Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (12/11/2024)

Telugu Horoscope Today, November 12, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Published on: 12 Nov 2024 12:00 AM IST
Telugu Horoscope Today
X

Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (12/11/2024)

Telugu Horoscope Today, November 12, 2024: నేటి రాశి ఫలాలు..12రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్ల పక్షం.

తిధి: ఏకాదశి సాయంత్రం గం.4.04 ని.లకు అనంతరం ద్వాదశి.

నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.గం.7.52 ని.లకు, అనంతరం ఉత్తరాభాద్ర రేపు తె.వా.గం.5.40 ని.ల వరకు.

అమృతఘడియలు: అర్ధరాత్రి గం.1.19 ని.ల నుంచి గం.2.46 ని.ల వరకు.

వర్జ్యం: సాయంత్రం గం.4.35 ని.ల నుంచి గం.6.03 ని.ల వరకు.

దుర్ముహూర్తం: ఉదయం గం.8.36 ని.ల నుంచి గం.9.21 ని.లకు మళ్లీ రాత్రి గం.10.45 ని.ల నుంచి గం.11.35 ని.లకు.

రాహుకాలం: మధ్యాహ్నం గం.2.51 ని.ల నుంచి గం.4.16 ని.ల వరకు.

సూర్యోదయం: తె.వా. గం. 6.20 ని.లకు.

సూర్యాస్తమయం: సా. గం. 5.41 ని.లకు.

మేషం

పనులు సవ్యంగా సాగవు. ఆర్థిక లావాదేవీల్లో చిక్కులొస్తాయి. రహస్య కార్యకలాపాలు చేసే సూచన ఉంది. ఇంటికి దూరంగా ఉంటారు. వేళకు భోజనముండదు. అపవసర జోక్యాలు వద్దు. నిద్రలేమి వేధిస్తుంది.

వృషభం

ఉల్లాసంగా గడుపుతారు. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ధన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఆరోగ్యం బావుంటుంది. బంధాలు బలపడతాయి. సంతాన వ్యవహారాలు గౌరవాన్ని పెంచేలా ఉంటాయి.

మిథునం

అభీష్టం నెరవేరుతుంది. ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుంది. ఇతరులతో విభేదాల్లో పెద్దల ఆశీస్సులు మీకే లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోని వారు చక్కటి నైపుణ్యంతో రాణిస్తారు.

కర్కాటకం

కార్యసాధనలో కొన్ని ఆటంకాలను దాటాల్సివుంటుంది. మిత్రుల తోడ్పాటుతో వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. త్వరగా అలసిపోతారు. ఖర్చులు పెరుగుతాయి. పెద్దలను కలుస్తారు. దైవచింతన పెరుగుతుంది.

సింహం

అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. నిరాశ పెరుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. తప్పు మార్గాల్లో వెళ్లడం మంచిది కాదు. ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. ఉద్యోగుల జాగ్రత్తగా ఉండాలి.

కన్య

వ్యవహారాలన్నీ సజావుగా సాగుతాయి. సత్సంబంధాలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. ప్రయాణం వినోదాన్నిస్తుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.

తుల

ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అపార్థాలు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. పోయిన వస్తువు దొరుకుతుంది. బలహీనతను జయిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. స్వస్థానప్రాప్తి ఉంది.

వృశ్చికం

పనులకు ఆటంకాలు పెరుగుతాయి. శత్రువులపై కన్నేసి ఉంచాలి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. అభీష్టం నెరవేరే సూచన లేదు. అనుమానం వీడి ఆత్మవిశ్వాసంతో కష్టపడాలి. విలువైన వస్తువులు జాగ్రత్త.

ధనుస్సు

స్థిరాస్తి, విద్యారంగాల్లోని వారు అప్రమత్తంగా ఉండాలి. భూసంబంధ లావాదేవీలు నష్టదాయకంగా ఉంటాయి. నమ్మినవారే వంచిస్తారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయం వల్ల నిందను ఎదుర్కొంటారు.

మకరం

అన్ని వ్యవహారాల్లోనూ శుభఫలితాలుంటాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సోదరుల తోడ్పాటుతో కుటుంబ చిక్కును పరిష్కరిస్తారు. నాయకత్వ లక్షణానికి గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

కుంభం

పనులు ఆశించినరీతిలో సాగవు. ఆటంకాలు, వ్యవహార నష్టాలు గోచరిస్తున్నాయి. మాట నిలుపుకోని కారణంగా ఇబ్బంది వస్తుంది. కుటుంబ సమస్య వల్ల మనశ్శాంతి ఉండదు. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త.

మీనం

రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. అన్నిరకాల ప్రయోజనాలూ లభిస్తాయి. బంధువులతో విందుకు వెళతారు. కొత్త సంగతులను తెలుసుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story