Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..12 రాశుల ఫలితాలు ఇలా.. 11 July 2024

Rashi Phalalu Daily Horoscope For 11th July 2024 Thursday In Telugu
x

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..12 రాశుల ఫలితాలు ఇలా.. 11 July 2024

Highlights

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..12 రాశుల ఫలితాలు ఇలా.. 11 July 2024

11-07-2024 (గురువారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం

తిధి : పంచమి ఉ.గం.10.03 ని.లకు ఆ తర్వాత షష్ఠి

నక్షత్రం: పుబ్బ మధ్యాహ్నం గం.1.04 ని.ల వరకు ఆ తర్వాత ఉత్తర

అమృతఘడియలు: ఉదయం గం.5.55 ని.ల నుంచి గం.7.42 ని.లకు

వర్జ్యం: రాత్రి గం.9.11 ని.ల నుంచి గం.11.00 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.10.11 ని.ల నుంచి గం.11.03 ని.లకు తిరిగి మధ్యామ్నం గం.3.25 ని.ల నుంచి గం.4.17 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.02.00 ని.ల నుంచి గం.గం.3.38 ని.ల వరకు

సూర్యోదయం : తెవా. గం.5.49 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.55 ని.లకు


మేషం :

సంతానం తీరు చికాకు పరుస్తుంది. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభించదు. పనుల్లో ఆటంకాలు మనోవ్యధకు కారణమవుతాయి. అనుమానాలు పెరుగుతాయి. సాంత్వనకు సూర్యుణ్ణి ఆరాధించండం మేలు.


వృషభం :

పనుల్లో అడ్డంకులుంటాయి. లక్ష్య సాధనలో వెనుకబడడం ఆందోళనను కలిగిస్తుంది. స్థిరాస్తి రంగంలోని వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా లేకుంటే భారీ నష్టం తప్పదు. కుమారస్వామిని పూజించండి.


మిథునం :

ఆత్మ విశ్వాసంతో చేపట్టే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ఆస్తి వ్యవహారంలో సోదరులు అండగా నిలుస్తారు. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. కీలక సమాచారం అందుతుంది. ఆదాయం బావుంటుంది.


కర్కాటకం:

బ్యాంకు లావాదేవీలు ప్రతికూలంగా ఉంటాయి. ఇతరులను నమ్మి మోసపోయే సూచన ఉంది. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. ఎవరితోనైనా సంయమనంతో మాట్లాడండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి.


సింహం :

ప్రతి రంగంలోని వారికీ శుభప్రదంగా ఉంటుంది. డబ్బు సమస్యలుండవు. అభీష్టాలు నెరవేరతాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. నూతన బాధ్యతలు చేపడతారు. గౌరవం పెరుగుతుంది. ఉత్సాహంగా గడుపుతారు.


కన్య :

పనులు అనుకున్న స్థాయిలో జరగవు. కలవరం కలుగుతుంది. అనవసర ప్రయాణాలు వద్దు. వేళకు భోజనం ఉండదు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. శివపార్వతులను పూజించండి.


తుల :

సంతోషంగా గడుపుతారు. కార్యసాధనలో అందరి సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గృహోపకరణాలు కొంటారు. వ్యవహారాలు పురోభివృద్ధి దిశగా సాగుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.


వృశ్చికం :

పోటీలో విజేతగా నిలుస్తారు. ఇష్టమైన పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగులు అధికారుల దృష్టిలో పడతారు. అవకాశాన్ని దుర్వినియోగం చేయకండి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. గౌరవం పెరుగుతుంది.


ధనుస్సు :

భవిష్యత్తు గురించిన ఆలోచనలుచేస్తారు. బలహీనతలను బయటపెట్టకండి. వృత్తిలో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఇంటికి దూరంగా వెళ్లాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యాల్లో పాల్గొనడం సాంత్వననిస్తుంది.


మకరం :

అనుకున్న రీతిలో పనులు సాగవు. కొందరిపై అకారణ ద్వేషం పెంచుకుంటారు. నచ్చని పనిని చేయాల్సి వస్తుంది. విపరీత ధోరణి మంచిది కాదు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఆంజనేయుణ్ణి పూజించండి.


కుంభం :

ఉద్యోగులు రివార్డులను అందుకుంటారు. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. సహచరులతో బంధం దృఢపడుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. కీర్తి పెరుగుతుంది.


మీనం :

కార్యజయం ఉంది. అభీష్టం నెరవేరుతుంది. ధనలాభం ఉంది. రుణ విముక్తి ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. శత్రుపీడ తగ్గుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories