Weekly Horoscope 30 June To 06 July 2024: వారఫలాలు.. ఇష్టం లేని పనులు చేస్తే ఈ రాశివారు కష్టాల్లో పడ్డట్లే..

Weekly Horoscope 30 June To 06 July 2024: వారఫలాలు.. ఇష్టం లేని పనులు చేస్తే ఈ రాశివారు కష్టాల్లో పడ్డట్లే..

P Vijay Kumar Astrologer
Updated on: 30 Jun 2024 7:00 AM IST
Horoscope In Telugu 30 June To 06 July 2024
X

Weekly Horoscope 30 June To 06 July 2024: వారఫలాలు.. ఇష్టం లేని పనులు చేస్తే ఈ రాశివారు కష్టాల్లో పడ్డట్లే..

(30-06-2024 నుంచి 06-07-2024 వరకు)


మేషం

చేపట్టిన కార్యాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. విద్య, ఉద్యోగ రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. బంధువర్గాన్ని కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. మానసిక స్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. కీలక సమాచారం అందుతుంది. నూతన విషయాలు తెలుస్తాయి. కృషికి తగ్గ ప్రశంసలను పొందుతారు. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. మానసిక స్థితి ఉత్సాహభరితంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాల్సి వుంటుంది.


వృషభం

పనులకు ఏర్పడే ఆటంకాలను అధిగమిస్తారు. వ్యవహారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. వృథా ఖర్చులను అదుపు చేయాలి. కీలక సమయంలో అదృష్టం తోడవుతుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. అనవసరపు ప్రయాణాలను వాయిదా వేయండి. ఎవరికీ పూచీని ఇవ్వకండి. బంధువర్గంలో ఒకరి ఆరోగ్యం కలవరపరుస్తుంది. కుటుంబంలో కొత్త చిక్కులొస్తాయి. విరోధాలకు దూరంగా ఉండండి.


మిథునం

వ్యవహారాలు శుభప్రదంగా ఉంటాయి. ధనలాభం ఉంది. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. ప్రతిష్ట పెరుగుతుంది. విద్యార్థులు, ఉద్యోగులకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైన వారితో విందులో పాల్గొంటారు. అప్పులు చెల్లించే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బావుంటుంది. శత్రుపీడ తగ్గుతుంది. ఇంట్లో శుభకార్య నిర్వహణ యత్నాలు చేస్తారు. బంధుమిత్రులు సహకరిస్తారు. బద్ధకం వదిలిపెట్టాలి. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. అపోహలు పెంచుకోకండి.


కర్కాటకం

ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. అన్నింటా అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగులకు రివార్డులు, ప్రమోషన్లకు ఆస్కారం ఉంది. అందివచ్చే అవకాశాలను చేజార్చుకోకండి. ఇతరులతో ఏర్పడే వివాదాల్లో మీకే జయం దక్కుతుంది. ఇంటి వాతావరణం సంతృప్తినిస్తుంది. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. నూతన స్నేహాలు లాభదాయకంగా ఉంటాయి. ఆత్మీయులతో శుభకార్యాలు, విందుల్లో పాల్గొంటారు. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ప్రయాణాల్లో ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.


సింహం

పట్టింది బంగారంలాగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనీ నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. మేలిమి అవకాశాలు అందివస్తాయి. స్థిరనిర్ణయంతో ముందుకు సాగండి. అధికారులు, పెద్దల ఆశీస్సులను పొందుతారు. అభీష్టం నెరవేరుతుంది. విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. మానసిక, శారీరక సౌఖ్యాన్ని పొందుతారు. వారం చివరలో ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త. వీలైనంత మేర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.


కన్య

ప్రతి కార్యానికీ అవరోధాలుంటాయి. స్థిర నిర్ణయాలతో ఆటంకాలను దాటేస్తారు. అభీష్టం నెరవేరుతుంది. పెద్దలు, అధికారుల ఆదరాభిమానాలను పొందుతారు. చక్కటి అవకాశాలు అందివస్తాయి. గౌరవం పెరుగుతుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. చెప్పుడు మాటలు వినకండి. బంధువులతోనే అకారణ విరోధాలకు ఆస్కారం ఉంది. కీళ్లు, జీర్ణ సంబంధ చికాకులుంటాయి. దూర ప్రదేశాలకు వెళ్లే సూచన ఉంది. భవిష్యత్తుకు సంబంధంచిన ప్రణాళికలు రూపొందిస్తారు. త్వరగా అలసిపోతారు. దైవకార్యాలు పాల్గొంటారు.


