Horoscope Today: చేపట్టిన పని సక్సెస్ అవ్వాల్సిందే.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. మీరున్నారేమో చెక్ చేసుకోండి..!

Horoscope Today: చేపట్టిన పని సక్సెస్ అవ్వాల్సిందే.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. మీరున్నారేమో చెక్ చేసుకోండి..!
x

Horoscope Today: చేపట్టిన పని సక్సెస్ అవ్వాల్సిందే.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. మీరున్నారేమో చెక్ చేసుకోండి..!

Highlights

Horoscope Today: చేపట్టిన పని సక్సెస్ అవ్వాల్సిందే.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. మీరున్నారేమో చెక్ చేసుకోండి..!

(08-05-2024, బుధవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, చైత్ర మాసం, ఉత్తరాయణం, వసంతరుతువు, బహుళ పక్షం,

తిధి : అమావాస్య ఉదయం గం.8.51 ని.ల వరకు ఆ తర్వాత పాడ్యమి

నక్షత్రం: భరణి మధ్యాహ్నం గం.1.33 ని.ల వరకు ఆ తర్వాత కృత్తిక

అమృతఘడియలు: ఉదయం గం.9.09 ని.ల నుంచి గం.10.37 ని.ల వరకు

వర్జ్యం: అర్ధరాత్రి గం. 12.44 ని.ల నుంచి మే 9వ తేదీ తె.వా. గం. 2.14 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.11.47 ని.ల నుంచి మధ్యాహ్నం గం. 12.38 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం. 12.13 ని.ల నుంచి గం.1.49 ని.ల వకు

సూర్యోదయం : ఉదయం గం.5.47 ని.లకు

సూర్యాస్తమయం : సాయంత్రం గం.6.39 ని.లకు


మేషం : పనుల్లో శుభ ఫలితాలుంటాయి. నూతన ప్రయత్నాలకు అనువైన రోజు. ధనలాభం ఉంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. విందుల్లో పాల్గొంటారు. కుటుంబసౌఖ్యం ఉంటుంది. మిత్రులు తోడుగా ఉంటారు.


వృషభం : పనుల పూర్తికి బాగా శ్రమించాలి. సన్నిహితుల ప్రవర్తన మనసుకి కష్టం కలిగిస్తుంది. వేళకు భోజనం ఉండదు. కుటుంబ సభ్యుల వల్ల చికాకులుంటాయి. ధనం నిల్వ ఉండదు. ధైర్యంతో ముందుకు సాగండి.


మిథునం : ఆత్మవిశ్వాసంతో చేపట్టిన ప్రతి పనీ సఫలం అవుతుంది. ధనవృద్ధీ ఉంది. కీలక సందర్భంలో మిత్రులు తోడుగా ఉంటారు. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. సోదరవర్గం అండగా నిలుస్తుంది.


కర్కాటకం : మిత్రుల తోడ్పాటుతో అడ్డంకులను అధిగమిస్తారు. మనసు రకారకాలుగా భ్రమిస్తుంది. దుబారా ఖర్చులు, అవమానాలు గోచరిస్తున్నాయి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. అమ్మవారి పూజ శుభాన్నిస్తుంది.


సింహం : అనవసరంగా మీ తెలివితేటలను ప్రదర్శించకండి. పనులు సవ్యంగా సాగకపోవడం నిరాశను కలిగించినా, ఆత్మధైర్యాన్ని పెంచుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. వాత సంబంధ సమస్యలుంటాయి.


కన్య : రోజంతా జయప్రదంగా సాగుతుంది. ఇంటా బయటా సంబంధాలు మెరుగవుతాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. నూతన వస్తువులు కొంటారు. మీ శత్రువులు డీలా పడతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.


తుల : పనులన్నింటా విజయం లభిస్తుంది. డబ్బు సమస్య ఉండదు. నూతన వస్తువులు కొంటారు. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ వ్యవహారాలు సరిదిద్దుతారు. ప్రయాణాలు ఉపయుక్తంగా సాగుతాయి.


వృశ్చికం : కార్యసాధనకు శ్రమించాలి. ఆటంకాలను దాటేస్తారు. ఆశించిన ఆదాయం లభించదు. జీవితభాగస్వామి వైపు వారితో విభేదాలు గోచరిస్తున్నాయి. తగాదాలకు దూరంగా ఉండండి. జననేంద్రియ సమస్యలుంటాయి.


ధనుస్సు : మిశ్రమ ఫలితాలుంటాయి. స్వజనులే శత్రువులుగా వ్యవహరిస్తారు. దూర ప్రాంతానికి వెళ్లాల్సి రావచ్చు. అశాంతి ఏర్పడుతుంది. బలహీనతలు బయటపెట్టకండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.


మకరం : ఇష్టకార్యాలు నెరవేరతాయి. స్థిరనిర్ణయంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. పెద్దల ఆదరాభిమానాలు పొందుతారు. ఇంట్లోను మనసులోనూ శాంతి నెలకొంటుంది. కీర్తిప్రతిష్టలు వృద్ధి చెందుతాయి.


కుంభం : శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. అప్పులు తీర్చే ప్రయత్నాలు ఫలిస్తాయి. విందుల్లో పాల్గొంటారు. సంతానం పురోభివృద్ధి ఆనందాన్నిస్తుంది. ఆరోగ్యవృద్ధి ఉంది.


మీనం : జాగ్రత్తతో మెలగాలి. మిత్రుల తోడ్పాటుతో ఆపద నుంచి బయటపడతారు. అనవసర ప్రయాణాలు, దుబారా ఖర్చులు వద్దు. వేళకు భోజనం ఉండదు. ఇతరుల వృద్ధికి అసూయ చెందకండి. ఇష్ట దైవాన్ని పూజించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories