Horoscope Today: నేటి మీ రాశి ఫలాలు ఇలా (19/11/2024)

Horoscope Today Telugu, 19 November 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

P Vijay Kumar Astrologer
Updated on: 19 Nov 2024 12:00 AM IST
Horoscope Today Telugu, 19 November 2024
X

Horoscope Today Telugu, 19 November 2024

Horoscope Today Telugu, 19 November 2024: నేటి రాశి ఫలాలు..12 రాశుల వారికి మంగళవారం నాటి రాశిఫలాలు.

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు, కృష్ణ పక్షం

తిధి: చవితి సాయంత్రం గం.5.28 ని.ల వరకు ఆ తర్వాత పంచమి

నక్షత్రం: ఆరుద్ర మధ్యాహ్నం గం.2.56 ని.ల వరకు ఆ తర్వాత పునర్వసు

అమృతఘడియలు: లేవు

వర్జ్యం: అర్ధరాత్రి దాటాక గం.2.53 ని.ల నుంచి గం.4.28 ని.ల వరకు

దుర్ముహూర్తం: ఉదయం గం.8.39 ని.ల నుంచి గం.9.24 ని.ల వరకు మళ్లీ రాత్రి గం.10.45 ని.ల నుంచి గం.11.36 ని.ల వరకు

రాహుకాలం: మధ్యాహ్నం గం.2.51 ని.ల నుంచి గం.4.15 ని.ల వరకు

సూర్యోదయం: తె.వా. గం. 6.23 ని.లకు

సూర్యాస్తమయం: సా. గం. 5.40 ని.లకు

మేషం

ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. నాయకత్వ లక్షణానికి గుర్తింపు లభిస్తుంది. ఆత్మధైర్యం పెరుగుతుంది. దాయాదుల సమస్య పరిష్కారమవుతుంది. ఇరుగు పొరుగుతో చక్కటి సఖ్యత ఏర్పడుతుంది.


వృషభం

వ్యవహారాల్లో నష్టపోతారు. ఇతరుల కారణంగా సమస్యల్లో చిక్కుకుంటారు. అనుకోని గొడవలు వస్తాయి. వేళకు భోజనముండదు. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. మనశ్శాంతి కరువవుతుంది.

మిథునం

అదృష్టం వరిస్తుంది. ఆశించిన ప్రయోజనాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా సాగుతాయి. కీర్తి వృద్ధి ఉంది. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. ఆరోగ్యం బావుంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

కర్కాటకం

పనులు అనుకున్న రీతిలో సాగవు. మిత్రులతోనే విరోధం ఏర్పడే సూచనలున్నాయి. బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి రావచ్చు. ఇంటికి దూరంగా గడుపుతారు. బద్ధకం వల్ల చిక్కులొస్తాయి. నిద్రలేమి వేధిస్తుంది.

సింహం

రోజంతా సుఖ సంతోషాలతో గడుపుతారు. ఇష్టమైన వారితో విందుకు హాజరవుతారు. అవసరమైన వారి నుంచి తగిన సహకారం లభిస్తుంది. ప్రయాణం లాభిస్తుంది. సంతాన సంబంధ శుభకార్యాల గురించి చర్చిస్తారు.

కన్య

అభీష్టం నెరవేరుతుంది. ఉద్యోగ వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. సహచరుల తోడ్పాటు లభిస్తుంది. అధికారుల ప్రశంసలను పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. మనశ్శాంతిని పొందుతారు.

తుల

ఉద్యోగ జీవితంలో ఒడుదుడుకులు ఎదురవుతాయి. భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. దైవక్షేత్రాన్ని సందర్శిస్తారు. గురుతుల్యులను కలుస్తారు. కడుపునకు సంబంధించి ఇబ్బంది గోచరిస్తోంది.

వృశ్చికం

కార్యసాధనలో ఎన్నో విఘ్నాలు ఎదురవుతాయి. శత్రువులకు మీ బలహీనతే ఆయుధంగా మారుతుంది. తగాదాలకు దూరంగా ఉండాలి. పోటీలకు దిగకండి. అనుకోని విపత్తు గోచరిస్తోంది. ప్రయాణాల్లో జాగ్రత్త.

ధనుస్సు

ఇష్టమైన కార్యం సఫలమవుతుంది. ధన సంబంధ లావాదేవీలు సంతృప్తిగా సాగుతాయి. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. ప్రయాణం వల్ల మేలు జరుగుతుంది. బంధుమిత్రులతో విందుకు హాజరవుతారు.

మకరం

పని సజావుగా సాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త వస్తువులను కొంటారు. బంధువులు సహకరిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. కోర్టు లావాదేవీలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.

కుంభం

కార్యసాధనలో ఆటంకాలను దాటాల్సి వస్తుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. అభీష్టం నెరవేరక పోవడం ఆవేదనకు కారణమవుతుంది. అనవసర జోక్యం వల్ల గోడవలొస్తాయి. ఆధ్యాత్మిక ఆసక్తి వృద్ధి చెందుతుంది.

మీనం

వ్యావసాయిక భూమి లావాదేవీలు ఆశించినట్లుగా సాగవు. ధననష్టం గోచరిస్తోంది. బుద్ధి నిలకడ లేమి వల్ల బంధువులతోనూ విరోధం ఏర్పడుతుంది. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. ఆలోచన విధానంలో మార్పు వస్తుంది.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story