Saturn Transit 2026: 27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలోకి శనిదేవుడు.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు!

Saturn Transit 2026: 27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలోకి శనిదేవుడు.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు!
x
Highlights

27 ఏళ్ల తర్వాత శని తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్రలోకి ప్రవేశించారు. దీనివల్ల వృషభ, కన్యా, మకర రాశుల వారికి మహర్దశ పట్టబోతోంది. ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

జ్యోతిష్య శాస్త్రంలో 'కర్మ ఫల ప్రదాత'గా పిలవబడే శని దేవుడు తన గమనాన్ని మార్చారు. దాదాపు 27 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత శని తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్ర (ఉత్తరాది) నక్షత్రంలోకి ప్రవేశించారు. జనవరి 20 నుంచి మే 17 వరకు అంటే దాదాపు నాలుగు నెలల పాటు శనిదేవుడు ఇదే నక్షత్రంలో సంచరించనున్నారు. ఈ అరుదైన గ్రహ స్థితి వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం వరించనుండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

12 రాశులపై శని ప్రభావం ఎలా ఉండబోతోంది?

అదృష్టం వరించే రాశులు (జాక్‌పాట్):

వృషభ రాశి: వీరికి ఈ సమయం గోల్డెన్ పీరియడ్. ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. దీర్ఘకాలిక కెరీర్ సమస్యలు తొలగిపోతాయి.

కన్యారాశి: గతంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. పదోన్నతి (Promotion) వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ధనస్సు రాశి: మీ కెరీర్ కొత్త మలుపు తిరుగుతుంది. ఈ సమయంలో మీరు ప్రారంభించే పనులు భవిష్యత్తులో భారీ లాభాలను తెచ్చిపెడతాయి.

మకర రాశి: శని ప్రభావంతో గత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, ఆర్థిక లాభాలు పెరుగుతాయి.

మిశ్రమ ఫలితాలు పొందే రాశులు:

మిథున రాశి: గౌరవం పెరుగుతుంది కానీ అదే స్థాయిలో ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది.

సింహరాశి: కష్టపడి పనిచేస్తేనే విజయం అందుతుంది. పై అధికారులతో సత్సంబంధాలు కాపాడుకోవడం ముఖ్యం.

కుంభ రాశి: శ్రమకు తగిన ఫలితం వస్తుంది, అయితే అది కాస్త ఆలస్యం కావచ్చు. ఆరోగ్యంపై (ముఖ్యంగా ఎముకలు, కీళ్లు) శ్రద్ధ వహించాలి.

మీనరాశి: ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మిక రంగాల్లో ఉండేవారికి మంచి గుర్తింపు లభిస్తుంది.

జాగ్రత్త వహించాల్సిన రాశులు:

మేషరాశి: పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబం, ఆరోగ్య సమతుల్యత ముఖ్యం.

కర్కాటక రాశి: భావోద్వేగ పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. స్థాన చలనం లేదా ఉద్యోగ మార్పు ఉండవచ్చు. జీర్ణక్రియ సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

తులారాశి: కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో, చట్టపరమైన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం.

వృశ్చికరాశి: ఖర్చులు అదుపు తప్పుతాయి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది.

శని దోష నివారణకు చిట్కాలు:

శని ప్రభావం ప్రతికూలంగా ఉన్నవారు శనివారం రోజున శివుడిని లేదా హనుమంతుడిని పూజించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అలాగే పేదలకు అన్నదానం చేయడం లేదా నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శని దేవుని అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories