Weekly Horoscope in Telugu, 4 to 10 August 2024: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే

Weekly Horoscope in Telugu, 4 to 10 August 2024: వారఫలాలు :ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే (04-08-2024 నుంచి 10-08-2024 వరకు)

P Vijay Kumar Astrologer
Updated on: 4 Aug 2024 6:01 AM IST
Weekly Horoscope in Telugu, 4 to 10 August 2024: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే
X

Weekly Horoscope in Telugu, 4 to 10 August 2024: వారఫలాలు :ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే (04-08-2024 నుంచి 10-08-2024 వరకు)

మేషం

అప్రమత్తంగా ఉండండి. అనుకున్నతంత సులభంగా పనులు కావు. అంతిమ విజయం మీదే అయినా శత్రువుల ఎత్తులు వేదనకు గురి చేస్తాయి. అవసరమైన డబ్బు కోసమే కాస్త శ్రమించాల్సి వుంటుంది. బంధుమిత్రులు సహకరిస్తారు. ఓదశలో బుద్ధి నిలకడ లోపిస్తుంది. ఆలోచనలు నీచస్థాయిలో సాగుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అవమానాలు గోచరిస్తున్నాయి. సంతాన వ్యవహారాలు చికాకు పరుస్తాయి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. దొంగతనం సూచిస్తోంది.. కీలక డాక్యుమెంట్లు, వస్తువులు జాగ్రత్త.

వృషభం

ఎంతో కష్టపడితే గానీ పనులు పూర్తి కావు. ప్రతి పనిలోనూ అడ్డంకులుంటాయి. అవసరానికి సరిపడా డబ్బు అందుతుంది. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆపత్కాలంలో మిత్రులు తోడుగా ఉంటారు. ఆస్తి అమ్మే ప్రయత్నాలు అనుకూలించవు. వృథా ఖర్చులుంటాయి. సొంత తెలివితేటలు పనికిరావు. ఇష్టమైన పని భంగం కావడం ఆవేదనను కలిగిస్తుంది. బద్ధకాన్ని వదిలి, ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. సంతాన వ్యవహారాలపై దృష్టి పెట్డండి. ప్రియతములతో వినోదంగా గడుపుతారు. శుభవర్తమానం అందుతుంది.

మిథునం

వ్యవహార నష్టం ఉంది. అతి జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు, ముఖ్యంగా బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. అవసరానికి సరిపడినంత డబ్బు సమకూరినా అనూహ్య ఖర్చులుంటాయి. భూ సంబంధ చిక్కుల్లో సోదరులు అండగా నిలుస్తారు. శుభవర్తమానం అందుతుంది. అనవసరంగా ఎవరికీ పూచీకత్తు ఇవ్వకండి. అనవసర ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. కుటుంబ పరిస్థితులపై ప్రత్యేక దృష్టి పెట్టండి. వేళకు భోజనం ఉండదు. ఆరోగ్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. మిత్రుల వల్ల లబ్ది పొందుతారు.

కర్కాటకం

పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన లక్ష్యాన్ని చేరుకుంటారు. అయినవారితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక చికాకులున్నా, మీ పురోభివృద్ధికి ఏమాత్రం అడ్డంకి కాబోవు. కొత్త బాధ్యతల్లో కుదురుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. దాయాదుల సమస్య సమసిపోతుంది. బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగవు. మాట తప్పడం వల్ల నింద పడే సూచన ఉంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. గృహోపకరణాలు కొంటారు. మిత్రులతో విందుల్లో పాల్గొంటారు.

సింహం

కార్యసాధనకు బాగా కష్టపడాల్సి వుంటుంది. వ్యవహార నష్టం మనసును కలతబారుస్తుంది. బంధువులతో విరోధం గోచరిస్తోంది. సోమరితనం వల్ల చిక్కులెదుర్కొంటారు. దూర ప్రాంత ప్రయాణం ఉంది. వేళకు భోజనం ఉండదు. ఆత్మీయులకు చికిత్స కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. మాట తప్పడం వల్ల నింద పడే సూచన ఉంది. బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగవు. అకారణ విరోధాలొస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.

కన్య

కీలక కార్యంలో అనుకూల ఫలితం వస్తుంది. ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఇష్టమైన వారిని కలుస్తారు. బంధాలు దృఢమవుతాయి. గృహ వ్యవహారాలపై దృష్టి పెడతారు. సంతానం గురించిన చింత తొలగుతుంది. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. కీలక వ్యవహారాల్లో ఇతరుల నుంచీ తోడ్పాటు లభిస్తుంది. అనవసరపు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వేళకు భోజనం ఉండదు. బద్దకం వల్ల చిక్కులొస్తాయి. అదృష్టం తొడుగా ఉండడంతో ఆపద తొలగిపోతుంది.

తుల

తలచిన కార్యక్రమాలు విజయవంత అవుతాయి. అన్ని వర్గాల నుంచి తగిన సహకారం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇతరులతో విరోధాలు సమసిపోతాయి. పెద్దల అభిమానాన్ని పొందుతారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. మనోవాంఛ ఫలిస్తుంది. కొత్త స్నేహితుల వల్ల లబ్దిని పొందుతారు. సంతాన సంబంధ శుభ కార్యాచరణకు శ్రీకారం చుడతారు. గృహనిర్మాణ ప్రయత్నాలకు అనుకూలం. దూర ప్రయాణం గోచరిస్తోంది. అనవసర జోక్యం, తొందరపాటు నిర్ణయాలు సరికాదు.

వృశ్చికం

యోగదాయకంగా ఉంటుంది. అభీష్టాలన్నీ నెరవేరతాయి. ధన సంబంధ వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. రుణ విముక్తి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పోటీల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు మెరుగైన అవకాశాలను పొందుతారు. కుటుంబ పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. శారీరక, మానసిక సౌఖ్యాలను పొందుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయులతో విందుల్లో పాల్గొంటారు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ధనుస్సు

పనుల్లో ఎంతో ప్రయత్నించాకే, ఫలితం దక్కుతుంది. కష్టాలు వెంటాడినట్లుగా వస్తాయి. శత్రువుల కదలికలు కలవర పరుస్తాయి. ఆత్మధైర్యంతో ఎదుర్కోండి. శుభం జరుగుతుంది. వారం ద్వితీయార్థానికి అన్నీ సర్దుకుంటాయి. అభీష్టం నెరవేరుతుంది. ఇతరులతో ఏర్పడే విరోధాలు తొలగిపోతాయి. అధికారుల అభిమానాన్ని పొందుతారు. చక్కటి అవకాశాలు అందివస్తాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు అధికార వృద్ధి ఉంది.

మకరం

కీలక వ్యవహారాలను వారం ప్రారంభంలోనే చేపట్టండి. తగిన శుభ ఫలితాలు అందుతాయి. విధులకు సంబంధించి కొత్త విషయాలు తెలుస్తాయి. అయిష్టంగానే కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ధనలాభం ఉంటుంది. విజ్ఞానం పెంచుకునేందుకు చేసే అన్ని ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. బంధువల వైద్యం కోసం ఖర్చు చేయాల్సి రావచ్చు. తగాదాలకు దూరంగా ఉండండి. బలహీనతలను బయటకు చెప్పకండి. త్వరగా అలసి పోతారు. దైవిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభం

ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది. డబ్బుకి సంబంధించిన చికాకులు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. నూతన వస్తు ప్రాప్తి ఉంది. స్వస్థానంలో, ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. ఇతరులతోనూ బంధాలు దృఢమవుతాయి. కొత్త బాధ్యతలు చేపట్టే సూచన ఉంది. ప్రయాణాలు ఆనందకరంగా ఉంటాయి. ఉద్యోగులు ప్రశంసలను అందుకుంటారు. వారం చివరలో అప్రమత్తంగా ఉండండి. ఎవరి వ్యవహారంలోనూ జోక్యం చేసుకోకండి. వృథా ఖర్చులను అదుపు చేయండి.

మీనం

కొన్ని చికాకులు తలెత్తినా, పనులు సవ్యంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. నూతన వస్తువులను కొంటారు. బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి. పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకుంటారు. సంతానం తీరు అసంతృప్తిని కలిగిస్తుంది. ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో సొంత నిర్ణయాల కన్నా జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.



P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story