.

తుల

ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రత్యర్థుల ఒత్తిడి తగ్గుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. బలహీనతలను అధిగమిస్తారు. శుభఫలితాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు తృప్తినిస్తాయి. కీర్తి పెరుగుతుంది.

వృశ్చికం

విజయం కోసం బాగా శ్రమించాల్సి వుంటుంది. శక్తి సామర్థ్యాలకు తగ్గ ఫలితం లభించదు. అభీష్టం నెరవేరక పోవచ్చు. ఆలోచనలు నీచంగా సాగుతాయి. వాత సంబంధ సమస్య ఉంటుంది. వృథా ఖర్చులను తగ్గించాలి.

ధనుస్సు

పనుల్లో అడ్డంకులు వస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలను రహస్యంగా ఉంచడమే మేలు. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. అయినవారితోనే విరోధాలు ఏర్పడతాయి. బుద్ధి నిలకడగా ఉండదు.

మకరం

ఆకాంక్ష నెరవేరుతుంది. అన్నివైపుల నుంచీ చక్కటి సహకారం లభిస్తుంది. ధైర్యసాహసాలకు తగిన గుర్తింపును పొందుతారు. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి.

కుంభం

కుటుంబ వ్యవహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బ్యాంకు లావాదేవీలు ఆశించిన తృప్తిని ఇవ్వవు. అకారణ గొడవలు వస్తాయి. శత్రుపీడ పెరుగుతుంది. రెండో పెళ్లి ప్రయత్నం వాయిదా వేయండి. మనశ్శాంతి ఉండదు.

మీనం

అదృష్టం వరిస్తుంది. ఉత్సాహంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణం లాభిస్తుంది. నిరుద్యోగులకు శుభం.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story