తుల

కీలకమైన వ్యవహారాలను వారం ప్రారంభంలోనే చేపట్టండి. యత్నకార్యాలు సఫలమవుతాయి. అవసరాలకు సరిపడినంత డబ్బు సమకూరుతుంది. వృథా ఖర్చులను అదుపు చేయాలి. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. బంధుమిత్రులను కలుస్తారు. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. ఎవరిపైనా దురభిప్రాయాలు ఏర్పరచుకోకండి. కొన్నిసార్లు ఇష్టంలేని పనులు చేయాల్సి వస్తుంది. దూర ప్రాంతాలకు వెళతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.


వృశ్చికం

కార్యాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ధనలాభం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక తరుణంలో మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. విందుల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సూచనలు పాటించడం వల్ల బంధువుల్లో ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త వస్తువులను కొంటారు. బంధాలు బలపడతాయి. ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అనువైన సమయం. తగాదాలకు దూరంగా ఉండండి. పైత్య సంబంధ సమస్యలుంటాయి.


ధనుస్సు

ప్రారంభంలో స్వల్ప చికాకులుంటాయి. అవరోధాలన్నింటినీ దాటేస్తారు. చేపట్టిన కార్యాలు విజయవంతం అవుతాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. ఆదాయమార్గాలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలను అమలు చేయకండి. మిత్రుల తోడ్పాటు తీసుకోండి. జీవిత భాగస్వామి సూచనలు కుటుంబ వ్యవహారాలను చక్కబరుస్తాయి. ఇరుగుపొరుగుతో బంధాలు గట్టిపడతాయి. నూతన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి. మనశ్శాంతిని పొందుతారు. విలువైన వస్తువులను జాగ్రత్త పరచుకోండి.


మకరం

కార్య సాధనకు బాగా కష్టపడాల్సి ఉంటుంది. అడుగడుగునా ఆటంకాలు ఉంటాయి. అపోహలకు దూరంగా ఉండాలి. ఆలోచనలను అదుపు చేసుకోవాలి. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. వృథా ఖర్చులు అదుపు చేయాలి. సంతానం తీరు చికాకు పెడుతుంది. కీలక వ్యవహారాల్లో ఆత్మీయుల సూచనలను తీసుకోండి. తల్లి లేదా తత్సమానమైన వారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆస్తి విక్రయ ప్రయత్నాలు వాయిదా వేయండి. వాత సంబంధ సమస్యలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.


కుంభం

అవరోధాలున్నా పనులు పూర్తవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. భూసంబంధ వ్యవహారాలు ఆశించినట్లుగా సాగవు. విద్యారంగంలోని వారికి సమస్యలొస్తాయి. మీ మేథస్సుకు తగిన గుర్తింపు లభించదు. సోదర వర్గం సహకారంతో చిక్కుల నుంచి బయటపడతారు. దీర్ఘకాలం తర్వాత ఆత్మీయులను కలుస్తారు. సంతానంతో సమస్యలు వస్తాయి. అనారోగ్యం బారిన పడ్డవారు కోలుకుంటారు. ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. బద్ధకాన్ని వదిలి, ఆత్మస్థైర్యంతో ఒత్తిడిని జయించాలి.


మీనం

వ్యవహారాల పూర్తికి ఆటంకాలను దాటాల్సి వుంటుంది. అవసరానికి సరిపడినంత డబ్బు అందుతుంది. అయితే వృథాఖర్చులు చికాకు పెడతాయి. ఇతరుల కారణంగా సమస్యల్లో చిక్కుకుంటారు. ఇచ్చిన మాట తప్పడం వల్ల మాట పడాల్సి వస్తుంది. పలుకుబడి తగ్గుతుంది. సోదర వర్గం తోడ్పాటుతో కీలక సమస్య నుంచి గట్టెక్కుతారు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. వేళకు భోజనం ఉండదు. ఆత్మీయుల కలయిక ఆత్మధైర్యాన్ని పెంచుతుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కంటిసమస్యలను నిర్లక్ష్యం చేయకండి.

P Vijay Kumar Astrologer

P Vijay Kumar Astrologer

Next Story