Flowers: ఫ్రిజ్‌లో పెట్టిన పూలతో దేవుడికి పూజ చేస్తే ఏం జరుగుతుంది తెలుసా?

Fridge Flowers for Pooja Pandit Suggestions
x

Flowers: ఫ్రిజ్‌లో పెట్టిన పూలతో దేవుడికి పూజ చేస్తే ఏం జరుగుతుంది తెలుసా?

Highlights

Flowers: ఈ బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలామందికి ఒక అలవాటు. పూజకు కావలసిన పువ్వులు, ఇతర వస్తువులు ముందే కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం.

Flowers: ఈ బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలామందికి ఒక అలవాటు. పూజకు కావలసిన పువ్వులు, ఇతర వస్తువులు ముందే కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం. ముఖ్యంగా పూజ సమయానికి పువ్వులు తరిగిపోతాయని, బజార్ వెళ్లే సమయం ఉండదనే భయంతో చాలామంది ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. అయితే, ఇలా ఫ్రిజ్‌లో పెట్టిన పువ్వులను దేవుడికి పూజలో ఉపయోగించడం గురించి పండితులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

ఫ్రిజ్‌లో పువ్వులు ఉంచితే అవి బయట ఉంచినప్పుడు వాడిపోవడం తక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది ఫ్రిజ్‌లోనే పూలు నిల్వ చేస్తారు. కానీ అదే ఫ్రిజ్‌లో మాంసాహారం, ఇతర ఆహార పదార్థాలు కూడా ఉంచుతారు కాబట్టి, ఆ పవిత్రమైన పువ్వుల పవిత్రత తగ్గిపోతుందనే అభిప్రాయాన్ని పండితులు వ్యక్తం చేస్తున్నారు.

దేవుడికి అర్పించే పువ్వు ఎంత చిన్నదైనా శుభ్రంగా, పవిత్రంగా ఉండాలి. వాటిని శుభ్రంగా నీటితో కడిగి, పరిశుభ్రంగా ఉంచి పూజలో వినియోగించాలి. అయితే ఫ్రిజ్‌లో ఇతర పదార్థాలతో కలిపి ఉంచిన పువ్వులను ఉపయోగించడం వల్ల పూజ ఫలితం తగ్గిపోవచ్చని, లేదా పూర్తిగా ఫలితం రాకపోవచ్చని పండితులు చెబుతున్నారు.

పువ్వులు తాజాగా ఉంచాలంటే ఈ విధంగా చేయండి

పువ్వులు సరళంగా అందుబాటులో లేకపోతే — తెల్లటి శుభ్రమైన వస్త్రంలో ఉంచి, ఆ పై తడి వస్త్రంతో లేదా కొద్దిగా నీళ్లు చల్లుతూ ఉంచాలి. ఇలా చేయడం వల్ల పువ్వులు రెండు రోజుల వరకు తాజాగా ఉంటాయి. పూలు ఎప్పుడూ శుభ్రంగా, పరిశుభ్రమైన స్థలంలోనే ఉంచాలి. గుడ్లు, మాంసం వంటివి ఉండే ఫ్రిజ్‌లో మాత్రం దేవుడికి ఉపయోగించబోయే పువ్వులను పెట్టవద్దని పండితులు స్పష్టంగా సూచిస్తున్నారు.

పూజలో ఉపయోగించే ప్రతి వస్తువు పవిత్రంగా ఉండాలి. పువ్వులు మాత్రమే కాదు, నీళ్ళు, పళ్ళు, నైవేద్యమూ శుభ్రతతో, పవిత్రతతో చేయడం వల్లే పూజ ఫలప్రదమవుతుంది. అందుకే పండితుల సూచనల మేరకు పూలను నిల్వ చేయడంలో జాగ్రత్తగా ఉండటం మంచిదని చెబుతున్నారు.

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. hmtv దీన్ని ధృవీకరించలేదు.)

Show Full Article
Print Article
Next Story
More Stories