Tulsi Remedies: తులసి చెట్టు పరిహారాలు.. అదృష్టం, ధన ప్రాప్తి కోసం ఇలా చేయండి..!

Tulsi Remedys:ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు కనిపిస్తుంది. జ్యోతిష్యం ప్రకారం తులసిని పూజించడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.

Jyothi
Updated on: 9 Oct 2023 9:04 AM IST
If you do these Remedies in the Evening near the Tulsi tree you will get Wealth
X

Tulsi Remedies: తులసి చెట్టు పరిహారాలు.. అదృష్టం, ధన ప్రాప్తి కోసం ఇలా చేయండి..!

Tulsi Remedies: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు కనిపిస్తుంది. జ్యోతిష్యం ప్రకారం తులసిని పూజించడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ ప్రసరిస్తుంది. సంపదకు ఎటువంటి లోటు ఉండదు. అయితే ప్రతి ఒక్కరు పూజా విధానాలు తెలుసుకోవాలి. తులసికి సంబంధించిన కొన్ని నివారణలు జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్నారు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించండి

ప్రతి రోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. దీనివల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతారు. ఆవు నెయ్యి, మట్టి దీపం వెలిగించేలా ప్రయత్నించండి. దీనితో పాటు చిటికెడు పసుపును కూడా ఈ దీపంలో వేయండి. దీనివల్ల లక్ష్మీ దేవి, విష్ణువు ఆశీర్వాదాలు లభిస్తాయి.

వ్యాపారంలో లాభాలు

తులసి దగ్గర నెయ్యి కలిపిన పిండితో చేసిన దీపాన్ని వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. దీనివల్ల లక్ష్మీదేవితోపాటు అన్నపూర్ణ అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. ఇల్లు ఎప్పుడూ సంపదతో నిండి ఉంటుంది. మరుసటి రోజు ఈ పిండి దీపాన్ని ఆవుకి తినిపిస్తే ఆవు ఆశీస్సులు కూడా లభిస్తాయి.

అక్షింతలు

తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించి అందులో కొన్ని అక్షింతలు వేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. సంపదకు ఎటువంటి లోటుండదు. అయితే ఆదివారం తులసి దగ్గర దీపం వెలిగించకూడదని గుర్తుంచుకోండి. దీనివల్ల పాజిటివ్‌ ఫలితాలకు బదులు నెగిటివ్‌ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Jyothi

Jyothi

Next Story