Horoscope Today: ఈ రాశి వారికి వద్దంటే డబ్బు.. అన్నీ మంచి రోజులే..

Horoscope today in Telugu 14th May 2024
x

Horoscope Today: ఈ రాశి వారికి వద్దంటే డబ్బు.. అన్నీ మంచి రోజులే..

Highlights

Horoscope Today: ఈ రాశి వారికి వద్దంటే డబ్బు.. అన్నీ మంచి రోజులే..

(తేది: 14-05-2024, మంగళవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత రుతువు, శుక్ల పక్షం

తిధి : సప్తమి పూర్తి

నక్షత్రం: పుష్యమి మధ్యాహ్నం గం.1.05 ని.ల వరకు ఆ తర్వాత ఆశ్లేష

అమృతఘడియలు: ఉదయం 6.14 ని.ల నుంచి గం.7.57 ని.ల వరకు

వర్జ్యం: మే 15 తెల్లవారుఝాము గం.3.08 ని.ల నుంచి గం.4.53 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.20 ని.ల నుంచి గం.9.11 ని.ల వరకు తిరిగి రాత్రి గం.11.06 ని.ల నుంచి గం.11.50 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.3.27 ని.ల నుంచి సాయంత్రం గం.5.04 ని.ల వరకు

సూర్యోదయం : ఉదయం గం.5.44 ని.లకు

సూర్యాస్తమయం : సాయంత్రం గం.6.41 ని.లకు


మేషం :

పనుల్లో ఆటంకాలు, కార్యాల్లో నష్టాలు, అధిక ఖర్చులు చికాకు పరుస్తాయి. రహస్యాలు బయటపెట్టకండి. ఇతరులను నిందించడం వల్ల ప్రయోజనం లేదు. వాహనాలకు మరమ్మతులు గోచరిస్తున్నాయి.


వృషభం :

నేర్పరితనంతో కార్యాలు సాధిస్తారు. విశేష లాభాలున్నాయి. ఇరుగు పొరుగువారితో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలక సమాచారం అందుతుంది. మిత్రులు తోడుగా ఉంటారు. ఆత్మధైర్యం పెరుగుతుంది.


మిథునం :

మాటకు విలువ తగ్గడం గమనిస్తారు. బ్యాంకు వ్యవహారాల్లోనూ ప్రతికూలతలున్నాయి. మానసిక అశాంతి ఏర్పడుతుంది. వేళకు భోజనం ఉండదు. ఖర్చులు పెరుగుతాయి. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.


కర్కాటకం:

మీ ఆలోచనలు సవ్యంగా సాగుతాయి. ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. సౌకర్యాలను సమకూర్చుకుంటారు. బంధువులను కలుస్తారు. పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి.


సింహం:

అనుకోని చికాకులు తలెత్తుతాయి. రహస్య కార్యకలాపాలు బయటపడి అవమానానికి గురయ్యే వీలుంది. దూర ప్రాంతానికి వెళ్లాల్సి రావచ్చు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త. ఆసుపత్రిని సందర్శించే సూచన ఉంది.


కన్య:

ఆనందమయంగా ఉంటుంది. డబ్బుకి పెద్దగా ఇబ్బంది ఉండదు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల కలయిక మానసిక శాంతిని కలిగిస్తుంది. ఇతరులూ మీ ఘనతను గుర్తిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది.


తుల:

స్థిర నిర్ణయంతో చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ఆదాయం మెరుగవుతుంది. పెద్దల ఆశీస్సులతో కీలక సమస్యను పరిష్కరిస్తారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. కీర్తి పెరుగుతుంది.


వృశ్చికం:

కొత్త విషయాలు తెలుస్తాయి. చట్ట సంబంధ వ్యవహారాల్లో జాగ్రత్త. సోదరుల స్నేహితుల సాయంతో సమస్య నుంచి గట్టెక్కుతారు. పుణ్యక్షేత్ర సందర్శన గోచరిస్తోంది. మీ వివేకానికి అదృష్టం తోడవుతుంది.


ధనుస్సు:

అడ్డంకులు సృష్టించే వారు పెరుగుతారు. పనుల పూర్తికి బాగా శ్రమించాలి. రుణ సమస్యలు చికాకు పెడతాయి. స్వల్ప తగాదాలు గోచరిస్తున్నాయి. చెడు ఆలోచనలు మానండి. ఆకస్మిక ధనలాభం ఉంది.


మకరం:

కోర్టు వ్యవహారాల్లో జయం. మధ్యవర్తిత్వ ప్రయత్నాలు సఫలం అవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. పోయిన సొత్తు తిరిగి లభించే సూచన ఉంది. బంధుమిత్రులను కలుస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి.


కుంభం:

శుభప్రదంగా ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. తల్లి పుట్టింటి వారి నుంచి శుభ వర్తమానం అందుతుంది. కంటి సమస్య తీవ్రంగా వేధిస్తుంది.


మీనం:

ఆలోచనాశక్తి సన్నగిల్లుతుంది. శత్రుపీడ ఎక్కువవుతుంది. లాటరీ, షేర్ల వంటి వ్యవహారాల్లో నష్టపోయే సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాలూ బెడిసికొడతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి.

Show Full Article
Print Article
Next Story
More Stories