Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..12 రాశుల ఫలితాలు ఇలా.. 7 July 2024

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..12 రాశుల ఫలితాలు ఇలా.. 7 July 2024
x

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..12 రాశుల ఫలితాలు ఇలా.. 7 July 2024

Highlights

Today Horoscope in Telugu 7th July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? జులై 7 ఆదివారంనాటి  12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.

Today Horoscope in Telugu 7th July 2024: ఈరోజు ఎవరికి ఎలా ఉంటుంది? ఎవరికి కలిసొస్తుంది? ఎవరికి సమస్యలు పొంచి ఉన్నాయి? జులై 7 ఆదివారంనాటి 12 రాశి ఫలాలపై జ్యోతిష్య పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం

తిధి : విదియ రేపు తె.వా. గం.4.59 ని.ల వరకు ఆ తర్వాత తదియ

నక్షత్రం: పుష్యమి పూర్తి

అమృతఘడియలు: రాత్రి గం.11.1 9 ని.ల నుంచి అర్ధరాత్రి గం.1.00 ని.ల వరకు

వర్జ్యం: మధ్యాహ్నం గం.1.13 ని.ల నుంచి గం.2.54 ని.ల వరకు

దుర్ముహూర్తం: సాయంత్రం గం.5.10 ని.ల నుంచి గం.6.02 ని.ల వరకు

రాహుకాలం: సాయంత్రం గం.5.16 ని.ల నుంచి గం.6.55 ని.ల వరకు

సూర్యోదయం: తెవా. గం.5.47 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం.6.55 ని.లకు


మేషం :

ఇంటి విషయాలపై శ్రద్ధ పెడతారు. కుటుంబ సభ్యుల తీరు విస్మయ పరుస్తుంది. స్థిరాస్తి సంబంధ నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. లీజు వ్యవహారాలు అనుకూలించవు. వాహనాల్లో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త.


వృషభం :

నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఒప్పందాలకు అనుకూలమైన రోజు. కీలక సమాచారం తెలుస్తుంది. దాయాదుల బెడద తగ్గుతుంది. స్వల్పకాలిక ప్రయాణాలుంటాయి. ముఖ్యాంశాల్లో అయోమయం పోతుంది.


మిథునం :

జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను నమ్మి ఆర్థిక చిక్కుల్లో పడే సూచన ఉంది. మీ మనోభావాలకు గుర్తింపు ఉండదు. సమీప బంధువులతో విభేదాలు సూచిస్తున్నాయి. ద్వితీయ వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి.


కర్కాటకం:

లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు. స్వయంకృషితో ప్రతిష్టను పెంచుకుంటారు. స్వస్థాన ప్రాప్తి ఉంది. వ్యక్తిగత అంశాలపై శ్రద్ధ పెడతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృథాఖర్చులను తగ్గించడం మేలు.


సింహం :

వ్యక్తులను గుడ్డిగా నమ్మడం ద్వారా మోసపోతారు. దండనకు గురయ్యే సూచన ఉంది. ఆత్మన్యూనతకు గురికాకండి. అనూహ్యమైన వ్యక్తి వల్ల కీలక సమస్య తొలగిపోతుంది. జీవిత భాగస్వామిపై శ్రద్ధ పెట్టాలి.


కన్య :

అభీష్టం నెరవేరుతుంది. మీ సలహాలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయ మిత్రులను కలుస్తారు. కార్యాలయ వ్యవహారాలను నైపుణ్యంతో నిర్వహిస్తారు. పెట్టుబడులకు సంబంధించి లాభాన్ని పొందుతారు.


తుల :

కార్యనిర్వహణ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు. పెద్దల ప్రశంసలు అందుతాయి. అభీష్టం సిద్ధిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు లాభాలుంటాయి. గృహశాంతి ఉంటుంది.


వృశ్చికం :

ఉన్నత ఆలోచనలుంటాయి. విలువలకు ప్రాధాన్యమిస్తారు. మీ మేలు కోరేవారిని కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రకృతిలో గడపడానికి ఇష్టపడతారు. పిత్రార్జిత వ్యవహారాలు సజావుగా సాగవు.


ధనుస్సు :

ఆకస్మిక ధనలాభం ఉంది. స్థల మార్పిడి యత్నాలకు శ్రీకారం చుడతారు. శత్రుపీడ పెరుగుతుంది. సుహృద్భావ వాతావరణం చెడుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. వృథా ఖర్చులు తగ్గించాలి.


మకరం :

ఇల్లు మార్చే ప్రయత్నాలు చేస్తారు. అగ్రిమెంట్లు కుదుర్చుకోవడానికి అనుకూలమైన రోజు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది.


కుంభం :

రుణ సంబంధ లావాదేవీలు అనుకూలిస్తాయి. వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుంది. శత్రుపీడ ఉండదు. సంతాన సంబంధ శుభవార్త వింటారు. సేవారంగంలోని వారికి గుర్తింపు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంది.


మీనం :

మంత్రాంగం ఫలించదు. మనసు నిలకడగా ఉండదు. అనూహ్య ధనలాభం ఉంది. దురలవాట్లకు దూరంగా ఉండాలి. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. వినోద కార్యాల్లో పాల్గొంటారు. ఖర్చులకు అప్పుచేయాల్సి రావచ్చు.Show Full Article
Print Article
Next Story
More Stories