Sagittarius Horoscope 2024: ధనస్సు రాశివారికి ధనం వచ్చేనా.. ఈ ఏడాది ఎలా ఉంటుందంటే..?

Sagittarius Horoscope 2024: ఈ ఏడాది ఏప్రిల్‌ 9న ఉగాది పండుగ వస్తోంది. ఉగాది తెలుగువారి మొదటి పండుగ కాబట్టి తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు.

Jyothi
Published on: 8 April 2024 2:47 PM IST
Krodhinama year 2024 Sagittarius Horoscope 2024,25
X

Sagittarius Horoscope 2024: ధనస్సు రాశివారికి ధనం వచ్చేనా.. ఈ ఏడాది ఎలా ఉంటుందంటే..?

Sagittarius Horoscope 2024: ఈ ఏడాది ఏప్రిల్‌ 9న ఉగాది పండుగ వస్తోంది. ఉగాది తెలుగువారి మొదటి పండుగ కాబట్టి తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు. ఈ ఏడాది క్రోధినామ సంవత్సరం వచ్చింది. అంటే క్రోధమును కలిగించేదని పండితులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతి ఒక్కరికి ఈ ఏడాది ఎలా ఉంటుందనే విషయం తెలుసుకోవాలని ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్కరు పంచాంగ శ్రవ‌ణం చేయాలి. ఈ సంవ‌త్సరం జాత‌కంలో ఏఏ దోషాలు ఉన్నాయి, రాశులు ఎలా ఉన్నాయి, తిధి, యోగము, క‌ర్నము, వారం ఇలా అన్ని విష‌యాలు తెలుసుకోవాలి. ఈ రోజు క్రోధినామ సంవత్సరంలో ధనస్సు రాశివారికి మంచి ఎంత చెడు ఎంత తెలుసుకుందాం.

ఆదాయం : 11

వ్యయం : 5

రాజపూజ్యం : 7

అవమానం : 5

అదృష్ట సంఖ్య 3

మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము. మీ పేరులో మొదటి అక్షరం యే, యో, బా, బి, భూ, ధా, భ, ధా, బే

క్రోధినామ సంవత్సరం ధనస్సు రాశి వాళ్లకి అనుకూలంగా ఉంటుంది. రైతులకు దిగుబడి సంతృప్తిగా ఉంటుంది. వృత్తి వ్యాపారులు సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వస్తుంది కాని ఏసీబీ దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. లాయర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లకు అనుకూలమైన రోజులు. రాజకీయ నాయకులు రెండు చేతులతో సంపాదిస్తారు. విద్యార్థులకు సామాన్య మార్కులు. నిరుద్యోగులకు సామాన్యం. కళాకారులకు సామరస్యం. బిగ్ ఇండస్ట్రీ వారికి అనుకూలం. స్మాల్ ఇండస్ట్రీ వారికి సామాన్యం. టింబర్ ధరలు నిలకడగా ఉండవు. కిరాణ ఫ్యాన్సీ సుగంధ ద్రవ్యాల ధరలు పెరుగును. ధరలు నిలకడగా ఉండవు. తెలియని అనారోగ్యం, ఆకస్మిక ప్రయాణములు ఉంటాయి. కెమికల్ ఇండస్ట్రీ వారికి అనుకూలం. శత్రుబాధలు. డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయ వనరులు బాగుంటాయి. ఖర్చు ఏవిధంగా వస్తుంది అనేది తెలియదు. ఆకస్మిక ఆదాయం, ఆర్భాటాలు ఎక్కువనే చేస్తారు. అన్ని రంగాల వారికి డబ్బు వస్తుంది. మానసిక ప్రశాంతత ఉండదు. ఏవిధంగా ఆలోచించినా ఏదో ఒక సమస్య ఉంటుంది. కళాకారులకు పని ఒత్తిడి ఉంటుంది. కానీ డబ్బు రాదు. కవులకు గౌరవ మర్యాదలు పెరుగును. మూల నక్షత్రం వాళ్లు జాతి వైఢూర్యం ధరించాలి. చిత్రగుప్త దేవాలయంలో ఏడు బుధవారములు పూజలు చేస్తే మంచిది.

ప్రతి రోజు వినాయక, సరస్వతి దేవికి ఆరాధన వల్ల మంచి కలుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్లు వజ్రం ధరించాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, లక్ష్మీ కవచం పారాయణ చేయగలిగితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కనకధార స్తోత్ర పారాయణంతో ఆర్థిక ఇబ్బందులు దరిచేరవు. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్లు జాతి కెంపు ధరించాలి. ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ, సూర్య దండకం చేయడం వల్ల ఆనందం, ఆరోగ్యం వస్తుంది. నవగ్రహ ప్రదక్షిణ, జపాలు, దానాలు చేయడం వల్ల ఎంతటి ఇబ్బందులు వచ్చినా తొలగిపోవును.

Jyothi

Jyothi

Next Story